Intinti Gruhalakshmi 19th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 19-july-2022 ఎపిసోడ్ ముందుగా మీకోసం, సామ్రాట్ కి చేయిన్ ని ఇచ్చిన తులసి, తులసిని మళ్లీ అవమానించిన సామ్రాట్

Intinti Gruhalakshmi 19th July Today Episode : తులసికి వాళ్ళింటి గార్డెన్లో హనీ చెయిన్ దొరుకుతుంది. తులసి వెంటనే తీసుకెళ్లి సామ్రాట్కి ఇస్తానంటే ఇంట్లోవాళ్లు వద్దు అని చెప్తారు. దివ్య ఎక్కడిది అంటే ఏం చెప్తాం మమ్మీ ఆయన నమ్మారు కదా అని అంటోంది. ఎందుకు నమ్మరు మన గార్డెన్లో దొరికిందని చెప్తాను అని తులసి అంటోంది. అనుమానం ఉన్న వాళ్లకి ఎంత చెప్పినా నమ్మరని మీరే చెప్పారు కదా ఆంటీ అని అంకిత అంటోంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని తులసి అంటోంది.నువ్వే దొంగతనం చేశావు అడిగేసరికి భయపడి నువ్వే తీసుకొచ్చి ఇచ్చావు అని అంటాడు తులసి వల్ల మామయ్య.

Advertisement

ఇది హాని పాప చెయును తనది మా దగ్గర ఉంచుకోవడం మంచిది కాదు కదా అని తులసి అంటోంది.ఇలా మంచితనానికి పోయి ప్రతిసారీ ఎదురు దెబ్బలు తింటున్నారు ఆంటీ అని అంకిత అంటోంది.అందుకని మంచితనాన్ని మర్చిపొమ్మంటావా అంకిత అమ్మకానికి కూడా ఉపకారం చేయమని అంటారు అని అంటోంది తులసి, మంచి చేయాలి అనుకున్నప్పుడు చేసేయాలి ఫలితాన్ని ఆశించకూడదు, దేవుడు అన్యాయం చేయడు. చేయని తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొక తప్పు చేయకూడదు అని అంటోంది తులసి.

Advertisement
Intinti Gruhalakshmi 19th July Today Episode
Intinti Gruhalakshmi 19th July Today Episode

తరువాత తులసి సామ్రాట్ వాళ్ళ ఇంటికి వెళుతుంది, పనివాళ్లు ఎవరు అని అడిగితే తులసి వచ్చాను అని చెప్పండి సామ్రాట్ గారే పిలుస్తారు అని చెపుతుంది. తులసి సామ్రాట్ దగ్గరికి వెళ్లి ఆ చెయిన్ ని ఇస్తుంది. భయము అంటే ఇలా ఉండాలి అని సామ్రాట్ అంటాడు. అప్పుడు తులసి భయముతో కాదు దొరికింది కాబట్టే తెచ్చాను అని అంటుంది. మా వాళ్లు మొత్తం గాలించినా దొరకలేదు ఇప్పుడు పట్టుకొచ్చావు, గార్డెన్లో దొరికింది అని అబద్ధం చెప్తావు అంతే కదా అని సామ్రాట్ అంటాడు. అది అబద్ధం కాదు నిజమని తులసి అంటుంది, కానీ సామ్రాట్ నమ్మడు.

Intinti Gruhalakshmi 19th July Today Episode : సామ్రాట్ కి చేయిన్ ని ఇచ్చిన తులసి, తులసిని మళ్లీ అవమానించిన సామ్రాట్

ఇలా సామ్రాట్, తులసి కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, ఎంత చెప్పినా తులసి మాటలను సామ్రాట్ నమ్మడు. మీరు ఇలా అవమానిస్తారు అని ముందే మా ఇంట్లో వాళ్లు చెప్పిన మీ దగ్గరికి వచ్చాను. ఎందుకో తెలుసా, ఈ గొలుసు మీ చెల్లెలి జ్ఞాపకం అని చెప్పారు కాబట్టి, బంధుత్వం విలువ, బంధాల విలువ, దూరమైనవారి విలువ, ఆ జ్ఞాపకాల విలువ, తెలిసిన దాన్ని కాబట్టే తీసుకొచ్చాను అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత హనీ పాప డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది తులసి బొమ్మని, నేను చెప్పిన అబద్ధం వల్ల మీరింత బాధపడుతున్నారు ఆంటీ అని అనుకుంటూ వేస్తుంది.

ఇంతలో సామ్రాట్ తన దగ్గరికి వస్తాడు. ఆ పాప డ్రాయింగ్ని దాచిపెడుతోంది. ఏంటి ఇంకా పడుకోలేదా ఏం చేస్తున్నావ్ హనీ అని అడగగానే, రేపు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది స్కూల్లో అని మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను పంజరంలో చిలకలాగా ఎందుకు పెoచుతున్నానో తెలుసా, నిన్ను కాపాడుకోవడానికి వేరే దారిలేక. చుట్టూ ఉన్న మనుషులు చెడ్డవారు అమ్మ డబ్బు కోసం ఏదైనా చేస్తారు. అందుకే చెబుతున్నాను తులసికి దూరంగా ఉండు అని అంటాడు సామ్రాట్.

నీకు దూరంగా నేను ఉండలేను అమ్మ.తులసి ప్రేమతో నీకు దగ్గర అవుతుంది తన మాయమాటలు నమ్మొద్దు తులసికి దూరంగా ఉండమని చెప్తాడు, పాపతో సామ్రాట్. సామ్రాట్ ఏం డ్రాయింగ్ని వేసావు అని అనగానే పాప బుక్ ఇస్తుంది. ఇంతలో ఫోన్ రావడంతో సామ్రాట్ పడుకోమని, అర్జెంట్ కాల్ వచ్చిందని చెప్పి వెళ్లిపోతాడు.తులసి సంగీతం నేర్పించడానికి ఒకరింటికి వెళుతుంది. అప్పుడు ఆమె చాలా రోజులయ్యింది మీ ఇంట్లో సంబరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయ, మీ ప్రేమ్ విన్నర్ అయ్యాడు కదా అని దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది.

అప్పుడు మీరు మ్యూజిక్ స్కూల్ పెడతామన్నారు కదా అని అడగగానే, లోన్ దొరకలేదు అని తులసి అంటుంది. అయ్యో నాకు చెప్పొచ్చు కదా, నాకు తెలిసిన ప్రిన్సిపాల్ ఉన్నారు నేను మాట్లాడతాను, మీరు వెళ్ళి కలవండి అని, ఆమె అంటోంది తులసితో. తులసి చాలా సంతోషపడుతుoది. తర్వాత శృతి పనిచేసే దగ్గర ఓనరు పేపర్ చూస్తూ ఉంటాడు. అందులో ప్రేమ్ విన్నర్ అయిన ఫోటో ఉంటుంది. దాంతో వీడు నా దగ్గర పనిచేసి అంత గొప్పవాడు అయ్యాడా అని చూస్తూ ఉంటాడు. ఇంతలో శృతి టీ తీసుకొచ్చి నేను ఇక నుంచి పనిలోకి రాను సార్ అని అంటుంది.

అప్పుడు అందులో శ్రుతి ఫొటోను కూడా చూసి అనుకున్నానని ఇప్పుడు మీ ఆయన గొప్ప వాడు అయ్యాడు కదా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు.ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు తను గెలిచిన విషయం ఓనర్కి చెప్పడానికి. ప్రేమ్ అక్కడ శృతి ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ ఓనర్ శృతి, ప్రేమ్ లను చాలా ఘోరంగా అవమానిస్తాడు. పెళ్ళాన్ని పనికి పంపుతున్నావా నీకు పోషించే స్థోమత కూడా లేదు అని చాలా వెటకారంగా మాట్లాడతాడు.

దాంతో ప్రేమ్ కి చాలా కోపం వస్తుంది. తులసి వాళ్ళ ఫ్రెండ్, తులసిని తీసుకొని ప్రిన్సిపల్ దగ్గరకి వెళుతుంది రూమ్ రెంట్ గురించి మాట్లాడటానికి. అక్కడే హనీ తులసిని చూసి ఆంటీ అని అంటుంది. అప్పుడు తులసి నేను పైకి రానా అంటే లేదు ఆంటీ లిఫ్టులో నేనే వస్తాను అని అంటుంది. కరెంట్ పోవటంతో లిఫ్ట్ ఆగిపోతుంది. అప్పుడే పాపకి లంచ్ బాక్సు తీసుకుని వస్తాడు సామ్రాట్ అక్కడికి.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement