Intinti Gruhalakshmi 20th July Today Episode : హనీ పాపను కాపాడిన తులసిని ఇప్పుడైనా సామ్రాట్ అర్థం చేసుకుంటాడా.

Intinti Gruhalakshmi 20th July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 20-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం….. సామ్రాట్ స్కూల్కి వస్తాడు. ఇంతలో హాని పాప లిఫ్ట్లో ఇరుక్కుపోతుంది.తులసి ఎలక్ట్రీషియన్ని పిలిపించారా వెంటనే ఎవరినైనా పిలిపించండి అలాగే డాక్టర్ కూడా పిలిపించండి అనే తులసి అంటోంది .ఇంతలో ఏమయింది అని సామ్రాట్ ఒకరిని అడిగితే ఒక పాప లిఫ్టులో ఇరుక్కుపోయింది ఆ పాప పేరు హనీ అని చెప్పగానే సామ్రాట్ హాని అని అరుస్తూ వెళ్తాడు.ఇకపోతే లిఫ్ట్లో ఉన్న పాప నాకు భయమేస్తోంది ఆంటీ అని ఏడుస్తూ ఉంటుంది. ఏం కాదు అమ్మా భయపడకు నేనున్నాను కదా అని తులసి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సామ్రాట్ వస్తాడు. తులసిని చూసి ఆశ్చర్యపోతాడు.

Advertisement

నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా మా పాప స్కూల్లో నీకేం పని అని అంటాడు సామ్రాట్ తులసిని.హాని నీకేం కాదమ్మా నేను వచ్చాను అని అంటాడు సామ్రాట్. ఇక్కడ టీచర్ అక్కడ ఏమైంది అసలు ఎప్పటినుంచో లిఫ్టులో ఉందో అసలు మీరేం చేస్తున్నారో అని కోప్పడతాడు సామ్రాట్.చూశారా ఎలా ఏడుస్తుందో ఇంతవరకూ నా పాప పుట్టిన దగ్గర్నుంచీ ఏడవలేదు అసలు ఏం చేస్తున్నారు. ఇదేనా మీ బాధ్యత అని కోప్పడతాడు.మమ్మల్ని అంటారేంటిసార్ తులసిగారిని చూసి పాపనే పరిగెత్తుకుంటూ వచ్చి లిఫ్ట్ లోకి ఎక్కింది. మాది ఏం తప్పులేదు అని టీచర్ చెబుతుంది.

Advertisement
Intinti Gruhalakshmi 20th July Today Episode
Intinti Gruhalakshmi 20th July Today Episode

దాంతో సామ్రాట్ చూశావా ఇదంతా నీ వలన మమ్మల్ని వదిలేయండి అని చేతులెత్తి దండం పెట్టి చెప్తూ వుంటాడు. నిన్ను జైలుకి పంపిస్తున్నందుకు మా పాపను ఇలా చేస్తున్నావా అని కోపంగా అంటాడు సామ్రాట్. ఏం మాట్లాడుతున్నారు సార్ నాకు కూడా పిల్లలున్నారు నేనలా చెయను. ముందు పాప గురించి ఆలోచించి నేను ఒకసారి పాపతో మాట్లాడతాను అంటే మాట్లాడనివ్వకుండా తనతో గొడవ పడుతూనే ఉంటాడు. ఇంతలో సామ్రాట్ వాళ్ల బాబాయి వచ్చే సామ్రాట్ని బయటికి తీసుకెళ్తాడు.ఎందుకు పిచ్చోళ్లుగా ప్రవర్తిస్తున్నావు అని అంటాడు సామ్రాట్ వల్ల భాబాయ్ దానికి కారణం మీ తులసీ నే అని అంటాడు సామ్రాట్.

Intinti Gruhalakshmi 20th July Today Episode : హనీ పాపను కాపాడిన తులసిని ఇప్పుడైనా సామ్రాట్ అర్థం చేసుకుంటాడా.

నా తులసి అని అంటున్నావు ఏంటి అని అడుగుతాడు వల్ల భాబాయ్ నువ్వేకదా జైలునుంచి విడిపించిది. అందుకే అంతా ఇలా చేస్తుంది అని సామ్రాట్ అంటాడు. నీ కూతురు బ్రతికి ఉందంటే దానికి కారణం తులసి అనే వాళ్ల బాబాయ్ చెప్తాడు .చూడు ఒక సారి తులసిని కన్నతల్లి కంటే ఎక్కువ ఆరాట పడుతుంటే అలాంటి తులసిని అవమానించకు.హానిని కచ్చితంగా తులసి రక్షిస్తుంది. నీ చేతికి అప్పగిస్తుంది నా మాట విను నన్ను నమ్ము అని సామ్రాట్ వాళ్ల బాబాయి చెప్తూ ఉంటాడు. ఇంతలో ఎలక్ట్రిషియన్ వస్తాడు ఏంటి ఇంత ఆలస్యం తొందరగా వెళ్ళి చూడు అని తులసి ఎలక్ట్రీషన్గి కోప్పడుతుంది.

అలాగే మేడం అని వెళ్తాడు. ఇంతలో డాక్టర్ కూడా అక్కడికి వస్తాడు ఎంతసేపు అయ్యింది ఇలా జరిగి అని అడుగుతాడు డాక్టర్. పది నిమిషాలు అయి౦ది సార్ అని చెప్పగానే లోపల ఆక్సిజన్ అందక పోతే పాపకి చాలా కష్టం అని డాక్టర్ చెప్పగానే తులసి చాలా భయపడుతోంది. లోపల్నుంచి పాపా ఆంటీ ఆంటీ నాకు కళ్లు మూతలుపడుతున్నాయి అని చెప్తూ వుంటుంది పాప.ఏం భయపడకమ్మా నేనున్నాను నువు కంగారు పడకు అని చెప్తుంది. తులసి నేను చెప్పేది జాగ్రత్తగా విను అని తులసి అంటోంది.నేను చెప్పేది విను ధైర్యంగా వుండు అని అంటోంది.

తులసి నేను చెప్పినట్లు చేస్తే వెంటనే బయటకు వస్తావు అని అంటోంది తులసి. నిజాంగ వస్తానా ఆంటీ అనే పాప అడుగుతుంది. అవునమ్మా నిజంగా వస్తావు అని అంటుంది. నెమ్మదిగా కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకో ఇప్పుడు నెమ్మదిగా కళ్లు తెరిచి చూడు చుట్టూ వెలుతురు ఉంటుంది అని చెప్తోంది. అలాగే చేస్తుంది పాప కూడా వెంటనే అక్కడ లోపల లైటు వస్తుంది.మీ పక్కనే నేను కూడా ఉంటాను కనిపించానా చూడమ్మా అని అంటోంది తులసి అవునంటి కనిపిస్తున్నారు అని అంటుంది పాప. నువు భయపడాల్సిన పని లేదమ్మా నేను ని పక్కనే ఉన్నాను అని అంటోంది.

అలాగే నువు నా ఒళ్ళో పడుకో అని అంటోంది. నేనొక పాట పాడతాను వీను అని చెప్పగానే. అలాగె పాప లోపల తులసి ఉన్నట్టు తన ఒళ్లో పడుకున్నట్టు అంతా ఊహించుకుంటూ ఉంటుంది అది చూసి సామ్రాట్ ఆశ్చర్యపోతాడు. తులసి మంచిగా జోలపాట పాడుతూ ఉంటుంది.హాని పాప లోపల అలాగే నిద్ర పోతూ ఉంటుంది.ఇంతలో ఎలక్ట్రీషియన్ రిపేర్ చేస్తాడు. హాని బయటికి వస్తుంది తులసిని హాక్ చేసుకుంటోంది తులసి పాపని ముద్దు పెడుతూ దగ్గరికి తీసుకుంటుంది.ఏం కాదమ్మా ధైర్యంగా వుండు ఇక ఏం కాదు అని తులసి పాపని దగ్గరగా తీసుకుంటోంది.

సామ్రాట్ అలాగే చూస్తూ నిలబడతాడు.పాపం తరవాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్నా నాకు ఏం కాదు అంటి ఉందికదా అని చెపుతోంది. ఇంతలో సామ్రాట్ తులసితో ఏదో చెప్పబోతే తులసి దండం పెట్టి అక్కడి నుండి వెళ్లిపోతుంది. చీకటి పడిన తర్వాత శ్రుతి, ప్రేమ్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ప్రేమ్ బాగా తాగి ఇంటికి వస్తాడు.ప్రేమ్ రావడం రావడమే అవసరం లేదు నీ సపోర్ట్ నాకవసరం లేదు నా కాళ్ళమీద నేను నిలబడగలను ప్రపంచానికే మొత్తానికి నిరూపించావు కదా. పెళ్ళాం సపోర్టు లేనిదే నాకు బతకడం చాతకాదని నిరూపించావు కదా.పద నన్ను భుజానికి ఎక్కించుకొని ఊరందరికీ నిరూపించు పద అని ప్రేమ్ కోప్పడతాడు.

ఎందుకలా మాట్లాడుతున్నా ప్రేమ్ ఎందుకలా నన్ను అంటున్నావు అని శృతి అంటు౦ది.పబ్లిక్లో లొ నా పరువు తీశావ్ నీ మొగుణ్ణి బతికున్న శవాన్ని చేసావు నాది సోమరిపోతు తనం అని మీ సార్ అన్నాడు. రోడ్డు మీద పడి అడుక్కుతినే వాడిని అని.అప్పుడు మీ సార్ అన్ని మాటలంటుంటే ఆపలేదు కానీ ఇప్పుడెందుకు ఆపుతున్నావవు అని ప్రేమ్ అంటాడు. ఎందుకలా మాట్లాడుతున్నావ్ ప్రే మ్ ఎప్పుడూ నేను నీ అడుగుజాడల్లోనే నడిచాను కథ ప్రేమ్ ఎందుకు నన్నలా అంటున్నావు అని శృతి అంటోంది. మన పెళ్ళయిన క్షణం నుండి ప్రతి అడుగు ని వెనకాలె వేశాను నీతోపాటే కష్టాలు పంచుకున్నాను.అని శృతి అనగానే అంటేని అర్థమేంటి పెళ్ళయిన దగ్గర్నుంచీ నిన్ను కష్టపడుతున్నాననే కదా.

అదే మి ఆడవాళ్ళు తెలివిగా అనాల్సినవన్నీ అని నా ఉద్దేశం అది కాదు అనే కవరింగ్ చేస్తూ ఉంటారు అని ప్రేమ అంటాడు. నువ్వు పనిమనిషిలాగా చేస్తున్న విషయం నాకెందుకు చెప్పలేదు నాకు నీ మీద నమ్మకం పోయింది. నువ్వు నీ ప్రేమని నమ్మను అని ప్రేమ్ అంటాడు. ని కన్నీళ్లను నమ్మను అని ప్రేమ్ గట్టిగా అంటాడు.ఒక్క నిజాన్ని దాటి పెట్టినప్పుడు పోయిన నమ్మకం ఆ తర్వాత ఎన్ని చెప్పినా నమ్మకం కుదరదు అని ప్రేమ్ అంటాడు.ప్రేమ్ ఒక్కసారి నా మాట విను అని శృతి అంటోంది.వినాలని లేదు అసలు నీ వైపు కూడా చూడాలని లేదు అని ప్రేమ్ అంటాడు అసలు నీ ముందు నిలబడాలని కూడా లేదు ప్రేమ్ అంటాడు.

నీ మెడలో కట్టిన తాళి వలన కాదు మనం, ఒకరి మీద ఒకరు పెంచుకున్న ప్రేమ నమ్మకం వలన మనం కలిసున్నాం. ఇప్పుడు అది లేదు ని మీద అస్సలు ఉండదు అనీ మాట్లాడుతూ ప్రేమ్ కింద పడతాడు.తెల్లవారి తరవాత తులసి వాళ్ల ఇంట్లో అంకిత ఫోన్ మోగుతూ ఉంటుంది అంకిత వచ్చి ఫోన్ లిచ్చేస్తోంది.అంకితా నేను నరేష్ ని మాట్లాడుతున్నాను చాలాసేపట్నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను అభి మొబైల్ స్విచ్చాఫ్ వస్తుంది .ఒక్కసారి ఫోన్ అబికి ఇస్తారా అర్జంటుగా మాట్లాడాలి అని నరేష్ అంటాడు. ల్యాండ్ ఫోన్ కి చెయ్యండి నేను ఇంట్లో లేను అని అంకిత చెబుతుంది. అలా లేవని చెప్పమని చెప్పాడా అని అంటాడు నరేష్.

అసలు వాడేందుకు నా ఫోన్ లిప్ట్ చేయట్లేదు అని అడుగుతాడు నాకేం తెలుసు అని అంకిత అంటోంది.అలా ఎందుకు చేస్తున్నాడో అడుగు నీ పక్కనే ఉంటాడు కదా అనే నరేష్ అంటాడు. లేదు నాకు తెలియదు అని అంకిత ఫోన్ కట్ చేస్తోంది.ప్రతి ఒక్కరూ నన్ను అనేవాళ్లే పెళ్లాం పక్కన లేదని తన ఫ్రెండ్స్కి చెప్పుకోవచ్చు కదా. తన ఫోన్ కలవకపోతే నాన౦బరుకు ఫోన్ చేసి అడగడమేంటి. అందరూ నాకు కోపం తెప్పించే పని చేస్తున్నారు ఇంకెన్ని రోజులో ఈ తలనొప్పి అని అనుకొని లోపలికి వెళ్లి పోతుంది అంకిత.

వీళ్ల గొడవ ఏంటమ్మా నాకర్థం కావట్లేదు అని తులసిని వాళ్ల అత్తయ్యా, మామయ్యా ఇద్దరూ అడుగుతారు.వీళ్లిద్దరూ ఇలాగే ఉంటే వాళ్ల మనసులో ఉన్న ప్రేమ చచ్చిపడిపోతుంది. బంధం బలహీనంగా తయారవుతుంది దూరం శాశ్వత౦ అవుతున్నది .నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అని తులసిని అంటారు. నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అని తులసి అంటోంది. ఎవరో ఒకరు పూనుకుని ఏదో ఒకటి చేసి వాళ్లిద్దరూ కలిసె లాగా చెయ్యాలి అని తులసి వాళ్ళ మామయ్య అనుకుంటారు.

కృష్ణాష్టమి వస్తోంది కదా ఆ వంక పెట్టుకుని అబిని ఇక్కడికి రమ్మని పిలుస్తాను ఒక నాలుగు రోజులు ఇక్కడ ఉండమని చెప్తాను.అలా నాలుగురోజులు వచ్చిన తర్వాత ఇద్దరూ ఒకే దగ్గర వుంటే ఏదో ఒకటి చేయొచ్చు. ముందు వాళ్లిద్దరూ ఒక దగ్గర ఉండాలి వాళ్ల సమస్యను వారే పరిష్కరించుకొవాలి అనే తులసి చెప్తోంది.అలాగే పనిలో పనిగా శ్రుతిని,ప్రేమ్ ని కూడా ఇక్కడికి రమ్మని చెప్తాను అని తులసి అంటోంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది

Advertisement