Intinti Gruhalakshmi 21 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. ఎపిసోడ్ 717 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సామ్రాట్, నందు, లాస్య ఎంత లేపిన లేవా పోయేసరికి తులసి క్లైంట్ ని తీసుకొని మీటింగ్కి వెళ్లి వస్తుంది. అప్పుడు లాస్య నందు సామ్రాట్ తనని అపార్థం చేసుకొని క్లాస్ పీకుతూ ఉంటారు. అప్పుడు తులసి క్షమించండి.. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగదు అని అంటుంది. నీ వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యేలా ఉంది. అని నందు, లాస్య అంటారు. అప్పుడు తులసి, బాధపడుతూ అక్కడ నుంచి రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు అంతలో క్లైంట్ సామ్రాట్ కి ఫోన్ చేస్తాడు. అప్పుడు సామ్రాట్ క్లైంట్ ఫోన్ చేస్తున్నాడు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అని చెప్పడానికి అనుకుంటా.. అని అంటాడు.
అప్పుడు నందు నీ మాట్లాడతాను సార్ నేను ఏదో ఒకలాగా ఒప్పిస్తాను అని చెప్తాడు. అప్పుడు సామ్రాట్ వద్దు నేనే మాట్లాడతాను అని ఫోన్ ఎత్తి చెప్పండి సార్ మేము రాలేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి అని అంటాడు. అప్పుడు అవతల క్లైంట్ తులసి గారు మీ ప్రాజెక్టు గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా మీకు అందింది అని చెప్తాడు. తులసి గారు చాలా గొప్పగా తెలివిగా ఎంతో వివరంగా మీ ప్లాన్ ను చెప్పారు అని చెప్తాడు. అప్పుడు సామ్రాట్ సరేనండి అని ఫోన్ పెట్టేసి లాస్యని నందుని తిడతాడు. మనకి ప్రాజెక్టు వచ్చిందట మనం తులసి గారిని అపార్థం చేసుకున్నాం అని అంటారు. తులసి గారికి స్వారీ చెప్పాలి అని వెళ్తుండగా.. కట్ చేస్తే పరంధామయ్యకి మళ్లీ గుండె నొప్పి వస్తుంది.
Intinti Gruhalakshmi 21 August Today Episode : గుండె నొప్పితో బాధపడుతున్న పరంధామయ్య…

దాంతో ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అంతలో అభి, తులసికి ఫోన్ చేసి చెప్తాడు. అయ్యో అవునా అని తులసి నందు సామ్రాట్ ల దగ్గరికి వచ్చి మావయ్య గారికి గుండె నొప్పి వచ్చిందంట మనం ఎలాగైనా తొందరగా వెళ్ళాలి అని చెప్తుంది. అప్పుడు అందరూ కంగారుపడుతూ ఇంటికి వెళ్లి ఫ్లైట్ ఎక్కి వెళ్తుంటారు. పరంధామయ్యని గుండె నొప్పి ఎక్కువ అవుతుంది చావు బతుకుల మధ్య కొట్లాడుతూ ఉంటాడు. తులసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంది. సామ్రాట్ తనని ఓదారుస్తూ ఉంటాడు. పరంధామయ్యకి సీరియస్ గా ఉంటుంది. అనసూయ కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…