Intinti Gruhalakshmi 21 July Today Episode : తులసి కి జరిగిన నష్టాన్ని డబ్బుతో వెలకట్టిన సామ్రాట్

Intinti Gruhalakshmi 21 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 21-july-2o22 ఎపిసోడ్ ముందుగా మీ కోసం… సామ్రాట్ తులసితో మాట్లాడినవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు .తనను అవమానించడం తనతో మాట్లాడిన మాటలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు సామ్రాట్. ఇప్పుడు పాప ని వడొలొ అంతా ప్రశాంతంగా పాడుకోడానికి కారణం ఎవరో నీకు తెలుసా అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అంటాడు. పాప బతికె ఉండడానికి కారణం తులసి అనే అంటాడు. హాస్పిటల్ లో పాప తల్లి స్థానంలో ఉండి మరీ తనకు ట్రీట్మెంట్ చేయించింది.

Advertisement

తను డబ్బు కోసం అలా చేయలేదు పాపకేం కాకుండా ఉండటం కోసం చాలా చేసింది.నువు ఎన్ని మాటలన్నా ఎంత అవమానించిన అన్ని ఓపిక పట్టుకుంది తన పరువు పోతుందని కూడా ఏరోజూ ఆలోచించలేదు. కేవలం పాప కోసం మాత్రమే ఆలోచించి తన త్యాగానికి నువ్వు వెలకట్టగాలవ.పంజరంలో ఉన్న చిలుక లాగా తనకి శ్వేచ కావాలని అందుకే తులసికి అడ్రస్ చెప్పలేదని కావాలనే రోజు మొత్తం అలా తులసితో తిరిగిందని నీ కూతురి నాతో చెప్పింది అని సామ్రాట్ వాళ్ల బాబాయ్ అంటాడు.

Advertisement
Intinti Gruhalakshmi 21 July Today Episode
Intinti Gruhalakshmi 21 July Today Episode

మరి హాని నాకెందుకు చెప్పలేదు బాబాయ్ అని సామ్రాట్ అంటాడు. నువ్వు తిడుతావని చెప్పలేదు తులసి నోరుకూడా హానినే మూయించింది అని చెప్తాడు వాళ్ల బాబాయ్.తులసి కి నష్టం చాలా జరిగింది అని అంటాడు. తులసికి జరిగిన నష్టాన్ని నేను పుడుస్తాను అని సామ్రాట్ అంటాడు నువ్వేం చేయగలవు అని అంటాడు.తను కోరుకున్నంత డబ్బు ఇస్తాను అని సామ్రాట్ అంటాడు. డబ్బు ముద్ర నువ్వే వేసి నువ్వే డబ్బు ఞస్తానంటావేంటి తను డబ్బు మనిషి అని ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా అని బాబాయ్ అంటాడు.

Intinti Gruhalakshmi 21 July Today Episode : తులసి కి జరిగిన నష్టాన్ని డబ్బుతో వెలకట్టిన సామ్రాట్

తను డబ్బు మనిషి కాదు అని నాకు తెలుసు కానీ మధ్యతరగతి వాళ్ళకి డబ్బు చాలా అవసరం పడుతుంది అని సామ్రాట్ అంటాడు.ఇకపోతే అంకిత ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అంకిత దగ్గరకి తులసి వస్తుంది.పండగకి అభిని పిలుద్దాం అనుకుంటున్నాను అని తులసి అంటోంది కానీ అంకిత ఏమీ మాట్లాడదు .ఏం మాట్లాడతావేంటి అని తులసి అంటోంది. ఇది మీ ఇల్లు మీ ఇష్టం అంటీ నేను వద్దని ఎలా చెప్పగలను అని అంటోంది అంకిత.మా అబ్బాయి తోను ఈ ఇంటితోనూ నీకే సంబంధం లేదా అని అంటోంది తులసి.

సంబంధం లేకపోతే నన్ను ఇంట్లో ఉండనిచ్చేవారు కాదు కద అంటి అని అంకిత అంటోంది. మరి అభిని పిలిస్తే సంతోషంగా లెవు అని తులసి అంటుంది. మీ అబ్బాయికి రావాలనే ఉంటే ఎప్పుడైనా రావచ్చు ఆంటీ అని అంకిత చెపుతుంది.ఇద్దరూ చెరోవైపు కూర్చొని ఉంటే సమస్య పరిష్కారం కాదు వాడిని మారేలా గా చెయ్యడం నీదే బాధ్యత అని తులసి అంకితకు చెబుతుంది. అలాగే ప్రేమ్ ని శృతి ని కూడా ఇక్కడికి పిలిచి ఇక్కడే ఉందామని చెప్పాలనుకుంటున్నాను అని అంటోంది.

దానికి అంకిత చాలా సంతోషపడుతుంది అందరం కలిసి ఉండాలని ఉంది అని చెప్తుంది.ఇకపోతే శృతి ఇల్లు వదిలి వాళ్ళ అత్తయ్య దగ్గరకి వెళుతుంది చిన్న గొడవకి ఇలా చేస్తావా అని వాళ్ళ అత్తయ్యా శృతి ని అడుగుతుంది.అయినా మీరు తులసి వారసులు కదా ఇంత చిన్న గొడవలకే ఇలా ఇల్లు వదిలి వస్తావా అని శృతి వాళ్ళ అత్తయ్య అంటోంది.నా మీద నమ్మకం చచ్చిపోయింది అన్నాడు మోసం చేశాను అన్నాడు మా బంధం మసకబారింది అన్నాడు నా ప్రేమనీ నా కన్నీళ్లను నా మాటల్ని అస్సలు నమ్మను అన్నాడు. మరి నేనేం చెయ్యను అని శ్రుతి అంటోంది.

ఆయన పిల్లాడు చాలా మంచివాడు కదా నువు చెసిన దానికి అర్థం చేసుకోగలిగాని ఎందుకిలా చేశాడు అని శృతి వాళ్ళ అత్తయ్య ఉంటుంది అదే నాకు అర్ధం కావట్లేదు అని శృతి కూడా అంటోంది.ఇక్కడికొచ్చి అర్దం కావట్లేదంటే ఏంటి భర్త దగ్గర కూర్చొని చెప్పాలి కదా అని అంటోంది శృతి వాళ్ల అతయ్య .అసలు నాతో మాట్లాడటమే ఇష్టం లేదు నా వైపు చూడటమే ఇష్టం లేదు అన్నప్పుడు నేనేం చేయను అత్తయ్యా అని శృతి అంటోంది.ఉండు నీ కొడుకు ఇలా చేశాడేంటి అని తులసితో మాట్లాడతాను అని శ్రుతి వాళ్ల అత్తయ్య అంటే వద్దు అంటే దీంట్లో తులసి అంటీని ఇన్వాల్ చేయొద్దు అని శృతి ఆపుతుంది.

ఇప్పుడు నువ్వు ఇంట్లో కనపడకపోతే ప్రేమ్ భయపడతాడు కథలంటే నాకు కావల్సింది అదే నన్ను వెతుక్కుంటూ రావాలి అప్పుడే ప్రేమ్ కి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అని శృతి అంటోంది.ఒకవేళ ప్రేమ్ రాకపోతే అనేవాళ్ల అత్తయ్య అంటోంది నా మీద ప్రేమతో రాకపోయినా ప్రేమ్ మీద నాకు నమ్మకం ఉంది అని శృతి అంటోంది.ఇక తెల్లవారిన తర్వాత ప్రేమ్ లేస్తాడు లేచిన తరవాత శృతి ని కలవరిస్తూ ఉంటాడు.

ఏంటి నేను పీల్చిన శృతి రావట్లేదు అని అనుకుంటూ ఉంటాడు.రాత్రి తాగిన మైకంలో జరిగిన గొడవంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ప్రేమ్.ఎంత తప్పు చేశాను అని అనుకుంటాడు ప్రేమ్ శృతి చేసిన త్యాగానికి నేను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడి బాధపడ్డాను అని అనుకుంటాడు ప్రేమ్.ఎంత బాధ పడుతుందో ఏమో తనకి సారీ చెప్పాలి అని శ్రుతిని వెతుకుతూ ఉంటాడు ఇంట్లో.

ఎంత వెతికినా దొరకదు శృతి ఆ తర్వాత దేవుడి దగ్గర ఒక లెటర్ రాసి ఉంటుంది .దాంట్లో నీ మాటలు మర్చిపోవాలని నేను ప్రయత్నించాను కానీ నా వల్ల కావట్లేదు నువు మాటలతొ గుండెకి గుచ్చుకుని విలవిలలాడిపోయాను ప్రేమ్.మన బంధం మసకబారేలా గా చేసింది నేను కాదు నువ్వు.నువ్వు నా ముఖం చూడాలి అని లేదు నా మాట వినడం లేదు అని అన్న మాటలు నాకు ఉరిశిక్ష లాగా ఉన్నాయి ప్రేమ్ అని అందుకే ఎన్నికల ముందు ఉండటం ఇష్టంలేక మనిద్దరం కలిసి ఉండడం కరెక్ట్ కాదు నేను నిన్ను తప్పు చెయ్యలేదు మోసం చేయలేదు అని నమ్మినప్పుడు నువ్వే నా దగ్గరికి వస్తావు అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని శృతి లెటర్లో రాసి పెడుతుంది

.నాకు నువ్వు కావాలి శృతి నువ్వు లేకుండా నేను బతకలేను నాకు బ్రతుకేలేదు అని ప్రేమ్ బాధపడతాడు. ఇంతలో తులసి ప్రైమ్ కి ఫోన్ చేస్తుంది.జరిగిన విషయం అమ్మకి తెలియకూడదు తనకి తెలుసు తను బాధపడుతుంది అనే ప్రేమ్ అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.ఏంటి ప్రేమ్ చాలా బిజీ అయిపోయార కనీసం ఫోన్ కూడా చేయట్లేదు ఒక శృతికి ఫోనివ్వు నేను మాట్లాడాలి అనే తులసి అంటోంది. తన ఇంట్లో లేదు కదా అని అనగానే ప్రేమ్ భయపడతాడు.నాకు తెలుసు స్మృతి టయానికి స్నానానికి వెళ్తుంది కదా అందుకే తడబడుతున్నావు అని తులసి అంటోంది .

చూడు ప్రేమ్ నేను ఎందుకు ఫోన్ చేశానంటూ వెంటనే నువ్వు శృతి సామాను సదరు కొనివ్వునా ఇంటికి వచ్చేయండి ఎప్పట్లాగే మనం అందరం కలిసి ఉందాం అని తులసి అంటోంది.నా బిడ్డ తన బాధ్యత తెలుసుకున్నాడు తన కలను నెరవేర్చుకున్నాడు ఇక బయట ఉండాల్సిన అవసరం లేదు మీరు వెంటనే ఇంటికి రండి అని తులసి ప్రేమతో చెప్తోంది.ఈ మాట శృతికి కూడా చెప్పు అని తులసి అంటుంది సరే అమ్మా ఒకటి లేదా రెండు రోజుల్లో వస్తాము అని ప్రేమ్ చెప్తాడు.

అమ్మా ఇంటికి రమ్మన్నందుకు ఆనందపడాలా లేదా శ్రుతి ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు బాధపడాలా తెలియట్లేదు అనే ప్రేమ్ బాధపడతాడు. ముందు శృతి ఎక్కడ ఉందో వెతకాలి అని అనుకుంటాడు ప్రేమ్.ఇకపోతే తులసి వంటగదిలో ఏదో పని చేసుకుంటూ ఉంటే దివ్య వచ్చి నాకు ఫీజు కావాలి అమ్మా అని అడుగుతుంది.మొన్ననే కదా దివ్య ఫీజుకట్టింది అనే తులసి అంటోంది. మొన్న కాదు అమ్మ మూడు నెలలు అవుతోంది అనే దివ్య అంటోంది.

అవును రోజులు ఎంత తొందరగా గడుస్తున్నాయో అని అనుకుంటూ ఉంటుంది తులసి. ఈసారి మాత్రం లాస్ట్ టైమ్ లాగా లేట్ చేయకు ప్రిన్సిపల్ దగ్గర పరువు పోతుంది అని దివ్య అంటోంది.సరే ఈసారి ఆలస్యం చేయను అని తులసి అంటుంది ఎంత కట్టాలి అని అడిగితే ఇరవై వేలు అమ్మ అనే దివ్య చెబుతోంది .ఇప్పుడు ఇరవై వేలు ఎక్కడ్నుంచి తేవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది తులసి. ఇంతలో ఒకతను వచ్చి మేడం సామ్రాట్ గారు మీకు ఈ కవరు ఇవ్వమన్నారు అని అనగానే తులసి షాక్ అవుతుంది.

సామ్రాట్ గారుమన్నారా ఏముంది ఆ కవర్లో అని అడుగుతుంది తులసి నాకు తెలియదు అని వచ్చిన అతను చెప్తాడు.ఆ కవర్ తీసుకుని తులసి లోపలికి వస్తుంది.ఆ కవర్ లో ఏముందో అని తీసి చూస్తుంది తులసి దాంట్లో బ్లాంక్ చెక్ ఉంటుంది.వాళ్ల పాపని కాపాడినందుకు బ్లాంక్ చెక్ ఇచ్చారా అని దివ్య అంటోంది. తులసి వాళ్ల అత్తయ్య మామయ్య డబ్బులున్నాయని ఇలా చేసాడు అని అనుకుంటూ ఉంటారు.

గాయానికి మందు రాస్తున్నాడు అనే అంకిత అంటోంది. డబ్బు ఉన్న పొగరుతో ఇలా చేసాడు అని ఇంట్లో ఉన్న వాళ్లందరూ అనుకుంటూ ఉంటారు. కానీ తులసి కూతురికి ఏమైంది అన్న టెన్షన్ బాధతో ఇలా చేసారు సామ్రాట్గారూ అని అంటోంది తులసి .అంటే ఏంటి ఈ చెక్ తీసుకుంటావా అని తులసి వాళ్ల అత్తయ్య అడుగుతుంది. అలా ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement