Intinti Gruhalakshmi 22 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఎపిసోడ్ 717 ముందుగా మీ కోసంసామ్రాట్ కి ఫోనొస్తుంది. ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశామని చెప్పడానికి చేస్తున్నారేమో అని, నందు లాస్యతో అనగానే, నేను మాట్లాడతాను సార్ అని నందు అంటాడు. లేదు నేనే మాట్లాడతాను అని, ఫోన్ లిఫ్ట్ చేయగానే, కంగ్రాచులేషన్స్ మీ ప్రాజెక్టు మాకు ఓకే, తులసిగారు ప్రజెంటేషన్ బాగా ఇచ్చారు అని అంటాడు, సామ్రాట్ షాక్ లో ఉంటాడు. ఏమైంది సార్ అని లాస్య అనగానే, మన ప్రాజెక్ట్ ఓకే చేశారు అని అంటాడు.మనం తులసి గారి దగ్గరికి వెళ్లి క్షమాపణ అడగాలి అని చెప్పి , పదండి వెళదాం అంటాడు సామ్రాట్. తులసి దగ్గరికి వెళ్ళి సామ్రాట్ తులసితో సారీ అని చెప్తాడు,ప్రాజెక్ట్ ఓకే అయింది సంతోషంగా ఉండొచ్చు కదా, సారీ కూడా చెప్పాను అని సామ్రాట్ అనగానే, తులసి మిమ్మల్ని లేపడానికి ఎంతో ప్రయత్నించాను, ఇంట్లో ఎవరు ఏ పని చేయకపోయినా నేనే చేసే అలవాటు ఉంది.
Intinti Gruhalakshmi 22 August Today Episode : తులసి వాళ్ళ మామయ్యకి గుండెనొప్పి రావటంతో షాక్లో తులసి…
ఇప్పుడు కూడా అలానే చేశాను. ఈ రోజు ప్రాజెక్ట్ ఓకే అయింది కాబట్టి మీరు సారి చెప్తున్నారు,ఓకే కాకపోతే అని, నాకు అనుభవం లేకపోవడం వల్లనే ఇలా జరిగింది అని, బాధపడుతూ ఉండగా, సామ్రాట్ ఇంకెప్పుడు మిమ్మల్ని నిలదీయను అని మాటిస్తున్నాను అని చెప్పి, నందు లాస్యతో మీరు కూడా సారీ చెప్పండి తులసి గారికి అని అంటాడు. తులసి కి సారీ చెబుతారు ఇద్దరు.అప్పుడు సామ్రాట్ బిజినెస్లో ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం మీకిస్తున్నాను అని తులసి తో అంటాడు. వచ్చినపని సక్సెస్ అయిన కారణంగా నేనిప్పుడు పార్టీ ఇస్తాను అని అంటాడు సామ్రాట్.తులసి ఇంటిలోవాళ్ళు సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉండగా, తులసి వాళ్ళ మామయ్యకి హార్ట్ ఎటాక్ వస్తుంది.

అందరూ కంగారు పడుతూ, ట్యాబ్లెట్ ఇస్తారు.తర్వాత సామ్రాట్, నందు ఇద్దరూ గదిలోనుంచి బయటికి వచ్చి, ఒకరినొకరు కలుసుకొని మనం రాత్రి ఏం మాట్లాడుకున్నామో,ఎవరి గురించి మాట్లాడాము గుర్తుందా అని అనుకుంటూ ఉంటారు.లాస్య అక్కడికి రావడంతో, నందు లాస్యని అడుగుతాడు రాత్రి ఏం మాట్లాడుకున్నామో నీకు తెలుసా అని అనగానే, ఏదో తాగినప్పుడు మాట్లాడారు ఆ పిచ్చి వాగుడు ఇప్పుడెందుకు టైం వేస్ట్ అని అంటుంది. ఇంతలో ప్రేమ్ తులసికి ఫోన్ చేస్తాడు, తాతయ్యకి హార్డ్ ఎటాక్ వచ్చింది, ఇప్పుడే డాక్టర్ వచ్చారు కంగారు పడకు అని అంటాడు ప్రేమ్. అప్పుడు తులసి నేను వెంటనే వస్తున్నాను, నేనొచ్చేవరకూ మీరందరూ తాతయ్య పక్కనే ఉండండి అని చెప్తుంది తులసి.
తులసి సామ్రాట్ దగ్గరికి వచ్చి, వెంటనే వెళ్లాలి మా మావయ్యకి గుండెనొప్పి వచ్చింది అని అనగానే, నందు వెళదాం అందరం అని అంటాడు. నందు లాస్య తులసి ముగ్గురు వెళతారు ఇంటికి, తులసిని చూసి తులసి వాళ్ళమావయ్య సంతోషపడతాడు. ఏమైంది అతయ్యా ఎలా ఉంది అని అనగానే, తాతయ్య కి వచ్చింది గుండెనొప్పి కాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని అంటాడు ప్రేమ్.ఇలా కొద్దిసేపు మాట్లాడుతూ, ఇంతవరకు నా కొడుకు నన్ను పలకరించలేదు అని అంటాడు, అప్పుడు నందు మీకోసమే వచ్చాను కదా నాన్నా అని అంటాడు. లాస్య వెటకారంగా తులసి తర్వాతే కదా మాకు మాట్లాడటానికి ఛాన్సు అని వెయిట్ చేస్తున్నాం అని అంటుంది.ఇలా మాట్లాడుతూ ఉండగా, తులసి అంకిత కన్పించడం లేదు అని అనగానే, అభి మెడికల్ క్యాంపుకు వెళ్ళింది అని అంటాడు. మరి వంట పరిస్థితి ఏంటి అని అనగానే, మీ అత్తయ్య చేసింది అమ్మ అందుకే కదా ఈ గ్యాస్ ప్రాబ్లం అని అంటాడు తులసి వాళ్ళ మామయ్య.దాంతో అందరూ నవ్వుతూ ఉంటారు.ఇంతలో శ్రుతి అక్కడికి వస్తుంది.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది