Intinti Gruhalakshmi 22nd July Today Episode : సామ్రాట్ ఇచ్చినా బ్లాంక్ చెక్ ని తిరిగి సామ్రాట్కి ఇచ్చేసి తనకి సరైన గుణపాఠం చెప్పిన తులసి.

Intinti Gruhalakshmi 22nd July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 22-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం …. సామ్రాట్ రెడీ అయి కిందికొచ్చి హాని పాపని దగ్గరికి తీసుకొని సాయంత్రం తొందరగా రెడీ అయి ఉండు బయటికి వెళ్దాం అని చెప్పి ముద్దు పెడుతూ ఉంటాడు..ఇంతలో అక్కడికి తులసి వస్తుంది హాని పాప కిందకి దిగి హాయ్ ఆంటీ అని చెప్పి తన దగ్గరికే వెళ్తోంది .నేను ని కోసమని ఒకటి తీసుకొచ్చాను అని చెప్పి ఉప్మా పెసరట్టు చేసి తీసుకొచ్చిన అని బాక్స్ ఇస్తోంది. బాక్స్ తెస్తే సరిపోదు మీరే తెప్పించాలి అని హాని అనగానే సరే అమ్మా నేను తినిపిస్తాను అని అంటోంది తులసి.

Advertisement

తులసి హనీకి తినిపిస్తుంటే బ్లాంక్ చెక్కు పంపించాను కాబట్టే రియాక్షన్ ఎలా వుంది అని సామ్రాట్ బాబాయ్ తో చెప్తూ ఉంటాడు.మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు తెలుసు అని వెటకారంగా మాట్లాడతాడు సామ్రాట్.హాని ని నిరు తాగమని లోపలికి పంపించి తులసి థ్యాంక్స్ అని సామ్రాట్కి చెబుతుంది.ఎందుకు అనడిగితే బ్లాంక్ చెక్ పంపించారు కదా అని అంటోంది తులసి.మా హానిని రెండుసార్లు కాపాడారు కదా అందుకే బ్లాంక్ చెక్ పంపించాను.

Advertisement
Intinti Gruhalakshmi 22nd July Today Episode
Intinti Gruhalakshmi 22nd July Today Episode

మీకెంత కావాలంటే అంత రాసుకోండి నేనేం అనుకోను అని సామ్రాట్ చెప్తాడు.కానీ నేను అనుకుంటున్నాను అని కోపంగా బ్లాంక్ చెక్కు తీసి తులసి సామ్రాట్కి రిటన్ ఇచ్చేస్తుంది.ఏంటి మీరు చేసిన పని అని సామ్రాట్ అడగ్గానే. చేసిన పనికి డబ్బు తీసుకుంటే అది సహాయం అనిపించుకోదు సామ్రాట్గారూ అది వ్యాపారమవుతోంది నేను స్వార్ధపరురాల్ని కాదు మిలా వ్యాపారవేత్తనే కాదు నేను చేసిన సాయం. మంచి మనసుతో చేశాను అని అంటోంది తులసి .

Intinti Gruhalakshmi 22nd July Today Episode : సామ్రాట్ ఇచ్చినా బ్లాంక్ చెక్ ని తిరిగి సామ్రాట్కి ఇచ్చేసి తనకి సరైన గుణపాఠం చెప్పిన తులసి.

మీరు చేసిన తప్పు ఒప్పుగా మారిపోదు తప్పు తెలుసుకుంటే మరోసారి అలాంటి తప్పు చేయకుండా ఉంటే అంతే చాలు నాకు ఇ బ్యాంక్ చెక్ వద్దు అని తులసి అంటుంది.బ్లాంక్ చెక్ తిరిగి ఇచ్చి మీరు తప్పు చేస్తున్నారు తులసి గారు మికు డబ్బు చాలా అవసరం పడుతుంది అని సామ్రాట్ అంటాడో మీరు ఎలాంటి కష్టాల్లో ఉన్నారో నాకు బాగా తెలుసు తులసి గారూ ఈ చెక్తో మీ కష్టాలు పోతాయి బాగా ఆలోచించుకోండి అని సామ్రాట్ తులసితో చెప్తాడు.మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి కష్టాలు ఏం కొత్తకావు కష్టాలు ఉంటేనే జీవితం విలువ తెలుస్తుంది డబ్బుతో ఏం తెలియదు అని చెప్తుంది తులసి.

మీలాంటి డబ్బున్నవాళ్లకే జీవితం విలువ తెలియదు డబ్బు గురించి మాత్రమే తెలుసు అని తులసి చెప్తుంది.డబ్బుతో ఏమైనా కొనగల అనేమీ డబ్బున్నవాళ్లు అనుకుంటారు కానీ ఆత్మాభిమానం మాత్రం కొనలేరు సామ్రాట్గారూ అని చెప్తూ౦ది తులసి.నేను డబ్బున్న సామ్రాట్ గారి కూతుర్ని కాపాడలేదు ఆ ప్లేస్లో పేదవాడి కూతురు ఉన్నా అలాగే సాయం చేసేదాన్ని అని చెప్తుంది తులసి.డబ్బును వాళ్లే కాదు డబ్బు లేని వాళ్లు కూడా మనుషులే అది తెలుసుకోండి సామ్రాట్ కారు అని తులసి అంటుంది .

మీకు అంత డబ్బు సాయం చేయాలి అనుకుంటే పనివాళ్లకి ఇచ్చి కాకుండా మీరే స్వయంగా వచ్చి చెక్ ఇచ్చేవాళ్లు కానీ మీరలా చెయ్యలేదు నాకు భిక్ష వేశాను అని అనుకొని పంపించారు అది నాకు నచ్చలేదు అని చెప్తుంది తులసి.మనుషుల్లోమంచితనం చూడండి అది కనిపిస్తుంది అని చెప్పే వెళ్లిపోతూ ఉంటుంది తులసి వెళ్తూ వెళ్తూ అన్నట్టు ఒక మాట చిన్న పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైనా తీసుకెళ్లాలి అంటారు అందుకే హానికి ఇష్టమైన టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చాను అంతే కానీ నా చుట్టూ తిప్పుకోవాలని ఇలా చెయ్యలేదు దాన్ని కూడా తప్పుగా అనుకోకండి అని తులసి సామ్రాట్తో చెప్తుంది.

హాని అంటే నాకిష్టం అందుకే తన ఇష్టం నాకు గుర్తుంది దీన్ని కూడా అనుమానంతో పెడర్థాలు తియ్యకండి సార్ అనే తులసి చెప్తుంది.అలా చెప్పి అక్కడి నుంచి తులసి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ప్రేమ్ శ్రుతి కోసం వెతుకుతూ ఉంటాడు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యడంలేదు ఎక్కడుందో ఏంటో అని చూస్తూ ఉంటాడు. అలాగే శృతి కూడా ప్రేమ్ వస్తాడని ఎదురు చూస్తూ ఇంటి బయట కూర్చొని ఉంటుంది. శ్రుతివాళ్ల అత్తయ్య వచ్చే ఇంకా ప్రేమ్ రాలెదు అనగానే అటువైపుగా ప్రేమ్ వస్తుంటే తనకోసమే వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది.

శ్రుతిని వాళ్ల అత్తయ్య కావాలనే లోపలికి వెళ్లమంటోంది ప్రేమ్ ని సరదాగా ఆటపట్టిస్తూ నిన్న ఇప్పటిదాకా ఏడిపించాడు కథ తనను కూడా కొద్దిసేపు ఏడిపిస్తానో లోపలికెళ్ళి చూస్తూ వుండు అని శృతిని లోపలికి పంపిస్తుంది.తర్వాత ప్రేమ్ లోపలికి వస్తాడు శ్రుతి వాళ్ళ అత్తయ్య చూసి ఎలా ఉన్న ప్రేమ్ ఎప్పుడొచ్చావు ఒక్కదానివే వచ్చావంటే అమ్మాయి రాలేదా అని అడగ్గానే ప్రేమ్ షాక్ అవుతాడు అంటే శృతి ఇక్కడికికూడా రాలేదా అని అనుకుంటూ ఉంటాడు ఇదంతా శ్రుతి డోర్ దగ్గర నుండి చూస్తూ ఉంటుంది.అయితే మా గొడవ విషయం గురించి పిన్నికి తెలియనట్టుంది వద్దులే చెప్పడం అని అనుకుంటూ ఉంటాడు.

శ్రుతి ఇంటి దగ్గరే ఉంది ఇటువైపుగా పనివుంటే వెళుతున్నాను అని ఏం తెలియనట్టు మాట్లాడతాడో శ్రుతివాళ్ల అత్తయ్య కావాలనే తనతో అలా మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ్ కి ఏం చేయాలో ఏం అర్థం కాక అలాగే ఉంటాడు.ఏంటి ప్రేమ్ అలా వున్నావు అని శృతి వాళ్ళ అత్తయ్య అనగానే నాకేమైంది హాయిగా ఉన్నాను అని సమాధానం ఇచ్చాడు అది విని శృతి ఆశ్చర్యంపోతుందని సరే పిన్ని మళ్లీ వస్తానని వెళ్ళిపోతూ వుంటే నువ్వు పాటల పోటీలో గెలిచావంట కదా ఇక నీ జీవితం మారిపోయింది కదా అని శ్రుతివాళ్ల అత్తయ్య అనగానే అవునూఆంటీ అంతా బాగానే ఉంది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను మా అమ్మ కూడా తిరిగి మమ్మల్ని ఇంటికి రమ్మన్నది మేమీరోజూ వెళ్తాము అని అనగానే శృతి విని చాలా సంతోషపడుతుంది.

శృతిని తీసుకెళ్తావు కదా అని వాళ్లతో అనగానే శృతి లేకుండా ఎలా వెళ్తాను అని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో పరిగెత్తుకుంటూ సిటీ లోపల్నుండి బయటికి వస్తుంది ఆ కమ్మ ఉండవు వాళ్ల అమ్మ రమ్మన్నది కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు కానీ నీ మీద ప్రేమతో రాలేదు అని శ్రుతివాళ్ల అత్తయ్య చెప్పి శ్రుతిని ఆపేస్తుంది. కొద్ది రోజులు ఓపిక పట్టాలిబని మీద ప్రేమతో రావాలి నీ విలువతెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాలి అని చెప్పి సైలెంట్గా ఉండు అని అంటోంది ఇప్పుడు నా మాట విను అని చెబుతుంది దాంతో శృతి సైలెంటుగా ఉండిపోతుంది.ఇక ఆ తర్వాత సామ్రాట్ ఆఫీసులో లాస్య నందు మాట్లాడుతూ ఉంటారు.వెల్కమ్ ఐసిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పి సామ్రాట్ నందుతో చెప్తాడు.

మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి చాలా థ్యాంక్స్ అని నందు సామ్రాట్కి చెప్తాడు. లైఫ్ అయినా బిజినెస్ అయినా నమ్మకం మీద నిలబడాలి అని చెప్తాడు సామ్రాట్ అంటాడు.తన గురించి సామ్రాట్ చెప్తూ వుంటాడు దానికి లాస్య మెచ్చుకుంటూ క్లాప్స్ కొడుతూ ఉంటుంది.సామ్రాట్ నా టార్గెట్ ఒక్కటే నాలాగే వందమంది సామ్రాట్లను తయారు చెయ్యాలి అని అంటాడు. కుదరదు సార్ సామ్రాట్ అంటే ఒక్కరే ఉండాలి కాకపోతే సమర్ధులు ఉండాలి అని చెప్పి లాస్య అంటోంది. సామ్రాట్ ఏం చెప్పినా లాస్య ప్రతిదానికి క్లాప్స్ కొడుతూ ఓవర్ ఎగ్జైట్ అవుతూ ఉంటుంది అది నందుకి నచ్చదు.మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతాను అని సామ్రాట్ లాస్యతో అంటాడు.

క్రియేటివిటీ ఏ ఒక్కరి సొత్తూ కాదు చాలా మంది మనసులో గొప్ప గొప్ప బిజినెస్ ఐడియాలు పుడుతూ ఉంటాయి కానీ పెట్టుబడి లేక అవి పుట్టిన చోట నమోదవుతూ ఉంటాయి అని సామ్రాట్ చెప్తాడు అలాంటి ఐడియాలకి ఇన్వెస్ట్ మెంట్ ఇచ్చి మనం బ్రతికిద్దాం అలా మనం మన బిజినెస్ చేద్దాం అనే సామ్రాట్ చెబుతాడు. అది మీరు చేయాల్సిన పని గొప్ప బిజినెస్ ఐడియాలు ఉన్న వాళ్ళని పట్టుకోవాలి అని సామ్రాట్ చెప్తాడు.ఏం చేస్తారో ఎలా చేస్తారో మీ ఇష్టం సోషల్ మీడియాను కూడా వాడుకోండి నిర్ణయాలు మీవి ఇక పని మొదలు పెట్టండి ఆల్ ద బెస్ట్ అని సామ్రాట్ నందుతో చెప్తాడు.

మేం తప్పకుండా చేస్తాం సార్ అని చెప్పి నందు లాసయ చెపి వెళ్లిపోతారు.కాసేపు ఆఫీసు పని పక్కన పెట్టి పర్సనల్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉండు అని సామ్రాట్ వాళ్ల బాబాయ్ అంటే, అంటే నువ్వే అన్నావుగా లైఫ్ రొటీన్గా ఉండే బోర్ కోరుతూ ఉంటుంది లైఫ్ ఛేంజ్ ఉండాలని ఇలా ఎంతకాలం ఒంటరిగా వుంటావు పాప గురించి ఆలోచించు అని సామ్రాట్ వాళ్ల బాబాయ్ అంటాడు.కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాల్లో మార్పు ఉండకూడదు అని సామ్రాట్ అంటాడు టాపిక్ మార్చి నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటాడు సామ్రాట్ తులసి గురించి అనగానే టాపిక్ చించేశావని సామ్రాట్ వల్లభాబాయ్ అంటాడు.

కొంత మందికి ఒక జబ్బు ఉంటుంది ఇంకొంతమందికి ఇంకో జబ్బు తులసికి ఆత్మాభిమానం చాలా ఉంది అందుకే డైరెక్టుగా డబ్బు ఇస్తే వద్దు అని చెప్పింది. నేను వేరు దార్లో వెళ్తాను అని సామ్రాట్ అంటాడు.ఆ తర్వాత తులసి వాళ్ల ఇంట్లో అంకిత ల్యాప్టాప్లో ఏదో వెతుకుతూ ఉంటుంది దాంట్లో ఎస్ ఎస్ గ్రూపు వాళ్లది ఒక పోస్ట్ చూస్తుంది అంకిత ఆండీ చూడండి మంచి అవకాశం దొరికింది ఒక కంపెనీ వాళ్లు పెట్టుబడి పెట్టి మంచి ఐడియా ఉన్నవాళ్లకి జవాబిస్తానని చెప్తున్నారు అనే అంకిత సంతోషపడుతుంది. దాంట్లో వాళ్లకేంటీ లాభం అని తులసి అడుగుతుంది.

లాభాల్లో కంపెనీవాళ్లు వాటా తీసుకుంటారు ఆంటీ అని అంకిత చెపుతుంది. మీరు కూడా మీ మ్యూజిక్ స్కూల్ గురించి వాళ్ళకి చెప్పొచ్చు కదా అని అంకిత అంటోంది.కానీ నాది చిన్న స్కూల్ కదమ్మా దానికి ఒప్పుకుంటారో లేదో అని తులసి అంటోంది ఎందుకు ఒప్పుకోరు అంటే చిన్నది పెద్దది అని ఏం ఉండదు మంచి ఐడియా గురించి మాత్రమే ఆలోచిస్తారు అని అంకిత అంటోంది.. నేను ఎవ్వరి మీదా ఆధారపడను నేను చేసేది మంచి అయిడియానే కాదో అన్నీ నెనె ఆలోచించుకుంటాను అని తులసి అంటోంది.ఇకపోతే దీనిగురించే నందు లాస్య కూడా మాట్లాడుకుంటూ ఉంటారు.

వచ్చింది చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్టైనా ఏది మంచిదో కాదో నేనే బాగా ఆలోచించి సామ్రాట్ గారి దగ్గరికి తీసుకెళతాను అని నందు లాస్యతో చెప్తాడు .అప్పుడే నువ్వు సామ్రాట్ గారికి నమ్మినబంటుగా ఉన్నావు అని లాస్య అంటోంది.నేను చిన్నాచితకా ప్రాజెక్టులను ఒప్పుకోను అని నందు అంటాడు .నేను చేసేది చిన్న పనే కానీ ఎంతో మందికి ఉపయోగపడే కలగురించి దీనికి ఎవరు అడ్డుపడినా నేను ఒప్పుకోను అని తులసీ అంకిత తో చెప్తోంది.ఎవరు అడ్డుపడినా నేను సాధించాలన్నది నేను సాధిస్తాను అని తులసి అంకితతో అంటోంది.

దాంతో అంకిత తులసికి ఆల్ ద బెస్ట్ చెప్తోంది అలాగే లాస్య కూడా నుందుకి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఇక ఆ తరవాత తులసి వాళ్ళ అత్తయ్య వాళ్ళు మామయ్యకి కాఫీ తీర్చుకొంటోంది నువ్వు తెచ్చుకోలేదేం అనడగ్గానే కాఫీ తాగితే విష౦ అని చెబుతోంది. దాంతో తులసి వల్ల మామయ్య షాకవుతాడు. ఆలోచిస్తూ ఉంటాడు అలా ఆలోచించి కాఫీ పక్కన పెడతాడు వాళ్ళ మామయ్య. వెంటనే ఆ కాఫీ తులసి వాళ్ళ అత్తయ్య తాగుతుంది. అదేంటినన్ను తాగుతోన్న అని నువు తాగుతున్నావా అని తులసి వాళ్ళ మావయ్య అనగానే కాఫీపొడి ఒకరికి సరిపోని ఉంది అందుకే ఒక్క కాఫీ పెట్టాను అని సరదాగా నవ్వుతూ చెప్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement