Intinti Gruhalakshmi 23 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 23-August-2022 ఎపిసోడ్ 718 ముందుగా మీ కోసం. తులసి ఇంట్లో అందరూ మాట్లాడుతూ ఉండగా, అక్కడికి శ్రుతి వస్తుంది. శ్రుతిని చూసి ఎంతకాలమైంది అమ్మా అని అంటాడు తులసీ మామయ్య, తులసి కూడా కనీసం ఫోనయినా చెయ్యలేదు అని, ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.నందు, లాస్య ఇద్దరూ నందు వాళ్ళ అమ్మని బయటికి పిలుస్తారు.లాస్య మీరు తులసి తప్పుల్ని చూడాలి అని అంటూ ఉంటుంది. కొన్ని ఫోటోలని ఇస్తుంది చూడమని, సామ్రాట్, తులసి ఇద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫోటోలను ఇస్తుంది, లాస్య వాటిని చూపించి తులసి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది.లాస్య, నందు ఇద్దరూ తులసి గురించి, సామ్రాట్ గురించి మాట్లాడుతూ ఉంటారు కొద్దిసేపు నందు వాళ్ళ అమ్మతో, పరువు పోయేలాగా ఉంది తులసి కారణంగా అని చెప్పి వెళతారు.సామ్రాట్ వాళ్ల ఇంట్లో హనీ పాప వాటర్ పైప్ తో ఆడుకుంటూ, పనివాళ్ళ మీద నీళ్లు చల్లుతూ ఉంటుంది.
Intinti Gruhalakshmi 23 August Today Episode : లాస్య చూపించిన ఫొటోలతో నందు వాళ్ల అమ్మ తులసిని అపార్థం చేసుకుంటుందా?
వద్దు అమ్మా అని అంటే, ఈవినింగ్ వరకు నాన్న రాడు అని ఆడుతూ ఉండగా సామ్రాట్ అక్కడికి వస్తాడు, కోపంగా సామ్రాట్ చూస్తూ ఉంటాడు. అప్పుడు హని పాప సారీ నాన్నా అని చెప్తుంది. ఇప్పుడు చెబుతాను నీ పని అని ఆ వాటర్ పైప్ తొ సామ్రాట్ కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. శ్రుతి ప్రేమ్ గెలిచినా ట్రోఫీ ని చూస్తూ వుండగా, తులసి శ్రుతి తో ట్రోఫీ ప్రేమ్ జీవితాన్నే మార్చేసింది అమ్మ అని అంటూ ఉంటుంది. అప్పుడు శ్రుతి మనసులో ప్రేమ్ జీవితాన్ని మార్చడం కాదంటీ ప్రేమ్ నే మార్చేసింది, ప్రేమ్ కి నామీదున్న ప్రేమను చంపేసింది, నాకు శాశ్వతంగా దూరం చేసింది అని అనుకుంటూ ఉంటుంది మనసులో.నువ్వు లేని లోటు ఇంట్లో బాగా కనపడనుంది, నా పరిస్థితే ఇలా ఉంటే, ప్రేమ్ పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అని మాట్లాడుతూ ఉండగా, నేను వెళతాను ఆంటీ అని అంటోంది శ్రుతి, అప్పుడు ఇంట్లోవాళ్లు తను బానే ఉంది కదా అమ్మా , ఇపుడు వెళ్లడం ఎందుకు అని, ఇలా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.

శ్రుతి కంగారు పడుతూ ఉంటుంది.తులసి నా మాట వినమ్మా బట్టలు ప్రేమ్ తీసుకొనివస్తాడు, ఇక్కడే వుండు నువ్వు అని అంటుంది.తరువాత హనీ పాప కి సామ్రాట్ ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉండగా, పాప సంతోషపడుతూ ఉంటుంది.అక్కడికి సామ్రాట్ వాళ్ల బాబాయి వచ్చి, నువ్వు వేళ్ళు అమ్మా అని పాపని పంపించి, పేపర్ లొ పడిన ఆర్టికల్ గురించి సామ్రాట్కి చెబుతూ ఉంటాడు. ఆ ఆర్టికల్ లో సామ్రాట్ తులసిల ఫొటో ని భార్యాభర్తలుగా వేసి వాళ్లకు నచ్చిన వార్తని రాస్తారు. అది చూసి సామ్రాట్ పాపం తులసి గారు ఎంత ఇబ్బంది పడతారో అని కంగారు పడుతూ ఉంటాడు, తులసి గురించి. ఒకవైపు తులసి వాళ్ల ఇంట్లో అభి కూడా ఆర్టికల్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ నీకు అమ్మ మీద నమ్మకం ఉంటే నువ్వు ఇలా నిలదియ్యవు అని అంటాడు. నాకు అమ్మ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను ఆలోచించేది సొసైటీ వేసే నిందల గురించి అని అభి మాట్లాడుతూ ఉంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.