Intinti Gruhalakshmi 24 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 24-aug-2022ఎపిసోడ్ 719 ముందుగా మీ కోసం అభి, ప్రేమ్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అభి, వాళ్ళ నానమ్మతో నానమ్మ నీకు అమ్మ చేసింది తప్పు అనిపించడం లేదా అని అడుగుతూ ఉంటాడు.అప్పుడు ప్రేమ్ మనకి మంచి చెడు నేర్పించింది అమ్మ, అలాంటి అమ్మకి తెలియదా ఏమి చేయాలో అని అంటూ ఉంటాడు.శ్రుతి కూడా ఎవరో రాసిన దానికి ఆంటీని తప్పు పట్టవలసిన అవసరం ఏముంది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అనసూయ మనసులో తులసి ని వైజాగ్కి పంపించి తప్పు చేశానేమో అని అనుకుంటూ ఉంటుంది. ఇలా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉండగా, అనసూయ అభికి సమర్థించినట్టు మాట్లాడుతుంది, నేను తులసిని తప్పుపట్టడం లేదు కానీ, జాగ్రత్త పడాలి అని అంటూ ఉంటుంది.
ఇలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కొద్దిసేపు, ఈ విషయం తులసికి తెలియకూడదు ఇది నా ఆర్డర్ అని తులసి మామయ్య చెపుతాడు అందరికీ. తరువాత తులసి ఇంటికి వస్తుంది. ఏంటి అందరూ సీరియస్ గా ఉన్నారు అని అడుగుతూ ఉండగా, ఇంతలో సామ్రాట్ వస్తాడు అక్కడికి, మీతో మాట్లాడాలి తులసి గారూ అని అనగా, అభి ఏం మాట్లాడాలన్నా ఇక్కడే మాట్లాడండి, మా మధ్య దాపరికాలు ఉండవు అని అంటాడు.అప్పుడు సామ్రాట్ మంచిది అలా అయితే అని, ఫోనులో ఉన్నా దాన్ని చూపిస్తూ ఉంటాడు. తులసి గారు నా వల్లే మీకు అవమానం అని అంటూ ఉంటాడు. అప్పుడు తులసి సామ్రాట్గారూ నిజంగా మీరు దీనిని సీరియస్గా తీసుకుంటున్నారా, నేనైతే అస్సలు పట్టించుకోవటం లేదు అని అంటుంది. ఒకప్పుడు తులసిలా నేను ఇప్పుడూ లేను, వీటికి భయపడను, నా కుటుంబం నాకు ముఖ్యం, వాళ్లు నన్ను నమ్మితే చాలు అని అంటూ ఉంటుంది.
Intinti Gruhalakshmi 24 August Today Episode : మీడియా వాళ్లు సృష్టించిన రూమర్ కి తులసి సమాధానం ఏంటి

తులసి మాటలకు సామ్రాట్ మెచ్చుకుంటాడు. తులసి, సామ్రాట్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అనసూయ కంగారు పడుతూ ఉంటుంది వాళ్ళని చూసి. తర్వాత సామ్రాట్ , తులసీ, తులసీ మాట్లాడిన మాటల్ని తలుచుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు.అప్పుడు అక్కడికి సామ్రాట్ వాళ్ల బాబాయి వచ్చి, నీలో చాలా మార్పు వచ్చింది వైజాగ్ నుంచి వచ్చాక అని అడుగుతూ ఉంటాడు. మార్పుకి కారణం తులసి గారూ అని కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటాడు సామ్రాట్, తులసి గురించి.తులసి అత్తామామలు కూర్చుని మాట్లాడుతూ ఉండగా, తులసి వాళ్ళ అత్తమ్మ నాకెందుకో సామ్రాట్ ప్రవర్తన నచ్చడం లేదు అని అనగానే, అప్పుడు తులసి మామయ్య తులసి మీద నీకు నమ్మకం లేదా అని అనగా, నాకు నమ్మకం ఉంది కానీ జాగ్రత్త గా ఉంటాలి అని అంటూ ఉంటుంది. నీ కొడుకు నీ మనసులో అనుమానం అనే విషబీజాన్ని నాటివెళ్ళాడు అని అంటూ ఉంటాడు తులసి మామయ్య, ఇలా ఇద్దరు తులసి గురించి మాట్లాడుతూ ఉంటారు.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.