Intinti Gruhalakshmi 25 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 25-aug-2022 ఎపిసోడ్ 720 ముందుగా మీ కోసం….. తులసి ముందునుంచి ఎదుర్కొన్న పరిస్థితుల గురించి నందు చేసిన దారుణాల గురించి తులసి వాళ్ళ మామయ్య వాళ్ళు అత్తయ్యతో చెప్తాడు. మనం తులసికి సపోర్ట్ చెయ్యాలి అని తనకి నచ్చచెప్తాడు.ప్రపంచం మొత్తం తనని విమర్శించిన తన పైన రాళ్లు వేసినా తులసి పట్టించుకోదు.తులసికి మనం తప్ప ఎవ్వరూ లేరు మనమే తనని అర్థం చేసుకోకపోతే తులసి కుప్పకూలిపోతుంది.తను తట్టుకోలేదు అని అనసూయతొ తులసి వాళ్ళమావయ్య చెప్తాడు.తర్వాత స్వాతి రూమ్లోకి ప్రేమ బట్టల బ్యాక్ తీసుకొచ్చి ఇచ్చాడు ఇదిగో తీసుకో అని చెప్పి చూపన్నట్టు విరుచుకు పడుతూ ఉంటాడు. నేను కేవలం ఆంటీ కోసం మాత్రమే వున్నాను నీ కోసం లెను నువ్వేం ఆశలు పెట్టుకోకు అని శృతి ప్రేమతో అంటోంది. అలా వాళ్ళిద్దరూ సరదాసరదాగా కొద్దిసేపు మాటల యుద్ధం చేసుకుంటూ ఉంటారు. అలా వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది.ప్రేమమ్ కి సరైన సమాధానం చెపుతూ సరదాగా శృతి హ్యాండిల్ చేస్తూ ఉంటుంది.
ప్రేమని కింద పడుకోమని చెప్పి దుప్పటి, దిండు ఇస్తుంది.తెల్లవారి తర్వాత తులసీ వాళ్ళమావయ్య కనిపించకుండా ఎటో వెళ్లి పోతాడు.తులసి వాళ్ళ మామయ్య కోసం ఎదురుచూస్తూ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో తులసివలస మావయ్య తులసికి ఫోన్ చేసి చెప్పింది ముందు నవ్విన తులసి సామ్రాట్ వాళ్ల ఇంటికి తొందరగా తొందరగా రా చేయాల్సింది అంతా చేసి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావా ముందు సామ్రాట్ వాళ్ల ఇంటికి రాగానే కంగారుపెట్టి చాలా టెన్షన్ గా మాట్లాడతాడు. తులసి వాళ్ళ మామయ్య మాటలకి చాలా భయపడి తులసి సామ్రాట్ వాళ్ల ఇంటికి వెళుతోంది. తులసి సామ్రాట్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సామ్రాట్ గారికి సారీ చెప్తుంది. తెలిసీతెలియక మా మామయ్య ఏమన్నా ఉంటే క్షమించండి మా మామయ్యకి కొంచెం కోపం చాదస్తం ఎక్కువ అని చెప్పి తులసీ లోపలికి వెళ్లి చూస్తే తెలిసి వాళ్ళ మామయ్య సామ్రాట్ వాళ్ల బాబాయ్ ఇద్దరూ కలిసి చదరంగం ఆడుకుంటూ ఉంటారు.
Intinti Gruhalakshmi 25 August Today Episode : తులసికి సంతోషంతో వచ్చిన కన్నీళ్లు

ఏంటిది మావయ్యా అని కాలా కోప్పడుతుంది. తులసి నీకొకసారి సర్ ప్రైజ్ అని సామ్రాట్ అంటారు. వాళ్లు చెప్పేది కూడా వినకుండా చాలా కోప్పడుతుంది తులసీ. తర్వాత తనకు తానే సర్దిచెప్పుకునే కూల్గా ఏంటి సర్ ప్రైజ్ అని అడుగుతుంది.అందరూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత సర్ఫ్రైజ్ ఏంటీ అని చూస్తే తులసి స్టార్ట్ చేయబోయే కాలేజ్ కి సంబంధించిన భూమిపూజకి ఆహ్వాన పత్రిక. అది చూసి తులసి బాధపడుతూ కన్నీళ్లు తెచ్చుకుంటా ఆనందభాష్పాలు స్టార్స్ తో ఉంటుంది ఒకప్పుడు నందు చేసిన ఇన్సల్ట్ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది.కొద్ది రోజుల క్రితం తన కొడుకు పుట్టినరోజు కార్డులో తులసి పేరు కూడా వేయకుండా తన చదువురానిదాన్ని నందు చాలా ఇన్సల్ట్ చేసాడు. అదంతా తులసి గుర్తుతెచ్చుకొని చాలా బాధ పడుతోంది.భూమి పూజ కార్డులొ తులసి పేరు చూసుకొని చాలా సంతోషపడి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటుంది.
తులసి సంతోషం బాధ తో వచ్చిన కన్నీళ్లు చూసి సామ్రాట్ వాళ్ల ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. తులసి తన జీవితంలో జరిగినవన్నీ గుర్తుతెచ్చుకొని తను అనుభవించిన చేదు జ్ఞాపకాలను అన్నింటి గురించి గుర్తు తెచ్చుకుంటూ అందరితో చెప్పుకుని బాధ పడుతూ ఉంటుంది.ఆడదానికి ఎలాంటి స్వాతంత్య్రం లేదు కనీసం నేమ్ ప్లేట్ మీద తన పేరు కూడా కనిపించదు. ఇలాంటి దౌర్భాగ్యం ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది తులసి.ఆడది అన్ని విషయాల్లోనూ రాజీపడి బతికేస్తుంది. మొగవాడు కష్టపడి పనిచేస్తే పేరు వస్తుంది. కానీ ఆడదానికి ఆ అదృష్టం లేదు అని చెప్పి మాట్లాడుతూ బాధ పడుతూ ఉంటుంది తులసి.మధ్యతరగతి ఆడదాన్ని కదా అందుకే కార్డులో నా పేరు చూడగానే చాలా సంతోషపడ్డాను మీరేమనుకోవద్దు అని చెప్పి అంటోంది తులసి. ఇంటర్తో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.