Intinti Gruhalakshmi 26 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 26-August-2022 ఎపిసోడ్ 721 ముందుగా మీ కోసం. తులసి ఇన్విటేషన్ కార్డు ని చూసి సంతోషపడుతూ ఉంటే, తులసి మావయ్య నీ మొహంలో సంతోషం చూద్దామనే, ఇలా సర్ప్రైజ్ చేసాము అని, సామ్రాట్గారూ నీపేరు ని కార్డులో రాశారు, ఆకాశంలో మాత్రం నీ పేరున నువ్వే రాసుకోవాలి అని అంటాడు. అమ్మ స్వీట్ చేసుకుని రా అని సామ్రాట్ వల్లభాబాయ్ అనగానే, సామ్రాట్ నేను ఒప్పుకోను మీరొక్కరే చేయాలంటే, ఇద్దరం కలిసి చేద్దాము అని అంటాడు.ఒకవైపు లాస్య, నందు ఇద్దరు తులసి వాళ్ళ ఇంటికి వచ్చి, మాట్లాడుతూ ఉంటారు, తులసి ఎక్కడ ఉంది అని అడుగుతారు. ఒకవైపు తులసి సామ్రాట్ ఇద్దరూ కలిసి కిచెన్లో స్వీట్ చేస్తూ ఉంటారు.తర్వాత తులసి ఇంటికి వచ్చి అందరినీ సంతోషంగా పిలుస్తుంది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లావు అని లాస్య అడగ్గానే, సామ్రాట్ గారి ఇంటికి వెళ్లాను అని అంటోంది.
ఇంత పొద్దున్నే వెళ్లావా అని అనగానే, తులసి మామయ్య వచ్చి, నేనే అక్కడికి వెళ్లి, తులసిని రమ్మన్నాను అని ఇలా కొద్దిసేపు వాళ్లతో మాట్లాడతాడు.తులసి మామయ్య ప్లేట్, స్పూన్తో సౌండ్ చేస్తూ, అందరు ఇక్కడికి రండి, ఒక శుభవార్త చెప్పాలి అని, తులసితొ నీ నోటితో చెప్పమ్మా అని అనగానే, తులసి చెబుతుంది, భూమిపూజ జరగబోతుంది అని, ఇన్విటేషన్ కార్డును చూపిస్తూ ఉంటుంది వాళ్ల అత్తయ్యకి. ఇన్విటేషన్ కార్డులో సామ్రాట్ పేరును చూసి, లాస్య వెటకారంగా మాట్లాడుతుంది. వెంటనే అభి కూడా మధ్యలోకి వచ్చి అమ్మా ఆయన పేరు ఉండటం ఏంటి అని అనగానే, ఇన్వెస్ట్ చేసేది, కంపెనీకి బాస్ తనే కదా అని అంటూ ఉంటుంది. మన మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు, పేరు పక్కన ఉంటే ఏమీ కాదు అని తులసి అత్తమ్మ అంటోంది. ఇలా కొద్దిసేపు వీళ్లు మాట్లాడుతూనే ఉంటారు.తులసి ఆశీర్వాదం తీసుకుంటుంది, వాళ్ళ అత్తమ్మ మామయ్య దగ్గర.
Intinti Gruhalakshmi 26 August Today Episode : ఇన్విటేషన్ కార్డును చింపి, తులసి మనసును బాధపెట్టిన అభి

అభి కోపంగా ఆ ఇన్విటేషన్ కార్డును చింపేస్తాడు.తులసి మామయ్య అభిని తిట్టబోతుంటే, ఆగండి మామయ్య తప్పు వాడిది కాదు, ఈ అమ్మా ఏంటో వాడే తెలుసుకుంటాడు నిదానంగా అని తులసి చెపుతుంది.అప్పుడు తులసి మామయ్య అందరూ రేపు భూమి పూజ కి వెళుతున్నాం అని కోపం గా చెప్పి వెళతాడు.ఒకవైపు సామ్రాట్, వాళ్ళ బాబాయ్ ఇద్దరు స్వీట్ని తింటూ, టెస్ట్ చాలా బాగుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. హనీ ఒంటరి తనాన్ని పోగొట్టడానికి నువ్వు పెళ్ళి చేసుకోవాలి అని అంటాడు వాళ్ళ బాబాయి. వచ్చే ఆవిడ హనీ ని సరిగ్గా చూసుకోకపోతే అని అనగానే, తులసి లాంటి ఆవిడ వస్తే చేసుకుంటావా అని అంటాడు,అప్పుడు ఆలోచిస్తాను అని సామ్రాట్ అంటాడు. ఒకవైపు తులసి గదిలో కూర్చుని,అద్దంలో చూసుకుంటూ, ముక్కలైన కార్డు గురించి,అభి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ,తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అదంతా దివ్య చూస్తుంది.ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.