Intinti Gruhalakshmi 27 August Today Episode : భూమి పూజ ఆపడానికి అభికి ఫోన్ చేసి కుట్రపన్నిన లాస్య.

Intinti Gruhalakshmi 27 August Today Episode  : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 27-August-2022 ఎపిసోడ్ 722 ముందుగా మీ కోసం శ్రుతి, ప్రేమ్ ఇద్దరు గదిలోకి వెళ్ళి, ప్రేమ్, అభి కి కోపం వుందని తెలుసు కానీ, ఇలా చేస్తాడు అని అనుకోలేదు అని అంటూ వుండగా, అప్పుడు శ్రుతి ఇంట్లో మగవాళ్లు అందరూ ఇంతే కదా, ముందు మీ నాన్న, ఇప్పుడు మీ అన్నయ్య అని ఇలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇలా కొద్దిసేపు వీళ్లు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. తరువాత సామ్రాట్ వాళ్ళ బాబాయి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ,హనీ పాప దగ్గరికి వెళ్ళి, సరదాగా నిద్రలేపుతూ ఉంటాడు. ఈరోజు పూజా వుందమ్మా, రెడీ అవ్వమని అనగానే, నాకు తెలుసు తులసి అoటీ చెప్పింది. ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా చెప్పింది అని, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

ఇంతలో సామ్రాట్ వాళ్ల బాబాయి వచ్చి, త్వరగా రండి అని అనగానే, హాని పాప ఆకలవుతే నువ్వు తినొచ్చు కదా తాతయ్య అని అంటూ, కొద్దిసేపు ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవైపు తులసి, తులసికోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. ఇంతలో అభికి లాస్య ఫోన్చేసి, అభిని రెచ్చగొడుతుా, ఎలాగైనా ఈ పూజ ఆగిపోవాలని, కుట్రపన్నుతూ ఉంటుంది, తను చెప్పింది చేయమని చెబుతుంది.అభి సరే ఆంటీ అని అంటాడు. అప్పుడు లాస్య దగ్గరికి నందు వచ్చి, ఏమైంది ఇలా ఉన్నావు అనగానే, ఇదొక రకమైన ఎక్స సైజ్ అని అంటూ అంటుంది. భూమి కి సంబంధించిన పేపర్ ఎక్కడున్నాయి అని అడుగుతాడు.కొద్ది సేపు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

Intinti Gruhalakshmi 27 August Today Episode : భూమి పూజ ఆపడానికి అభికి ఫోన్ చేసి కుట్రపన్నిన లాస్య.

Intinti Gruhalakshmi 27 August Today Episode
Intinti Gruhalakshmi 27 August Today Episode

ఒకవైపు శ్రుతి రెడీ అవుతుంటే, ప్రేమ్, శ్రుతి వైపే చూస్తూ ఉంటాడు.ప్రేమ్ అంతరాత్మ బయటికి వచ్చి, తనతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటాడు కొద్దిసేపు.సామ్రాట్ వాళ్లు భూమి పూజ దగ్గరికి వస్తారు. ఇంతలో తులసి కూడా వస్తుంది. హనీ పాప తులసి దగ్గరికి వెళ్లి, ఈ రోజు నాన్న చాలా హ్యాపీ తనకిష్టమైన బ్లూ, పింక్ కలర్ మనిద్దరం వేసుకున్నాము. మీరు నైట్ ఫోన్ చేసినప్పుడు మిమ్మల్ని అందుకే బ్లూ వేసుకోమని చెప్పాను అని, ఇలా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు.లాస్య కూడా అక్కడికి వచ్చి, కొద్దిసేపు వెటకారంగా ఏదో మాట్లాడుతుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement