Intinti Gruhalakshmi 27 July Today Episode 695 : సామ్రాట్ ఇంట్లో హనీ పాపకి డ్యాన్స్ నేర్పిస్తూ, కిందపడిపోతున్న తులసిని పట్టుకున్న సామ్రాట్.

Intinti Gruhalakshmi 27 July Today Episode 695 : ఎపిసోడ్695 ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 27-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసంసామ్రాట్ తులసిని డ్యాన్స్ నేర్పించామని అడగగానే, నాకంత డ్యాన్స్ రాదు అని అంటోంది.అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్, ఏం పర్వాలేదు అమ్మా మా సామ్రాట్కి డ్యాన్స్ వచ్చు, కావాలంటే నీకు మధ్యలో హెల్ప్ చేస్తాడు అని అంటాడు. అప్పుడు తులసి కూడా సరే అంటుంది. లాస్య, నందుతో ఇక కథలో డ్యూయెట్ కూడా తప్పవా అని అంటూ ఉంటుంది చిన్నగా.తర్వాత అంకిత పని చేసుకుంటూ ఉంటే, అభి, తన దగ్గరికి వచ్చి బాగున్నావా అంకిత, నాతో ఎక్కువ మాట్లాడటం లేదు,

Advertisement

అమ్మ తోనే ఎక్కువగా ఉంటున్నావు, నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా, అని అంటూ ఉంటారు.అప్పుడు అంకితం ఇష్టం ఉంది కాబట్టే నువ్వు పక్కన ఉంటే చాలు అనుకున్నాను, అన్నీ వదిలేసి వచ్చాను, కానీ నువ్వేం చేశావ్ అని అంకిత అంటూ ఉంటుంది. అప్పుడు అభి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి, అని ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు.నువ్వు నమ్మాలి అంటే నేనేం చెయ్యాలి అని అభి అంటాడు. నమ్మకం కావాలి అంటే వచ్చేది కాదు, నాకు నమ్మకం కలిగినపుడు నువ్వు మారావని, నేను నీకు దగ్గరవుతాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు అభి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ప్రేమ్ వచ్చి బాధపడుతున్నావా అని అంటూ.

Advertisement
Intinti Gruhalakshmi 27 July Today Episode 695
Intinti Gruhalakshmi 27 July Today Episode 695

చేతి నుంచి పడిపోయిన వస్తువును తీసుకునే అంత తేలిక కాదు రా, దూరమైన మనసుని దగ్గర చేసుకోవడం. ఆడవాళ్లు ప్రేమించినంత ఎవ్వరూ ప్రేమించలేరు, అది వాళ్లకున్న వరం. కానీ ఒక్కసారి మనసు విరిగిపోతే ఆడవాళ్లు సర్దుకొని పోలేరు అది దేవుడు వాళ్లకిచ్చిన శాపం. అని అనగానే అభి, నువ్వు వాళ్ళని సమర్థిస్తున్నావా అని అంటాడు, లేదు నమ్మకం కోల్పోతే తిరిగి సాధించుకోవడం ఎంత కష్టమో చెబుతున్నాను, అని అనగానే, ఎక్కడైనా చదివింది చెపుతున్నావా, లేదా అనుభవంతో తెలుసుకొని చెపుతున్నావా అని, అక్కడి నుంచి వెళ్లిపోతాడు అభి. తర్వాత ప్రేమ్ మనస్సులో అనుభవంతోనే చెపుతున్నాను అన్నయ్యా అని అనుకుంటూ బాధపడతాడు.

Intinti Gruhalakshmi 27 July Today Episode 695 : సామ్రాట్ ఇంట్లో హనీ పాపకి డ్యాన్స్ నేర్పిస్తూ, కిందపడిపోతున్న తులసిని పట్టుకున్న సామ్రాట్.

తరువాత సామ్రాట్ ఇంట్లో సాంగ్ పెట్టి ఈ పాట మీకో ఓకే కదా తులసిగారు అని అడుగుతూ ఉంటాడు, అప్పుడు తులసి ఓకే అని అంటుంది.జ్యూస్ ఏమైనా తెప్పించమంటారా తులసిగారు అని అడుగుతాడు సామ్రాట్. వద్దు అని అంటోంది తులసి, ఇంతలో నందు, సార్ మళ్లీ కలుస్తామని చెప్పి అనగానే, అదేంటి మా హనీ డ్యాన్స్ చూడరా అని అంటాడు సామ్రాట్. అప్పుడు నందు అలా ఏం కాదు సార్ అని అనగానే, తులసి ఏదైనా ముఖ్యమైన పని ఉందేమో అని, పాపం వెళ్ళనివ్వండి సార్ అని అంటోంది అప్పుడు తులసి.లాస్య మన మీద జాలితో కాదు.

మనం వాళ్ళ సినిమాకి అడ్డు కాకూడదని వెళ్లమని అంటుంది అని అంటుంది నందూతో. అప్పుడు సామ్రాట్ సరే మీ ఇష్టం అని అనగానే, లాస్య లేదు సార్ ఇక్కడ ఇంత ఇంటరెస్టింగ్ గా డ్రామా జరుగుతుంటే వదిలేసి ఎలా వెళతాం అని అంటుంది. పొరపాటున వెళ్ళిన మా మనసు ఇక్కడే వుంటుంది కదా నందు, అని అనగానే ఆ అవునవును అని అంటాడు నందు. తర్వాత తులసి డ్యాన్స్ మొదలుపెడుతుంది. తులసి డ్యాన్స్ చేస్తూ కింద పడబోతుంటే సామ్రాట్ పట్టుకుంటాడు. అప్పుడు లాస్య, నందుతో పొరపాటునే పడివుంటుందా అని అంటూ ఉంటుంది.

ఇంతలో సామ్రాట్కి ఫోన్ వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సామ్రాట్, తులసితో పాపకి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం చాలా ఇష్టం. నాకేమో పెద్దగా నాలెడ్జ్ లేదు, కానీ మీరు చాలా హెల్ప్ చేసారు, అని పొగుడుతూ ఉంటారు. తులసి ఇక నేను వెళతాను అనగానే, సామ్రాట్ మిమ్మల్ని ఒకటి అడగాలి అని, ఈ ప్రోగ్రామ్ టైమ్కి రేపు మీరు కూడా హాని పక్కనే ఉండాలి అని అంటాడు.

అప్పుడు నాకు కుదరదు ఏమీ అనుకొకండి అని అంటుంది. అప్పుడు పాప తులసి అంటీ రాకపోతే నేను పర్ఫామెన్స్ చేయను అని అంటుంది. అప్పుడు లాస్య వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది, అంటీకి పని ఉంటుంది కదా అని. అప్పుడు పాప, నాకు ధైర్యంగా ఉంటుంది, మీరు నా పక్కనే ఉంటే అని అనగానే, అందరూ అడగగానే, తులసి కూడా ఒప్పుకుంటుంది వస్తాను అని. కాంపిటీషన్ దగ్గరికి తులసి వస్తూ ఉంటుంది, మనసులో ఎలాగైనా పాపని గెలిపించాలి.మ్యూజిక్ స్కూల్ పెట్టడానికి హెల్ప్ చేశారు. పాపను గెలిపించి, రుణం తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది.

అక్కడికి లాస్య, నందు కూడా వస్తుా, ఎలాగైనా లక్కీనే గెలవాలి అని లాస్య అంటుంది. తులసి, హనీ పాపని రెడీ చేస్తూ ఉంటుంది, అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు లక్కీ అక్కడికి వచ్చి, తులసి ని ఆటపట్టిస్తూ ఉంటాడు. అపుడు ఎవ్వరూ ఈ బాబు అని అందరూ అనగానే, గడ్డం తీసి, నేను ఆంటీ లక్కీని అని అంటాడు, అక్కడికి లాస్య వచ్చి ఎందుకు గడ్డం ఊరికే తీసుకున్నావు అని కోప్పడుతుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement