Intinti Gruhalakshmi 28 August Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 723 హైలెట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం… తులసి వాళ్ళ ఫ్యామిలీ అంతా సంతోషంగా భూమి పూజకి వస్తారు. కానీ లాస్య భూమి పూజ ఆపాలని ఒక గట్టి ప్లాన్ వేస్తుంది. తులసి వాళ్ళ ఫ్యామిలీ అందరూ భూమి పూజ దగ్గర కలుసుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి లాస్య ,నందు వస్తారు. లాస్య తులసిని సూటిపోటి మాటలంటూ బాధ పెడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ్ మధ్యలోకి దూరి లాస్య కు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. తర్వాత భూమి పూజ మొదలవుతుంది. అక్కడికి తులసి వాళ్ళ తమ్ముడు కూడా వస్తాడు. అప్పుడు లాస్యను నందును చూసి చిరాకు పడుతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ ఏమైంది అని తులిసి వాళ్ళ తమ్ముడిని అడుగుతాడు.
Intinti Gruhalakshmi 28 August Today Episode : నందు గురించి అంత బయట పెట్టేసిన తులసి తమ్ముడు..
మా అక్కకి జరిగిన చేదు గతాన్ని తలుచుకుంటుంటే మా ఒళ్లంతా మండిపోతుంది. అని అంటాడు. అప్పుడు సామ్రాట్ ఏం జరిగింది తులసి గారి గతమేంటి అని అడుగుతాడు. అప్పుడు తులసి వాళ్ళ తమ్ముడు మా అక్కని ఒక దుర్మార్గుడు మోసం చేశాడని చెప్పాను కదా.. ముగ్గురు పిల్లల తర్వాత నా అక్కని కాదని ఓ మాయలాడి వలలో పడి చిక్కుకున్నాడు. తనకి ఇప్పుడు అర్థం కావడం లేదు ఒకప్పుడు కచ్చితంగా అర్థమవుతుంది. అని నందు వైపు చూసి అంటాడు. అప్పుడు లాస్య వామ్మో ఇప్పుడు తను తులసి మాజీ భర్త అని చెప్తాడా.. ఆ విషయం సామ్రాట్ కి తెలిస్తే ఇప్పుడు మొదటికే మోసం వస్తుంది. అప్పుడు తులసి అవన్నీ ఇప్పుడు ఎందుకురా తమ్ముడు వద్దు ఆ విషయాలన్నీ ఎప్పుడో మర్చిపోయాం ఇక మాట్లాడొద్దు అని అంటుంది. అయినా సరే తులసి వాళ్ళ తమ్ముడు గతమంతా చెప్పాలని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు లాస్య ఏదో ఒక విధంగా తనని చెప్పకుండా అడ్డుపడుతుంది.

అప్పుడు సామ్రాట్ లాస్యని తిడుతూ ఉంటాడు. తర్వాత సామ్రాట్ భూమి పూజ అంతా తులసి తోనే చేయిస్తాడు. అదంతా చూస్తున్న లాస్య ఆ పూజలో అడ్డంకులు చేయించాలని చూస్తూ ఉంటుంది. కానీ ఏం చేయలేక పోతుంది. తులసిని ఇన్ని రోజుల వరకు ఇష్టపడ్డాను ఇక పెళ్లి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సామ్రాట్. కానీ తులసి గారు ఏమంటారు అని కంగారు పడుతూ ఉంటాడు. నాకు భార్యగా కాకపోయినా నా బిడ్డకి తల్లిగా ఉండమని అడగాలి. అని తులిసి గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ బాబాయ్ కి ఆ విషయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్ తెగ సంతోష పడిపోతాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే శృతి ప్రేమ్ చీటికిమాటికి చిన్నచిన్నగా గొడవ పడుతూ దగ్గరవుతూ ఉంటారు. ఇలా ఎన్నో మలుపులు తిరుగుతూ సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఎదురుచూడాల్సింది.