Intinti Gruhalakshmi 28 July Today Episode 696 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 28-july-2022(696 episode) ఎపిసోడ్ ముందుగా మీ కోసం…..లక్కి, తులసితో మాట్లాడుతూ ఉండగా, సామ్రాట్ ఈ బాబు ఎవరు అని అడుగుతాడు. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. ఓ మీ బాబునా అని అంటాడు. అవును అని అంటుంది లాస్య. అప్పుడు బాబుకి ఆల్ ద బెస్ట్ చెబుతాడు సామ్రాట్. అప్పుడు లక్కి మీ పాపకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాను అని చెప్పండి, మొదటి ఫ్రైస్ నాకు, రెండో ఫ్రైస్ తనకి అని అంటాడు. అప్పుడు నందు చిన్నపిల్లాడు తెలియక అన్నాడు అని అనగానే, సామ్రాట్ పరవాలేదు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి అని అంటాడు.
వాళ్ళు వెళ్లిపోగానే, అవును తులసి గారూ ఈ అబ్బాయి మీకెలా తెలుసు ఆంటీ అని పిలుస్తున్నాడు, అని అనగానే, ఇంతలో హనీ పాప వస్తుంది తులసి దగ్గరికి.అప్పుడు తులసి, పాపతో తాతయ్య, నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొమని అంటుంది. ఒకవైపు లక్కి ని, లాస్య తిడుతూ ఉంటుంది, నువెందుకు తులసి దగ్గరికి వెళ్లావు అని, అయినా నీకు ఎలా తెలుసు, తను ఇక్కడ ఉంది అని అనగానే, మీరు మాట్లాడుకుంటే విన్నాను అని అంటాడు, ఎలాగైనా గెలవాలి గెలిచి నాపేరు స్టేజిపైన చెప్పాలి గొప్పగా అని అనగానే,నువ్వు ఏం చేశావని చెప్పాలి అని లక్కి అంటాడు.

డ్రెస్సు కూడా అంకులే కొనిచ్చాడు అని అనగానే, అప్పుడు లాస్య ఆ డబ్బులు నావే అని అంటుంది వెటకారంగా,దాంతో నందుకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళతాడు. ఒకవైపు హనీ పాపతో డ్యాన్స్ వేసే టీచర్కి ఫోనొస్తుంది, కంగారుపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో తులసి వచ్చి ఏమైంది అని అడగగానే ఇక్కడ నాకు జీతం తక్కువగా వస్తుంది అని, వేరే జాబ్ కి అప్లై చేశాను మేడం వాళ్లేమో ఇప్పుడే ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ చేస్తున్నారు, రేపు వస్తాను అని చెప్పినా వినటం లేదు అని చెబుతుంది తులసితో.
Intinti Gruhalakshmi 28 July Today Episode 696 : కాంపిటీషన్ దగ్గర నుంచి వెళ్లిపోయిన హనీ వాళ్ళ టీచర్, హాని పర్ఫామెన్స్ ఏమౌతుంది?
ఇంతలో హనీ పాప పిలుస్తూంది అప్పుడు తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ టీచరేమో ఇదేమి పెద్ద జాబా, ఇక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతాను, అక్కడ నాకు డబుల్ శాలరీ వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది.సామ్రాట్, వాళ్ళ బాబాయ్ ఇద్దరు కాంపిటీషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో హనీ వాళ్ళ టీచర్ అక్కడినుంచి వెళ్లడాన్ని గమనించి పిలుస్తారు, ఎక్కడికి వెళుతున్నారు మేడమ్ అని అంటాడు.క్యాంటీన్ వరకు వెళుతున్నాను అని అనగానే, మీకేమైనా అవసరం ఉంటే నాకు చెప్పొచ్చు కదా, మీరు పక్కన లేకపోతే పాప కంగారుపడుతుంది, పర్ఫామెన్స్ సరిగా చేయలేదు అని అంటాడు.
తులసి లక్కీని పిలుస్తుంది, హనీని పరిచయం చేసి ఆల్ ది బెస్ట్ చెప్పు అనగానే ఆల్ ది బెస్ట్ చెప్పి వెళతాడు .కానీ హని అల్ ది బెస్ట్ చెప్పదు, అప్పుడు తులసి ఏంటమ్మా చెప్పలేదు అనగానే నేనే గెలవాలి అంటీ అందుకే చెప్పలేదు అనగానే అలా ఉండకూడదు, అమ్మా మనము ఓడిపోయినా కూడా బాధపడకూడదు, మరోసారి గెలవాలి అనుకోవాలి, ఒకరిమీద శిక్ష పడకూడదు, అని కొన్ని మంచి మాటలు చెబుతూ ఉంటుంది, అప్పుడు పాప ఓకే అంటీ, నా తప్పు నేను తెలుసుకున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్పి వస్తాను అని వెళుతుంది, ఇదంతా సామ్రాట్ వాళ్లు చూస్తూ ఉంటారు.
సామ్రాట్ తులసి దగ్గరికి వచ్చి, థ్యాంక్స్ అండీ మీరు అన్నీ చెబుతున్నారు తనకి, అమ్మలేదు కదా ఇవన్నీ చెప్పడానికి, తను చాలా దురదృష్టవంతురాలు అనగానే, లేదు ఒకటి దూరం చేస్తే ఇంకొకటి తిరిగి ఇస్తాడు దేవుడు అని అంటూ ఉంటుంది. కాంపిటీషన్ దగ్గర లాస్య నందు, సామ్రాట్ వాళ్ల బాబాయ్, కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇంతలో కాంపిటీషన్ మొదలవుతుంది, ఒక స్కూల్ నుంచి ఒకరు పర్ఫామెన్స్ మొదలుపెడతారు, దాని తర్వాత కి పర్ఫామెన్స్ చేస్తాడు ఇంతలో పాప టీచర్ కనిపించట్లేదు అని తులసితో అంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.