Intinti Gruhalakshmi 29 July Today Episode 697 : ఎపిసోడ్ 697 ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 29-july-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం. కాంపిటీషన్ దగ్గర హని వాళ్ల టీచర్ కనిపించకపోవటంతో, తులసి వెతుకుతూ ఉంటుంది, అయినా కనిపించదు. వెంటనే సామ్రాట్ వాళ్ల దగ్గరికి వెళ్లి, జరిగిన విషయం చెప్పి, అందరూ కలిసి వెతుకుతారు. అయినా కూడా కనిపించదు. అప్పుడు సామ్రాట్, వాళ్ళ బాబాయి తో ఎలాగైనా హని గెలవాలి, ఎంత డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు, ఆ టీచర్ ప్లేస్లో ఇంకొకర్ని ఆరెంజ్ చేయి అని చెబుతూ ఉంటే, ఇంతలో తులసి డబ్బుకి సంబంధించింది కాదు, చివరి నిమిషం లో ప్రాక్టీస్ లేకుండా ఎవరు మాత్రం పర్ఫామెన్స్ చేయగలరు అని అంటూ ఉంటుంది.
అది నిజమే నేను టీచర్ని వెతుకుతాను, ఈ లోపు మీరు పాప దగ్గరికి వెళ్లండి తులసి గారూ అని అంటాడు సామ్రాట్. తులసి తొ, పాప టీచర్ ఎక్కడ ఆంటీ అని అడగగానే, మీ నాన్న తీసుకొనిరావడానికి వెళ్లాడు అమ్మా అని అంటుంది. ఒకవైపు సామ్రాట్, వాళ్ల బాబాయి బాగా వెతుకుతారు టీచర్ గురించి. వాచ్మేన్ని కూడా© అడిగితే, ఆమె ఎప్పుడో వెళ్లి పోయింది అనగానే, ఎలా వెళ్ళనిచ్చావు అని సామ్రాట్ కోపంగా అంటాడు. అప్పుడు వాళ్ల బాబాయ్ వాళ్లేం చేస్తారు అని, అక్కడి నుంచి పక్కకు తీసుకువస్తాడు, బాబాయ్ నేను హనీకి ఎలా నామొహం చూపించాలి, ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసింది.
Intinti Gruhalakshmi 29 July Today Episode 697 : హని తొ కలిసి డ్యాన్స్ వేసిన తులసి, కాంపిటీషన్లో విన్నర్ గా నిలిచిన హని, లక్కి.

నేను ఇంటికి వెళ్ళిపోతాను నిరాశతో తన మొహాన్ని నేను చూడలేను అనగానే, కష్టం వచ్చినప్పుడు అండగా ఉండాలి, ఇలా చేస్తే పాపకు ఎలా దగ్గర అవుతావు అని వాళ్ల బాబాయ్ మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో హనీని పిలుస్తారు పర్ఫామెన్స్ చేయడం కోసం.తులసి జడ్జెస్ దగ్గరికి వెళ్లి, ఏదో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసిన సామ్రాట్, వాళ్ల బాబాయితో మనం చేయాల్సిన పనిని తులసిగారు చేస్తున్నారు. పర్ఫామెన్స్ క్యాన్సల్ చేయిస్తున్నారు అని అంటూ ఉంటాడు.తులసి హనీ పాపతో నువ్వు వెళ్ళు డ్యాన్స్ చేయమ్మా, ఇంతలో టీచర్ వస్తుంది అని చెప్పి అంటుంది.
పాప స్టేజ్ మీదికి వెళ్లి పర్ఫామెన్స్ స్టార్ట్ చేయగానే అప్పుడు తులసి వస్తుంది, ఆ టీచర్ ప్లేస్లోకి డ్యాన్స్ చేయడానికి. సామ్రాట్, వాళ్ళ బాబాయి చాలా సంతోష పడతారు వాళ్లిద్దరూ డ్యాన్స్ చేయడాన్ని చూసి.డ్యాన్స్ పర్ఫామెన్స్ పూర్తయ్యాక ఇద్దరు టాప్ టూ కంటెస్టెంట్లని స్టేజ్ మీదికి పిలుస్తారు, అందులో హనీ పాప, లక్కీ ఉంటారు.అప్పుడు ఇద్దరిలో విన్నర్ ఎవరంటే అని , ఇద్దరు విన్నర్స్ అని ఎనౌన్స్ చేశారు అందరూ చాలా సంతోష పడతారు.
అప్పుడు అందులో ఒకతను లేచి అసలు తులసి హని వాళ్ళ టీచర్ కానే కాదు, ఎలా విన్నర్ గా డిక్లేర్ చేస్తారు అని అడగగానే, జడ్జెస్ టీచర్ చేసిన తప్పుకి స్టూడెంట్ బలి అవ్వడం ఎందుకు అని, తులసి గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. మాకు న్యాయం అనిపించింది అందుకే ఒప్పుకున్నాము. అయినా తులసిగారు హనీ పాపకి సంగీతం టీచర్, తనే డ్యాన్స్ కూడా నేర్పించింది అని చెబుతారు. దాంతో అందరూ చప్పట్లు కొడతారు. పేరెంట్స్ని కూడా స్టేజ్ మీదికి పిలుస్తారు. అప్పుడు హనీ పాప మైక్ తీసుకొని ఈరోజు తులసి ఆంటీ వల్లే నేను గెలిచాను.
తను కూడా స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాను అని అనడంతో, సామ్రాట్ తులసి దగ్గరికి వెళ్లి మీరు కూడా రండి పాప కోరుకుంటుంది అని అంటాడు. అప్పుడు తల్లిదండ్రులు కదా ఉండాల్సింది నేను ఎలా అని అనగానే, సామ్రాట్ వాళ్ల బాబాయ్ నువ్వే కదమ్మా కష్టపడి గెలిపించావు, వెళ్ళు అమ్మా అని అంటాడు. దాంతో తులసి కూడా వెళుతోంది స్టేజ్పైకి, అప్పుడు లాస్య నందు తో చూడు తల్లిదండ్రులు ఉండాల్సిన స్థానంలో వీళ్లిద్దరూ ఉన్నారు అని అంటుంది చిన్నగా. ఇద్దరు పిల్లలకి ప్రిన్సిపాల్ గారు ఫ్రైసెస్ ఇస్తారు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.