
Intinti Gruhalakshmi 3 August Today Episode 701 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 3-August-2022 ఎపిసోడ్ ముందుగా మీ కోసం. తులసి రాత్రి బయట కూర్చుని, ఆలోచిస్తూ వుండగా, నందు ఒక్కడే వస్తూ ఉంటాడు, ఈయన ఏంటి ఈ టైమ్ లొ వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు నందు తులసి దగ్గరికి రాగానే, అత్తయ్య మామయ్య పడుకున్నారు అని అనగానే,నేను మీతోనే మాట్లాడటానికి వచ్చాను అని అంటాడు నందు. అప్పుడు పిల్లల గురించా అని అనగానే, కాదు అనగానే, మరి దేని గురించీ, మన మధ్య మాట్లాడుకోడానికి ఏమి ఉంది అని అంటుంది.ఇలా కొద్దిసేపు మాట్లాడుతూ ఉండగా, అప్పుడు నందు నేను సంతోషంగానే ఉన్నాను, నా దగ్గర లేనిది ఏంటి, అందమైన భార్య, చేతినిండా సంపాదన, ఇల్లు అన్నీ వున్నాయి అనగానే, కన్నతల్లి అని అంటుంది తులసి, వాళ్లు నా దగ్గర ఉన్నారు అని అనగానే, కుట్రచేసి నువ్వే వాళ్లను నాకు దూరం చేశావు అని ఇలా మళ్లీ కొద్దిసేపు మాట్లాడుతూనే ఉంటారు తులసి, నందు. ఇంతకూ వచ్చిన పనేంటో చెప్పమని తులసి అనగానే, అప్పుడు నందు మనం సామ్రాట్ గారి దగ్గర పని చేస్తున్నాము, ఒక విషయం తెలియకుండా వుంటే బాగుంటుంది అనగానే, ఏ విషయం అని తులసి అంటుంది.
అప్పుడు నేను నీ మాజీ భర్తని అనే విషయం అని అంటాడు. అప్పుడు తులసి తెలిసిపోతే నాకేం సమస్య లేదు అంటుంది .అప్పుడు నందు సమస్య నీకు కాదు, నాకు అని అంటాడు.నీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది సామ్రాట్ గారికి, నిజం తెలిస్తే అది నా మీద అయిష్టంగా మారుతుంది, అని అంటాడు. ఎందుకు భయపడుతున్నారు అని తులసి అనగానే,నాకేమీ భయమూ లేదు అని నందు అంటాడు. భయమే బుకాయించకండి చిన్నపిల్లలాగా, అయినా నేను అబద్ధం చెప్పను అని తెలుసు, ఎందుకు అడగడానికి వచ్చారు అని అంటుంది. అప్పుడు తులసి ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో, ఒకప్పుడు నన్ను భార్యగా చెప్పుకోవడానికి అసహ్యించుకున్నారు. ఇప్పుడు నా మాజీ భర్త అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. అని అనగానే, ఇది భయం కాదు అని నందు అంటాడు. అప్పుడు తులసి ఖచ్చితంగా ఇది భయమే అని, మీరు నా ముగ్గురు పిల్లలకు తండ్రి, నేను అబద్ధం చెప్పలేను కానీ, మీకొక సహాయం చేస్తాను, ఒకవేళ నన్ను అడిగితే నేను చెప్పాను, నా అంతట నేను చెప్పను, అని చెప్పి వెళుతుంది. దాంతో నందు సరే కనీసం తనంతట తాను చెప్పనంది కదా అని అనుకుంటాడు మనసులో.తర్వాత సామ్రాట్ రెడీ అవుతూ ఉంటే, మీ డ్రెస్ బాలేదు నాన్న టీషెట్ వేసుకోండి అని ఇస్తుంది.

ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు, హని పాప, సామ్రాట్, వాళ్ల బాబాయ్. సామ్రాట్ పాప ఇచ్చిన టీ షర్ట్ని వేసుకుంటాడు. ఇంతలో తులసి వాళ్లు అక్కడకు వెళతారు, అందరికీ ఒక విషయం చెబుతున్నాను గుర్తుంచుకోండి అని తులసి అనగానే, తులసీ వాళ్ళ మామ ఏంటమ్మా అనగానే, అదే మామయ్య మీ కొడుకు నా మాజీ భర్త అని తెలియకూడదు అని చెబుతుంది వాళ్ళతో, అప్పుడు తులసి వాళ్ళ అత్త వాడు అడిగాడని చెప్పకుండా ఉండాలా అనగానే, ఆయన అడిగాడని కాదు నాకే చెప్పుకోవడం ఇష్టం లేదు అని తులసి అంటుంది. దాంతో అందరూ ఇంట్లోకి వెళతారు.ఇంట్లోకి వెళ్లగానే దివ్య, ఇల్లు చాలా బాగుంది, నానమ్మ హోమ్ టూర్ చేసి, నీ ఛానెల్ లొ పెడదాం అనగానే, తులసి వాళ్ళ అత్త లైకుల మీద లైకులు వస్తాయి, అలాగే అని అంటూ ఉంటారు నవ్వుకుంటూ. అప్పుడు అక్కడికి హనీ పాప వచ్చి హాయ్ అంటీ, తొందరగా రావొచ్చు కదా అని అంటూ ఉంటుంది. ఇంతలో సామ్రాట్ వల్ల భాయ్ బాబాయ్ పాత గొడవలు మర్చిపోయి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అని అంటూ ఉంటారు.
Intinti Gruhalakshmi 3 August Today Episode 701 : తులసితొ తను మాజీ భర్త అని సామ్రాట్కి తెలియకుడదు అని చెప్పిన నందు, తులసి సమాధానం ఏంటి
అప్పుడు తులసి గొడవలు జరిగినా పశ్చాత్తాపం ఉంటే కథ సుఖాంతం అవుతుంది. కొంతమంది ఒప్పుకోరు అని అంటూ వుండగా, నందు లాస్య అక్కడికి వస్తూ ఉంటారు. అప్పుడు లాస్య లోకంలో వున్న మగవాళ్ల గురించి ఇలా మాట్లాడుతున్నావు, నీకు మగవాళ్ల మీద కోపమా, ఎవరైనా మగాడి మీద కోపమా అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సామ్రాట్ తనేదో క్యాజువల్ గా కామెంట్ చేసింది అనగానే, లాస్య కూడా నేను కూడా అలానే సార్ అని అనగానే, అప్పుడు సామ్రాట్ అనవసరంగా మన డిస్కషన్ ఎక్కడికో వెళుతుంది అని అంటాడు. ఇలా కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటారు ఒకరి గురించి ఒకరు. అప్పుడు దివ్య అంకుల్ అని, ఆగిపోతుంది సారీ పొరపాటున అంకుల్ అనేశాను అని అంటుంది. సారి ఎందుకమ్మా ఇలాంటి పిలుపులే ఆత్మీయతలు పెరిగేలా చేస్తాయి, అని అంటాడు సామ్రాట్.అవును నువ్వేదో చెప్పాలి అన్నావు కదా అని అనగానే, దివ్య మీ ఇల్లు ప్యాలెస్ లా ఉంది అంకుల్ అని అంటుంది. అప్పుడు సామ్రాట్ నిజానికి ఉండేది ఇద్దరమే ఇంత పెద్ద ఇల్లు అని అనగానే, సామ్రాట్ వాళ్ల బాబాయ్ అదేంటి ఇద్దరే అంటున్నావు.
నన్ను లెక్కపెట్టలేదు అనగానే, అప్పుడు హనీ పాప లేదు నన్నే లెక్కపెట్టలేదు నేనే ఆఫ్ టిక్కెట్ని అనగానే, నేను నిన్నెలా వదిలిపెడతాను అమ్మా అని అంటూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. మా హనీ కి ఒక ఆశ మీలాంటి కుటుంబం కావాలి అని, అలాంటి ఆశతో ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ ఉన్నాము అని ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు.మీరు కూర్చోండి నేను వంట చేస్తాను అనగానే, మీరు చేస్తారా అని అంటారు, అప్పుడు సామ్రాట్ వాళ్ల బాబాయ్ మా వారు చాలా బాగా వంట చేస్తాడు అనగానే, లాస్య నందు కూడా బాగా చేస్తాడు అని అనడంతో, అప్పుడు సామ్రాట్ సరే ఇద్దరం కలిసి చేస్తాము అని అంటారు. అప్పుడు వీళ్లు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య ఇలా కాదు రెండు టీమ్ లాగా విడిపోదాము అప్పుడు ఎవరు బాగా చేస్తారో చూడొచ్చు అని టీమ్స్ని చేస్తూ ఉంటుంది. ఇలా వీళ్లు సరదాగా మాట్లాడుకుంటూ వంట మొదలు పెడదాం అని అనుకుంటూ ఉండే లోపే, ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.