Intinti Gruhalakshmi 30 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 30-aug-2022 ఎపిసోడ్ 724 ముందుగా మీ కోసం….తులసి విజయానికి కారణమైన ఆ వ్యక్తి పేరు చెప్పమని ప్రెస్ వాళ్లందరూ అడుగుతారు. చెప్తాను కానీ ఇప్పుడు కాదు అని అంటోంది తులసి.తులసి జీవితం ఆగిపోయిందని, నిరాశలో కూరుకుపోయిన సమయంలో, నా అడుగులు ముందు పడవని ఆలోచిస్తున్న సమయంలో సామ్రాట్గారూ నాకు దేవుడిలాగా ఆశ్రయమిచ్చారు దారి చూపించారు అని సామ్రాట్ని మెచ్చుకుంటోంది.ఈ ప్రాజెక్టు గురించి వివరాలైనా ఏవైనా ప్రశ్నలు ఉన్న మీరందరూ తులసి గారిని అడగొచ్చు ఏం పర్వాలేదు అని చెప్పి ప్రసవాలకే చెప్పి సామ్రాట్ వెళ్లిపోతాడు.తర్వాత లాస్య అబి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో సామ్రాట్ ఫోన్ మాట్లాడుతూ అటువైపుగా వెళితే అంటుంది సామ్రాట్ దగ్గరికి స్ఫూర్తి వెళ్తోంది.శ్రుతి తనను పరిచయం చేసుకుపోయేలోపే మీరు తులసి గారి రెండో కోడలు కదా మిమ్మల్ని చూసే తులసి గారిని చూసినట్టే ఉందే అని సామ్రాట్ అంటాడు.
Intinti Gruhalakshmi 30 August Today Episode : సామ్రాట్ తులసికి చేస్తున్న సహయంలో తన ఉద్దేశం ఏంటి అని సామ్రాట్ని ప్రశ్నించిన శృతి.
దాని తర్వాత శృతి మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను మీరేమీ అనుకోవద్దు అని చెప్పి అంటోంది శృతి.మీ మనసు లో మాత్రమే గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది మీరు ఏ ఉద్దేశంతోనే మాత్రమే కి సాయం చేస్తున్నారు అని శృతి అడగగానే ఎందుకు ఒకరికి సాయం చేయడం మంచిది కాదా అని సామ్రాట్ అంటారు. నేను మిమ్మల్ని ఆ ప్రశ్నకి సమాధానం అడుగుతున్నారో మీరు మా తులసి అంటేనే ఇష్టపడుతున్నారా అని అడిగేసింది శృతి.మీరు చెప్పే సమాధానం చాలా ఊహాగానాలకు తెర పడేలాగా చేస్తుంది.కొంతమందికి ప్రశాంతంగా కూడా ఉంటుంది అని శృతి అంటోంది.మీరు అడిగారని కాదు చెప్పే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. అవును తులసి గారిని ఞష్టపడుతున్నాను అని సామ్రాట్ అంటాడు.మీరనుకున్న ఇష్టం కాదు తులసిగారు లోని పట్టుదలనే ఆత్మగౌరవాన్ని తన ఏదైనా సాధించగలననే నమ్మకాన్ని దాన్ని ఇష్టపడుతున్నాను అని చెప్తాడు సామ్రాట్. ఇది తప్ప మీరే చెప్పండి అని శృతి ని అడుగుతారు. మీరు భయపడటంలో అర్థముంది మీకు క్లారిటీగా చెప్తున్నాను తులసిగారు కేవలం నా బిజినెస్ పాట్నర్ మాత్రమే పైకి ఎదగాలనుకునే తన ఆరాటానికి ఆశకి నేను కేవలం సాయం చేస్తున్నాను, అంతే తప్ప ఇంకో ఉద్దేశం నా మనసులో లేదు అని క్లారిటీగా చెప్తాడు.

మీరెవరో ఇలాంటి విషయాలు మనసులో టెన్షన్ పెట్టుకోవద్దని చెప్పి సామ్రాట్ అంటాడు. నేను అంటే ఎవరో తెలియదు కాని తులసిగారి గురించే మీరు తప్పుగా ఆలోచించకండి అని అంటాడు. ఆంటీ మా దేవత అని చెప్పి శ్రుతి అంటోంది.ప్రెస్ వాళ్ళతో మీ వంతు సాయం చేయండి మా ఆశయం గురించి జనాలకి చెప్పేలాగా చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తోంది. అలా కొద్దిసేపు ప్రెస్ వాళ్ళ తొ తులసి మాట్లాడుతోంది.ప్రెస్ వాళ్లతో మాట్లాడిన విధానానికి సామ్రాట్ తులసిని మెచ్చుకుంటాడు.ప్రెస్ వాళ్లందరూ మల్టీ బిజినెస్ మ్యాన్ ఆయన సామ్రాట్గారూ తులసీ గారితో బిజినెస్ చేయడం వింతగా ఉందని మాట్లాడుకుంటూ ఉంటారు.వాళ్ల మాటలకి నందుకి చాలా కోపం వస్తుంది నందుని లాస్య ఆపుతూ ఉంటుంది. భూమి పూజ విజయవంతంగా పూర్తవుతుంది అబి రాక పోయేసరికి లాస్య నిరుత్సాహపడుతుంది. దాంతర్వాత యాగం మొదలుపెట్టారు.పంతులు గారు చెప్పినట్టు సామ్రాట్ తన చేతి ముద్రలు ఒక పేపర్ పైన వేస్తాడు.ఇది మన ఆచారం కాదు నువ్వైనా చెప్పు అని లాస్య అంటుంది. కానీ నందు నాకేం అవసరం నేను చెప్పను అని అంటాడు.
తర్వాత పంతులుగారు తులసిని కూడా తన వేలి ముద్రలు పేపర్పైన వేయమని చెప్తాడు.అలా సామ్రాట్ తులసి ఒకరి చేతి ముద్రలు ఒకరివి పక్కపక్కనే పేపర్పైన ఉంటాయి.పంతులుగారు ఆ పేపర్ ని తీసుకుని చూస్తుంటే గాలికి ఆ పేపర్ ఎగిరి నందు శెట్టికి అంటుకుంటుంది. వింతగా నందు సెట్ కి ఇద్దరి వేలిముద్రలూ అచ్చు పడతాయి.సారీ నందు ఇంకో సట్ కూడా లేదు అంటే ఫర్వాలేదు అని నందు అంటాడు. యజ్ఞం కూడా మంచిగా విజయవంతంగా పూర్తవుతుంది. పుజా ఆపడం కోసం అబి ఆవేశంగా వస్తూవుంటాడు.అభి పూజ దగ్గరికి వచ్చేసరికి పూజ అయిపోతుంది.పంతులుగారు తులసి సామ్రాట్తో వ్యాపార భాగస్వామ్యం అంటే భార్యాభర్తల బంధం లాంటిది అని చెప్పేసరికి అబికి కోపం వచ్చి క్లాప్ కొట్టి ఇలా ఏ శాస్త్రంలో ఉందా అని కోప్పడి అడుగుతూ ఉంటాడు.ఇలా ఎవరైనా మాట్లాడతారా అని అభి కోప్పడతాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.