Intinti Gruhalakshmi 31 August Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 31-August-2022 ఎపిసోడ్ 725 ముందుగా మీ కోసం పూజ జరిగే దగ్గరికి అభి కోపంగా వచ్చి, ఏ సంబంధం లేని ఇద్దరినీ భార్యాభర్తల లాగా కూర్చోబెట్టి, పూజ చేయడం, ఇదంతా తప్పు కాదా అని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు తులసి అభితొ లేనిది ఊహించుకుని ఆవేశపడకు అని, తొందరపడి మాట జారకు అని, ఇది సమయం కాదని చెబుతూ ఉంటుంది. అభి మీ కొడుకుగా నాకు అడిగే హక్కు ఉంది అని అంటూ వుండగా, అడుగు అభి అని సామ్రాట్ అంటూ ఉంటాడు.ఏ అర్హత లేకపోయినా మా అమ్మ ను నమ్మి, ఇంత ఇన్వెస్ట్మెంట్ చెయ్యడానికి మీ ఉద్దేశం ఏంటి, ఎంతో ఎక్స్పీరియన్స్ వున్న నందగోపాల్ గారి ఐడియాస్ని పక్కకుపెట్టి, అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు సామ్రాట్ అర్హత లేదు అని నువ్వనుకుంటున్నావు, మీ అమ్మ ని తక్కువ అంచనా ఎందుకేస్తున్నావు, నీకు తనలో ఏదో సాధించాలి అనే తపన, నిజాయితీ కనిపించడం లేదా అని అంటాడు.సామ్రాట్ గారు ఇదంతా అమ్మకి దగ్గరవ్వడం కోసం చేస్తున్నాడు అని ప్రేమ్ తొ అంటూ ఉంటాడు.అప్పుడు అభి వాళ్ళ మామయ్య, ఇదంతా మీ నాన్నే నీ చేత ఉసిగొల్పి మాట్లాడిస్తున్నాడని తెలుస్తుంది.
ఈ వాతావరణాన్ని పాడు చేస్తున్నావు అని అంటూ,ఈ జన్మలో మీరు బాగుపడరు అని అంటూ ఉంటాడు. అప్పుడు నందు కోపంగా నీకు చాలా ఎక్కువైంది, అని మాట్లాడుతూ,వాడు ఏదో కడుపుమండి మాట్లాడితే, దానికి నాకు లింకు పెడతావేంటి అని అంటూ ఉంటాడు.వాళ్ళు ఇద్దరూ మాట్లాడుకోవడంతో, సామ్రాట్కి అర్థమౌతుంది. అంటే తులసిగారి మాజీ భర్త నువ్వా అని అడుగుతాడు నందుని, ఇదంతా నిజమా తులసి గారూ, అని తులసి వైపు చూస్తాడు. తులసి వాళ్ళ మామయ్య క్షమాపణ అడుగుతాడు సామ్రాట్ని, నా కొడుకు, మనవడు నా చేయి నుంచి జారిపోయారు. వాళ్లు చేసిన దానికి క్షమాపణ అని అడుగుతూ ఉంటాడు.తరువాత తులసి కూడా సామ్రాట్కి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతుంది.ఇంటికి వెళ్లాక అందరూ, అభి ని నిలదీస్తూ ఉంటారు తను చేసిన తప్పుకి.అభి, ప్రేమ్ ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు.అప్పుడు శ్రుతి, నేను సామ్రాట్ గారి దగ్గరికి వెళ్లి అడిగాను, ఏ ఉద్దేశ్యంతో మీరు సహాయం చేస్తున్నారని, కేవలం తులసిగారు బిజినెస్ పార్టనర్ మాత్రమే అని చెప్పారు అని అంటుంది.చెబితే మీరెలా నమ్ముతారు అని అభి నిలదీస్తూ ఉంటాడు. ప్రేమ్, అభి గొడవ పడుతూ ఉండగా, తులసి వచ్చి, ప్రేమ్ ని ఆపి, అభికి కూడా ఇంట్లో మాట్లాడే హక్కు ఉంది.
Intinti Gruhalakshmi 31 August Today Episode : గొడవలో నందు తులసి మాజీ భర్త అని తెలుసుకున్న సామ్రాట్

ఇక మీరు ఎవ్వరూ అభిని ఏమీ అనొద్దు అని చెబుతూ ఉంటుంది.ఒకవైపు నందు కోపంగా షెట్ విప్పుతూ ఉంటాడు.అప్పుడు లాస్య, నందూతో ఇప్పుడు ఆవేశపడి ఏమీ వస్తుంది. అంతా నాశనం అయ్యింది అని,మనల్ని జాబ్స్ నుంచి తీసేస్తాడు అని అనగానే, జాబ్ కోసం నేను అహం చంపుకొని సామ్రాట్ దగ్గర ఉండలేను, అని అంటాడు.ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.తులసి జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తులసి వాళ్ళ తమ్ముడు అక్కడికి వచ్చి క్షమించమని అడుగుతాడు.తప్పు నీది కాదురా నువ్వు రాకముందే పరిస్థితులన్నీ నీకు చెప్పాల్సింది అని అంటూ ఉంటుంది. అభి మాట్లాడింది తప్పు కాదా అక్క అని అనగానే, కాదు రా అది అభి అభిప్రాయం, కానీ ఆ సమయంలో అలా మాట్లాడతాడు అని నేను ఊహించలేదు అని అంటూ వుండగా, లాస్య,నందు అక్కడికి వస్తారు.లాస్య చప్పట్లు కొడుతూ, అదేంటి నందు నీకు చప్పట్లు కొట్టాలని అనిపించటం లేదా నీ మాజీ భార్య అంత బాగా యాక్ట్ చేస్తుంటే అని అంటూ ఉంటుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.