Intinti Gruhalakshmi 6 August Today Episode 704 : తులసి ని తన భర్త గురించి అడిగినా సామ్రాట్ బాబాయ్, తులసి సమాధానం చెబుతుందా?

Intinti Gruhalakshmi 6 August Today Episode 704 : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ 6-August-2022(704 episode) ఎపిసోడ్ ముందుగా మీ కోసం. తులసి పాటకి సామ్రాట్ మెచ్చుకుంటాడు, ఇంత బాగా పాడారు, ఇన్నిరోజులు ఇంతమంచి గొంతును ఎందుకు దాచిపెట్టారు అని అనగానే, తులసి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో తులసి, నందూతో ఏవండీ నేను మొన్న శ్రీరామనవమికి పాట పాడాను కదా, అది బాగుంది అని మ్యూజిక్ డైరెక్టర్, మామయ్యగారితో అన్నారంట, సినిమాలో పాడే అవకాశం ఇస్తా అన్నారు అంటా అని అనగానే, ఓకే అని చెప్పావా అని కోపంగా అంటాడు, అప్పుడు తులసి నేను మీకు చెప్పకుండా ఎలా ఓకే చేస్తాను అని అంటుంది. దాంతో నందు తిడతాడు, నేను సంపాదిస్తున్నాను కదా అని, అప్పుడు తులసీ తన కల అని అనగానే, ముగ్గురు పిల్లల తల్లివి వాళ్లని చూసుకో అని కోపంగా తిడతాడు, ఇది గుర్తుతెచ్చుకుంటుంది తులసి. అప్పుడు సామ్రాట్తో ఒకరకంగా మేమే దానికి కారణమని తులసి అత్తమామలు అంటూ ఉంటారు.

Advertisement

తులసి అత్త, కోడల్ని జైల్లో బందీగా చూశాను, అందరూ అత్తల్లాగే నేను ఆలోచించాను అని అంటుంది.అదేం లేదు మా అత్తగారు చాలామంది వాళ్లు అనగానే, ఇది తన గొప్పతనం అని, తులసి అత్త అంటోంది. ఇలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అoదరూ.దాంతో ఇవాళ పార్టీ ముహూర్తం బాలేనట్టుంది, ఏ టాపిక్ మొదలుపెట్టిన, ఎక్కడికో వెళుతుంది అని సామ్రాట్ అంటాడు.అప్పుడు సామ్రాట్ వాళ్ళ భాబాయ్, భర్త సపోర్ట్ ఉండాలి ఏ భార్యకైనా అని అనగానే, అవును అని లాస్య, నేను నందు చూడండి ఎంత బాగా సపోర్ట్ చేసుకుంటామో అని, మరీ తులసీ వాళ్ళ భర్త ప్రాబ్లమ్ ఏంటో అని అనగానే, అప్పుడు సామ్రాట్ వాళ్ల బాబాయ్, మనం అనడం కాదమ్మా తులసి చెబుతుంది అని, ఏమైంది అమ్మ నీ భర్త ఎందుకు వదిలేశాడు అని అంటాడు. దాంతో తులసి సామ్రాట్తో పార్టీకి పిలిచినందుకు థాంక్స్ అని, మేము వెళతాం అని వెళ్లిపోతారు, లాస్య వాళ్లు కూడా మేము వెళతామని వెళ్లిపోతారు అక్కడి నుంచి.అప్పుడు సామ్రాట్, వాళ్ల బాబాయ్ తో ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియక పోతే ఎలా బాబాయ్, అవన్నీ మనకెందుకు, ఇప్పుడు వాళ్లు వెళ్లిపోయారు అని అంటాడు.

Advertisement

Intinti Gruhalakshmi 6 August Today Episode 704 : తులసి ని తన భర్త గురించి అడిగినా సామ్రాట్ బాబాయ్, తులసి సమాధానం చెబుతుందా?

Intinti Gruhalakshmi 6 August Today Episode 704
Intinti Gruhalakshmi 6 August Today Episode 704

తర్వాత తులసి ఒంటరిగా కూర్చొని, అక్కడ జరిగిన విషయాలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ, బాధపడుతూ ఉండగా, ప్రేమ్ అక్కడికి వస్తాడు. ఆ పెద్దాయన అడిగిన ప్రశ్నకి ఆలోచిస్తున్నావా అమ్మా, ఏదో మామూలుగా అడిగాడు ఇంత సీరియస్గా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అనగానే , నేను ఆలోచిస్తున్నది ప్రశ్న గురించి కాదు, ఇన్నాళ్లయినా నాకింకా సమాధానం దొరకలేదు అని,చేయని తప్పుకి శిక్ష అనుభవించడం చాలా కష్టమని, ఒక జంట విడిపోతే భార్యని ఎప్పుడుా, దోషిగా ఎందుకు నిలబెడతారో అని ఇలా మాట్లాడుతూ ఉంటుంది తులసి.ఇంతలో తులసి మామ కూడా అక్కడికి వచ్చి తులసి చెప్పిన మాటల్ని వింటూ, ఇలా కొద్దిసేపు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు.తులసి నా గతం మళ్లీ నాకు ఎదురవుతుంది అని అంటూ ఉంటుంది. తులసి మామ ఒకసారి నీ మెడలో మంగళసూత్రం చూపించమ్మా అని అనగానే, తులసి చూపిస్తుంది, అప్పుడు తులసి మామా నీకు నువ్వే నీ గతాన్ని వదిలేయకుండా మెడలో వేసుకుని తిరుగుతున్నావు, ఎందుకమ్మా దైవాన్ని ప్రశ్నిస్తున్నావు అని అంటాడు.నువ్వు ఎందుకమ్మా గతాన్ని చూసి పారిపోతున్నావు, అలా పారిపోవాల్సింది నందు, నువ్వు కాదు అని తులసికి నచ్చచెపుతాడు.

అప్పుడు ప్రేమ్ అవునమ్మా తాతయ్య చెప్పింది నిజమే, ఒకప్పుడు నిన్ను ఎన్నో బాధలు పెట్టాడు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. ఇదే కదా అమ్మ నీ గెలుపు అని అంటూ, నువ్వు గెలవాలి అమ్మా అని అంటారు. తర్వాత నందు కోపంగా ఉంటాడు, జరిగింది గుర్తు తెచ్చుకుంటూ,అక్కడికి లక్కీ వచ్చి, అంకుల్ ఎనీ ప్రాబ్లమ్ అని,ఈ బొమ్మ ఎలావుంది అనగానే, నందు బాగుంది అంటాడు, అప్పుడు లక్కీ ఈ బొమ్మ ఎవరు కొన్నిచ్చారొ తెలుసా, సామ్రాట్ అంకుల్ అని అనగానే, నందు కోపంగా చుాస్తాడు. ఈ బొమ్మ చాలా కాస్ట్లీ, అయినా కొనిచ్చాడు అని లక్కీ అనగానే, నందు కోపంగా చూస్తూ ఉంటే, మీరు జలసిగా ఫీల్ అవుతున్నారా అంకుల్ అని అనగానే, బొమ్మ తీసుకొని కింద కొట్టబోయేసరికి, మమ్మీ అనగానే, లాస్య వచ్చే ఆపుతుంది.అప్పుడు లాస్య, సామ్రాట్ని ఎవరు పొగిడినా నువ్వు ఎందుకంత కోపంగా ఉంటున్నాను, తనకి అందం ఉంది, డబ్బు ఉంది, మంచితనం వుంది అనగానే, నాకు మంచితనం లేదా నేను అందంగా లేనా అని,నన్ను పొగడొచ్చు కదా అని అంటాడు. నాకు కాదు నీకు చీఫ్ దొబ్బింది,నీకు ఏదో అయ్యింది అని అనగానే, లాస్య అని కోపంగా అంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Advertisement