Actress Meena Second Marriage : సీనియర్ నటి మీనా తెలుసు కదా. కెరీర్ పరంగా తనకు ఎలాంటి డోకా లేదు. సీనియర్ నటి అయినప్పటికీ ఇప్పటికీ తనకు అవకాశాలు వస్తున్నాయి. కానీ.. తన వ్యక్తిగత జీవితం ఏం బాగోలేదు. ఇటీవలే తన భర్త చనిపోయాడు. దీంతో తను చాలా బాధలో ఉంది. అనారోగ్యంతో తన భర్తను కోల్పోయింది మీనా. అయితే.. తన భర్త చనిపోయి కొన్ని నెలలు కూడా కాలేదు అప్పుడే తను మరోసారి పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం మీనా వయసు 46 ఏళ్లు మాత్రమే. ఇప్పటి నుంచే తను ఒంటరిగా బతకడం ఎందుకు అని.. తనకు మళ్లీ పెళ్లి చేయాలని తన తల్లిదండ్రులు భావిస్తున్నారట. అందుకే తనకు తగ్గ వరుడిని వెతికారని వార్తలు వస్తున్నాయి. తమ బంధువుల్లోనే ఓ వ్యక్తిని సెట్ చేశారట. అతడికి మీనా కూడా ఓకే చెప్పిందని సమాచారం.
Actress Meena Second Marriage : అసత్య వార్తలు రాసేవాళ్లపై చర్యలు తీసుకుంటా
నిజానికి.. ఆమె రెండో పెళ్లిపై వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. ఎందుకంటే.. ఆమె కుటుంబ సభ్యుల నుంచి కానీ.. ఆమె నుంచి కానీ.. మీనా రెండో పెళ్లి విషయంపై అధికారిక ప్రకటన లేదు. అయితే.. సోషల్ మీడియాలో తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై మాత్రం మీనా స్పందించింది. డబ్బు, పాపులారిటీ కోసం ఏదైనా చేస్తారా? అసలు సోషల్ మీడియా రోజురోజుకూ ఇంతలా దిగజారిపోతోంది ఏంటి.. నిజాలు తెలుసుకొని రాయండి. నా భర్త చనిపోయినప్పుడు కూడా ఇలాగే సామాజిక మాధ్యమాల్లో అసత్యపు ప్రచారాలు చేశారు. అలాంటి వాళ్లపై చర్యలు తీసుకుంటాం అని మీనా ఇలాంటి పుకార్లు పుట్టించే వాళ్లకు గట్టి వార్నింగే ఇచ్చిందని అంటున్నారు.