మైత్రి మూవీస్ సంస్థపై ఐటీ రైడ్స్

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థపై ఐటీ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థతోపాటు టాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. నిర్మాణ సంస్థ డైరక్టర్లు అయిన రవిశంకర్ , నవీన్ లకు చెందిన నివాసాలలో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఐటీ అధికారులు సోదాల్లో పలు డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రీ మూవీస్ సంస్థ ఇటీవల వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తోంది. దీంతో ఈ సినిమా నిర్మాణాల కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది..?ఎలా పెట్టుబడులు పెడుతున్నారని రవిశంకర్ , నవీన్ లను ఐటీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

Advertisement

హీరో, హీరోయిన్లకు ఇచ్చే పారితోషకంతోపాటు లాభాల గురించి ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు కనబడుతోంది. గత ఏడాది కూడా మైత్రి మూవీస్ మేకర్స్ సంస్థపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ తరువాత ఇదంతా రెగ్యులర్ చెకప్ లో భాగంగానే జరిగిందని చెప్పారు. ఈసారి కూడా రెగ్యులర్ చెకప్ లో భాగంగానే సోదాలు జరుగుతున్నాయా..? లేక పన్ను ఎగవేత కారణమా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement