Jabardasth varsha : బుల్లితెరలో నెంబర్ వన్ కామెడీ షో గా వెలుగుతుంది జబర్దస్త్. ఎన్నో ఏళ్లుగా ప్రసారమవుతున్న ఈ షో ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. దీని ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. దాని ద్వారా బిగ్ సెలబ్రిటీలు గా మారిపోయారు. అందులో ఒకరే వర్ష. బుల్లితెర పైకి ఎప్పుడో వచ్చిన ఈ భామ ఇప్పుడు జబర్దస్త్ లోకి రావడం వలన ఎంతో ఫేమస్ అయిపోయింది. అలాగే సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తుంటుంది వర్ష. ఈ క్రమంలో తాజాగా వర్ష ఇంస్టాగ్రామ్ లో చేసిన స్టోరీ వైరల్ అవుతుంది. నటిగా మారటానికి వర్ష ముందు మోడలింగ్ చేసింది. ఆ తర్వాత బుల్లితెర పైకి అడుగు పెట్టింది ఈ క్రమంలోనే అభిషేకం, తూర్పు పడమర, ప్రేమ ఎంత మధురం వంటి సీరియల్ లో నటించింది. వీటి ద్వారా వర్ష తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.
అయితే జబర్దస్త్ షోలోకి వర్ష ఓ స్కిట్లో గెస్ట్ గా వచ్చి నటించింది. మొదటి స్కిట్ లోనే ఆమె అందరి దృష్టిని ఆకర్షించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. దీంతో ఆమెకు వరుసగా స్కిట్లు చేసే అవకాశం వచ్చింది. దీంతో జబర్దస్త్ లోనే వర్ష పర్మినెంట్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. దీంతో జబర్దస్త్ స్పెషల్ ఈవెంట్లతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోను భాగమైంది. జబర్దస్త్ లో కమెడియన్ గా సందడి చేస్తున్న ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్ వల్ల జబర్దస్త్ వర్ష మరింత పాపులర్ అయింది. ఇక తరచూ అతనితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హైలెట్ అయింది. కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికి పెళ్లి జరిగినట్లు ఓ ఈవెంట్లో చూపించడంతో అతడికి జంటగా మారింది.
Jabardasth varsha : పలు అనుమానాలకు దారి తీసిన జబర్దస్త్ వర్ష ఇంస్టాగ్రామ్ స్టోరీ…

వర్ష టీవీ షోలు చేస్తూనే మరోవైపు సీరియల్ చేస్తూ బిజీగా గడుపుతుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అందులో భాగంగా నిత్యం తనకు తన కెరీర్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అదే సమయంలో ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఇలా తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది. అయితే తాజాగా వర్ష తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఎవరికి చెప్పాలి నా బాధ అంటూ స్టోరీ ని పెట్టుకుంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. వరుసగా ఆఫర్లు అందుకుంటున్న వర్ష ఇంస్టాగ్రామ్ లో ఇలాంటి పోస్ట్ చేసిందేంటని అనుకుంటున్నారు. దీంతో ఆమెకు అసలు ఏం బాధ వచ్చింది, ఏదైనా సమస్య వచ్చిందా జబర్దస్త్ లో వర్షాకు విబేధాలు వచ్చాయా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీని ద్వారా ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది.