Jr NTR : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రీమియర్ షో టాక్ నుంచి లైగర్ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చేసింది. సినిమా ఏ మాత్రం అంచనాలు అందుకోలేదని, కనీసం యావరేజ్ గా కూడా లేదని, విజయ్ దేవరకొండ కెరీర్ లో ఉన్న చెత్త సినిమా అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాకి వచ్చిన టాక్ ను బట్టి చూస్తే బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలు మిగిలిస్తుందని క్లారిటీ వచ్చేసింది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా కథను ఎన్టీఆర్ కు చెప్పారట.
2015 లో ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ‘ టెంపర్ ‘ సినిమా వచ్చింది. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ కు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. అలాగే పూరీకి కూడా క్రేజ్ పెరిగింది. దీంతో వెంటనే మరోసారి ఎన్టీఆర్ తో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు పూరి. లైగర్ కథను 2016లో ఎన్టీఆర్ కు చెప్పాడట. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాలని పూరి ప్లాన్ చేసుకున్నాడు. బాక్సర్ అన్న టైటిల్ కూడా రిజిస్టర్ చేయించాడట. అయితే అప్పటికే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బ్యానర్ లో బాబి డైరెక్టర్ గా ‘ జై లవకుశ ‘ సినిమా చేయాలని అనుకున్నాడు. దీంతో లైగర్ సినిమా కథను రిజెక్ట్ చేశాడు. ఒకవేళ ఎన్టీఆర్ లైగర్ సినిమా చేసి ఉంటే ఎన్టీఆర్ ఖాతాలో మరో పెద్ద డిజాస్టర్ సినిమా వచ్చి ఉండేది.
Jr NTR : లైగర్ సినిమా ఫ్లాఫ్ అవుతుందని ఎన్టీఆర్ కు ముందే తెలుసా…

ఎన్టీఆర్ పూరితో ‘ టెంపర్ ‘ సినిమా చేయకముందే 2004లో పూరి తో ‘ ఆంధ్రావాలా ‘ సినిమా చేశాడు. ఆ సినిమా ఎంత ఫ్లాప్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ తనకు బాక్సర్ క్యారెక్టర్ సెట్ అవ్వదు అన్న ఉద్దేశంతో ఆ సినిమాను వదులుకున్నాడు. ఒకవేళ లైగర్ సినిమాను ఎన్టీఆర్ చేసి ఉంటే అప్పుడే టెంపర్ హిట్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన ఎన్టీఆర్ కు వెంటనే మరో ప్లాప్ సినిమా రావడంతో పాటు ఎన్టీఆర్ కెరీర్ కు బ్రేక్ పడేదని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఎన్టీఆర్ ‘ లైగర్ ‘ సినిమా విషయంలో ఆరు సంవత్సరాల క్రితమే కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడని తెలుస్తుంది.