Jr NTR : ఎటువంటి పాత్రలో ఏమైనా ఒదిగిపోగల సత్తా ఉన్న ఒకే ఒక్క నటుడు జూనియర్ ఎన్టీఆర్ అనడంలో అతిశయోక్తి లేదు. జూనియర్ ఎన్టీఆర్ తన నైట్ నటన నైపుణ్యంతో తనకిచ్చిన ఎటువంటి పాత్రలోనైనా జీవించగల సత్తా ఉన్న అద్భుత నటుడు. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. దానికి నిదర్శనం ఇప్పటివరకు ఆయన చేసిన పాత్రలన్నీ అని చెప్పవచ్చు. ఏ సినిమాలో ఎన్టీఆర్ ను చూసిన కథకు తగ్గట్టుగా ఒదిగిపోయే తన ప్రతిభకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.
అయితే లేటెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో చెక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ ఈసారి తన సత్తాను చాటే ఎందుకు అనేక ప్రాజెక్టులు చేయబోతున్నట్లుగా సమాచారం. బుచ్చిబాబు సానా తో ఓ ప్రాజెక్టు ఒప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. ఈ న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ బుచ్చిబాబుతో చేయబోయే సినిమాలో ఒక పాత్రకు సంబంధించి న్యూస్ వైరల్ అవుతూ ఉంది.
Jr NTR : బుచ్చిబాబు డైరెక్షన్ లో ఓ సాలిడ్ పాత్రలో కనిపించబోతున్న ఎన్టీఆర్….

ఈ న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టులో డీఎల్ రోల్లో కనిపించబోతున్నట్లుగా వినికిడి. అంతేకాకుండా ఒక పాత్రలో 60 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిగా కనిపించబోతుండగా తన కెరియర్ లో 60 ఏళ్ల వయసుకుడి పాత్రలు చేయడం ఇదే మొదటిసారి. ఇంతవరకు ఎన్టీఆర్ ని మనం అనేక పాత్రలలో చూడగా ఇప్పుడు ఈ పాత్రలో కనిపించడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎగ్జిటడ్ గా మారింది. ఈ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఈ పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ వార్తలో నిజం ఎంత ఉందనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే.