Kajal Agarwal : సినిమా ఇండస్ట్రీలో కాజల్ టాప్ హీరోయిన్లలో ఒకరుగా దూసుకెళుతోంది. ఈ అమ్మడు తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన ‘ లక్ష్మి కళ్యాణం ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో పల్లెటూరి అమ్మాయి లాగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా హిట్ కావడంతో తర్వాత ‘ చందమామ ‘ సినిమాలో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా హిట్ కావడంతో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపింది. ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి కారణంగా చాలా సినిమాలను కాజల్ మిస్సయింది. ఇప్పటికీ కాజల్ గ్లామర్ ఏమాత్రం తగ్గినట్టుగా లేదు.
Kajal Agarwal : తెగ బాధ పడిపోతున్న కాజల్…
మెగాస్టార్ చిరంజీవికి జోడిగా ఆయన రీ ఎంట్రీ సినిమా ‘ ఖైదీ నెంబర్ 150 ‘ లో నటించింది. ఆ తర్వాత ‘ ఆచార్య ‘లో మరోసారి ఆమెకు అవకాశం ఇచ్చిన కరోనా కారణంగా సినిమా ఆలస్యం అవ్వడం, ఇదే టైంలో ఆమె పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అవ్వడంతో ఆ ఛాన్స్ మిస్ అయింది. అలాగే నాగార్జున ‘ ది ఘోస్ట్ ‘ సినిమాలో ముందు ఆమెనే హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె పెళ్ళికి ఓకే చేయడంతో ఆ ఛాన్స్ సోనాల్ చౌహాన్ కు వచ్చింది. అలాగే నటసింహం బాలయ్య తో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ మిస్సయింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘ అఖండ ‘2 సినిమాలో ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకు జోడిగా నటించింది. అయితే ఈ సినిమాలో ముందుగా కాజల్ ను తీసుకున్నారు.

బోయపాటి వెళ్లి కాజల్ కు కథ కూడా చెప్పారు. అయితే కాజల్ అప్పుడు కొన్ని కమిట్ మెంట్లతో బిజీగా ఉండడంతో బాలయ్య అఖండను రిజెక్ట్ చేసింది. అలా బాలయ్య కాజల్ కాంబినేషన్ లో రావాల్సిన సినిమా మిస్సయింది. అయితే ఈ మంచి సినిమా మిస్ అయిపోయానని కాజల్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటుందంట. ఈ ఏజ్ లో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి ఉంటే చివరి దశలో కాజల్ కెరీర్ మరి కొంతకాలం పొడుగు ఉంటుంది. మరిన్ని అవకాశాలు వచ్చేటివి.