Karthika Deepam 01 October Today Episode : దీప ,దుర్గా వేసిన ప్లాన్ కి అల్లాడిపోతున్న మౌనిత… దీపక్ తన బాధని చెప్పుకుంటున్న కార్తీక్…

Karthika Deepam 01 October Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1472 హైలెట్స్ అంటే ఇప్పుడు మనం చూద్దాం… దుర్గ నేను హోటల్లో ఉంటాను వెళ్ళిపోతూ ఉండగా.. కార్తీక్ తనను ఆపి మౌనిత కోపం మీకు తెలుసు కదా.. కొద్దిసేపే ఉంటుంది మీరు ఇక్కడే ఉండండి.. మీ బిజినెస్ పనులు అయ్యేవరకు ఇక్కడే ఉండండి అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక మౌనిత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఇక అప్పుడు అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇక దీప మౌనిత దగ్గరికి వెళ్లి ఈ గెస్ట్ ని ఈ ట్విస్ట్ ని నువ్వు ఊహించలేదు కదా… అప్పుడు మౌనిత నాకు తెలిసే నువ్వే తీసుకొచ్చావు అని అని అంటుండగా… అప్పుడు దీప నీ స్నేహితుడిని నీ దగ్గరి ఇతడిని నేనెందుకు తీసుకొస్తాను.. నువ్వే పిలిపించి నాటకాలు ఆడుతున్నావేమో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మౌనిత ఆగ్రహంతో మండిపోతూ ఉంటుంది. సౌందర్య హిమ సార్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

Advertisement

Karthika Deepam 01 October Today Episode : దీప ,దుర్గా వేసిన ప్లాన్ కి అల్లాడిపోతున్న మౌనిత…

ఇక అంతలో సౌందర్య మనం ఒక తప్పు చేశాం కదా ఆనందం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక గంట ముందు వెళ్లి ఉంటే మనమే తెచ్చుకునే వాళ్ళం అని అంటుండగా.. లేదు నాయనమ్మ మనం కరెక్టే చేశాం.. మేము ఇప్పుడు అమ్మ నాన్న లేకుండా ఇబ్బంది పడుతున్నాం.. వారిని కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం మనం చేసింది కరెక్ట్. అంటుంది హిమ.కట్ చేస్తే దుర్గ దీపతో ఇక దానికి భయం మొదలైంది దానికి ఇక దానికి చిరాకు తెప్పిస్తాను ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తాను. అని అంటూ ఉంటాడు. అది మామూలుది కాదు మనం ఏం చేసినా అది కొత్త ప్లాన్ వేస్తూనే ఉంటది అని దుర్గకి ఒక గట్టి ప్లాన్ చెప్తుంది. అప్పుడు దుర్గ సూపర్ దీపమ్మ ఇక నేను రంగంలో దిగుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మౌనిత, దుర్గ గురించి భయపడుతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి దుర్గ గురించి అడుగుతూ ఉండగా.. దుర్గ ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు కార్తీక్ మౌనిత ని మీ ఫ్రెండ్ వచ్చాడు కదా.. ఏదైనా స్పెషల్గా చేసుకుని రా పో అని చెప్తూ ఉంటాడు. అమ్మో నేను హోటల్లో తింటాను అని అంటాడు దుర్గ. అప్పుడు కార్తీక్ ఎందుకు ఇప్పుడు మౌనిత ఏం అనలేదు కదా అని అంటుండగా…

Advertisement
Karthika Deepam 01 October Today Episode
Karthika Deepam 01 October Today Episode

ఒక సంవత్సరం పాటు వండి పెట్టింది సార్ నాకు ఉడికిన ఆడకపోయినా కారం ఎక్కువైనా ఎలాగైనా భరించే తినేవాడ్ని.. అంతలో మౌనిత కోప్పడుతూ ఉంటుంది. ఇక దుర్గ ఈ కోపం చూడలేక చచ్చినట్టు తినే వాడ్ని మీరు ఇన్ని సంవత్సరాలు బరిస్తున్నారు మీరు దేవుడు సార్ అని కార్తీక్ ని పొగుడుతూ ఉంటాడు. ఇక అంతలో దీపోవచ్చి డాక్టర్ బాబు మీకోసం భోజనం తీసుకొచ్చాను డాక్టర్ అమ్మ వాళ్ళ సార్ తీసుకు రమ్మన్నాడు అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీక్ దీపకి మౌనిత సంవత్సరం పాటు వండి పెట్టిందంట తినలేక చచ్చిపోయాడంట అని చెప్తూ ఉండగా.. అప్పుడు మౌనిత ఇదంతా అబద్ధం కార్తీక్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడు దుర్గ నువ్వు అబద్దం అంటే.. మన మధ్య జరిగిన అన్ని నిజమని చెప్పడానికి గతం గురించి చెప్పాలి అని.. కార్తీక్ అనుమానం వచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు. సరేలే ఇక ఇవన్నీ ఎందుకులే భోజనం చేద్దాం రండి అని చెప్తూ ఉంటాడు. కార్తికి కొద్దికొద్దిగా అనుమానం వస్తూ ఉంటుంది. ఇక అలా తినడానికి అందరూ వెళ్తారు కానీ మౌనిత దీపని లాక్కొని వచ్చి ఏం చేస్తున్నావే నువ్వు అని అంటుంది. అప్పుడు దీప దుర్గ గురించి నన్ను అడుగుతావేంటి నీకు తెలిసినంతగా నాకేం తెలుసు అని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది.

అప్పుడు మౌనిత ఇలాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా నన్ను కార్తీక్ని వేరు చేయలేరు అని మొండిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు దీప మర్యాదగా డాక్టర్ బాబుకి గతం గుర్తు రాకుండా ఉండడానికి ఏం మందులు వాడుతున్నావు చెప్పు అని అడుగుతుంది. అప్పుడు మౌనిత నువ్వు అంత సింపుల్ గా అడగగానే ఎలా చెప్తాను అనుకున్నావే అని అంటుంది. అప్పుడు ఇక నీచేత నిజం చెప్పించే టైం వస్తుంది చేపిస్తా అని అంటుండగా.. కార్తీక్ వచ్చి ఏం నిజం వంటలక్క అని అంటుంటాడు. అప్పుడు మౌనిత కంగారుపడుతూ ఏం లేదు కార్తీక్ అని తన లోపలికి తీసుకెళ్తూ ఉండగా… ఆగు మౌనిత చెప్పనివ్వు అని దీప చెప్పు అని అంటాడు.అప్పుడు దీప తన ఫ్రెండ్ వచ్చిన దగ్గరనుంచి కంగారుపడుతుంది. ఎందుకు అని అడుగుతున్నాను అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ కూడా మౌనిత అని ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు అసలు నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని అంటాడు. అప్పుడు ఏదో ఒకటి కవర్ చేసి ఏమీ లేదు అని కార్తీక్ ని లోపలికి తీసుకెళ్తుంది. ఇక దీప నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంతలో దుర్గ, దీప ఇంటికి వచ్చి కూర్చుంటాడు.

అప్పుడు దీప నువ్వు ఇక్కడున్నావేంటి దుర్గా దానికి కొంచెం కూడా గ్యాప్ లేకుండా చిరాకు తెప్పించాలి. దానికి చుక్కలు చూపించాలి. అని చెప్తూ ఉంటుంది. నా మీద ఎలా ముద్ర వేసిందో అదే ముద్ర దాని మీద పడేలా చెయ్ దుర్గ అని అంటుంది. సరే అదంతా నేను చూసుకుంటా అని అక్కడినుంచి దుర్గా వెళ్ళిపోతాడు. ఇక కట్ చేస్తే మౌనిత దగ్గరికి దుర్గా వస్తాడు. అప్పుడు మౌనిత ఇక్కడినుంచి తొందరగా వెళ్ళిపో లేకపోతే అని తనపై చేయి లేపుతుండగా దుర్గ తన చేయి పట్టుకొని నువ్వేం చేయలేవు బంగారం అని చేతిని నలుముతు, కార్తీక్ చూసేలా అనుమానం వచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటాడు దుర్గ. ఇక కార్తీక్ ని చూసి ఏం లేదు సార్ మౌనితకి నామీద కోపం ఇంకా పోలేదు అందుకే ఇలా అంటూ డ్రామాలాడుతూ ఉంటాడు దుర్గ. అప్పుడు కార్తీక్ కి చెప్పాలని మౌనిత ట్రై చేస్తూ ఉంటే శివ ఎక్కడ అని అడుగుతాడు. అప్పుడు మౌనిత శివ బయటికి వెళ్లాడు కార్తిక్ అని చెప్పగానే.. వాన్ని కూడా బయటికి పంపించావా అని అనుమానంగా అంటూ.. వంటలక్క దగ్గరికి వచ్చి కూర్చుని నా మనసు ఏం బాగాలేదు వంటలక్క అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది డాక్టర్ బాబు అని దీప అడుగుతూ ఉంటుంది. కార్తీక్ నువ్వు ఏమనుకోవు కదా అని చెప్పబోతుండగా శివ అక్కడికి వచ్చి సార్ నన్ను మీరు అడిగారంట కదా.. అని అంటుండగా అప్పుడేదో అడిగాను లే ఇప్పుడు ఆ పని ఏం లేదు వెళ్ళు అని చెప్తూ ఉండగా.. శివ మిమ్మల్ని మేడం ఒక రెండు గంటలు బయటికి తీసుకెళ్లి తిప్పుకొని రమ్మన్నారు అని అంటూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…

Advertisement