Karthika Deepam 13 September Today Episode : మోనితపై మండిపడుతున్న కార్తీక్… మోనిత డ్రామాని బయటపెట్టిస్తున్న డాక్టర్…

Karthika Deepam 13 September Today Episode : బుల్లి తెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తిక దీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1456 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత ఇంట్లో పూజ కంప్లీట్ అవ్వడంతో డాక్టర్ బాబు అని చెప్పి వెళ్తుంది. కార్తీక్ హమ్మయ్య పూజ మంచిగా అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత మోనీత అసలు నువ్వు దాని ఇంటికి ఎప్పుడెల్లావ్ కార్తీక్ అని కోప్పడుతుంది. అప్పుడు రాత్రి వెళ్ళాను అక్కడ దీపనీ చూడగానే నాకు ఏదో గుర్తుకొచ్చింది. కొద్దిసేపు ఆలోచించాను. తర్వాత దీప ని పూజకి రమ్మన్నాను అప్పుడు దీప నేను అక్కడికి రావాలంటే నేను ఒకటి చెప్తాను అది చేయాలి. అని ఒక పేపర్ మీద పూజలో నేను ఒక్కడినే నేను పూజ మాత్రం చేయాలి అని రాసుకొని పూజకి నువ్వు తప్పకుండా వస్తావు అని అని చెప్పేసి వచ్చాను అది జరిగింది మౌనిత అని అంటాడు. అప్పుడు అసలు నిన్ను అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు అని కోప్పడుతూ ఉంటుంది మౌనిత. అది మనల్ని విడదీయాలని చూస్తుంది అని అంటుంది. అప్పుడు కార్తీక్ మనల్ని విడదీయాలి. అనుకునే ఆవిడ అయితే మన సంతోషంగా ఉండాలి అని ఎందుకు పూజ చేయమని చెప్తుంది. ఆవిడ నాకు హెల్ప్ చేసింది. అందుకే నేను ఆవిడ చెప్పింది చేశాను.

Advertisement

Karthika Deepam 13 September Today Episode : మోనితపై మండిపడుతున్న కార్తీక్…

ఎందుకు నువ్వు ఎదుటి వాళ్ళ మీద చిరాకు పడతావు నాకు అర్థం కాదు. అని కార్తీక్ అంటాడు. చాలు కార్తీక్ అని మండిపడుతుంది. అప్పుడు కార్తీక్ రివర్స్లో అక్కడున్న పూల ప్లేటుని ఎత్తేసి వెళ్ళిపోతాడు. అప్పుడు మౌనిత భయపడుతూ ఉంటుంది. కట్ చేస్తే సౌందర్య వాళ్ళ ఇంట్లో గణపతి పూజ చేసుకుంటూ ఉంటారు. సౌర్యని బాగా చదివించాలన్నది అమ్మానాన్నల కోరిక. కానీ నేను చదువుకుంటున్నాను సౌర్య చదువుకోవడం లేదు. నువ్వు ఎలాగైనా సౌర్యని తీసుకురా నాయనమ్మ అని బాధపడుతూ ఉంటుంది హిమ. నాలుగు బాధి తీసుకొద్దాం అంటే అది చిన్నపిల్ల కాదు మళ్లీ ఎక్కడికైనా పోతే మనకి కనపడకుండా పోతుందేమో నాన్న భయం. వారణాసిని నేను పంపించానమ్మా చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను అని ఆనందరావు అంటాడు. శౌర్య ఆలోచనలోంచి బయటికి రాలేకపోతుంది అందుకే మన దగ్గరికి రాలేకపోతుంది అని సౌందర్యం అంటుంది. కట్ చేస్తే దీప డాక్టర్ కి టీ తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు డాక్టర్ మౌనితతో కలిసి పూజ చేయకుండా చేశావు సంతోషమే కదా..

Advertisement
Karthika Deepam 13 September Today Episode
Karthika Deepam 13 September Today Episode

కానీ అప్పుడు దీప నేను అలా చేసినందుకు సంతోష్ పడాల నాతో పిల్లలతో కూర్చొని పూజ చేసుకుని లేనందుకు బాధపడాలా అర్థం కావడం లేదు కానీ అంటుంది. నీ మాటకి కట్టుబడి పూజలో ఒక్కడే కూర్చున్నాడు అంటే నువ్వు తన మనసులో ఉన్నామని అర్థం. అప్పుడు డాక్టర్ నీ డాక్టర్ బాబుని నాకు చూపించవా అని అడుగుతాడు. ఎందుకు చూపించను అన్నయ్య చూపిస్తాను. అప్పుడు డాక్టర్ ఆ మౌనితను కూడా చూడాలమ్మ అని అంటాడు. అప్పుడు వినాయక చవితి రోజు చంద్రుని చూసినట్టుగా దాని మొహం ఎందుకు అన్నయ్య చూడ్డం అని అంటుంది. అప్పుడు డాక్టర్ పూజ చేసినట్టు మీద అక్షంతలు వేసుకున్నాం కదా.. ఏం కాదులే అని అంటాడు. కట్ చేస్తే మౌనిత కార్తీక్ గురించి ఆలోచిస్తూ నా మీద ఎందుకు మండిపడుతున్నాడు. అనుకుంటూ డ్రామా ప్లే చేసి తనని బుట్టలో పడేయాలని చూస్తూ ఉంటుంది. ఆరోగ్యం బాగా లేనట్టుగా డ్రామాలాడుతూ ఉంటుంది. ఇంత సడన్గా జ్వరం ఎందుకు వచ్చింది మౌనిత నేను నిన్ను ఇందాకల తిట్టాను కదా అందుకే వచ్చింది అనుకుంటా. నన్ను ఎందుకు చిరాకు పెట్టిస్తావు.. డాక్టర్ను తీసుకొని వస్తాను వెళ్తుండగా…

ఇక అప్పుడు డ్రామాలు మొదలుపెట్టి కార్తీక్ ని తన మాయలో పడేయాలని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ కోప్పడినంత మాత్రాన నీ మీద ప్రేమ లేదని కాదు అని కార్తీక్ అంటూ డాక్టర్ తీసుకొస్తాను వెళ్తాడు. ఇక మౌనిత సంతోషపడుతూ డాక్టర్ని తీసుకొస్తే ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ డాక్టర్ కోసం వెళుతూ ఉండగా దీప, డాక్టర్ వస్తారు. అప్పుడు డాక్టర్ బాబు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అప్పుడు కార్తీక్ మోనితకి జ్వరంగా ఉంది డాక్టర్ కోసం వెళ్తున్నాను అనగానే.. అప్పుడు దీప ఇదిగో మా అన్నయ్య డాక్టరే తనను తీసుకెళ్లండి అని చెప్తుంది. అప్పుడు కార్తీక్, డాక్టర్ ని తీసుకొని వస్తాడు. దీప డాక్టర్ కి దాని ఆటలు కట్టించు అన్నయ్య అని చెప్తుంది. సరే అమ్మని వెళ్తాడు. ఇక మౌనిత డాక్టర్ ఇస్తే తన గ్రామ బయట పడుతుందని శివకు ఫోన్ చేసి డాక్టర్ వద్దు అని చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ తనని చెక్ చేస్తూ ఉండగా వద్దులే కార్తీక్ ఎందుకు నా కోసం ఇంత శ్రమపడి తీసుకొచ్చావు అని మౌనిత అంటూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ అవును మీరు కూడా డాక్టర్ గా అని అంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో తనని చెక్ చేసి మందులు రాసిస్తాను తీసుకురండి అని చెప్పి చిట్టి మీద మందులు రాసి ఇవ్వగానే మౌనిత అది చూసి డాక్టర్ కాలర్ పట్టుకుని ఎవడ్రా నువ్వు ఆ వంటలక్క పంపించిందా అంటూ దీప వైపు చూస్తుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే..

Advertisement