Karthik Deepam : హాస్పటల్లో కోమాలో నుంచి బయటికి వచ్చిన కార్తీక్, దీపలు..

Karthik Deepam : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. 1431 ఎపిసోడ్ హైలెట్స్ ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం… శౌర్య, హిమ, ఆనంద్ రావు, సౌందర్య కలిసి గుడికి వెళుతూ ఉంటారు. అప్పుడు సౌర్య, హిమ పక్కపక్కనే కూర్చుని ఉంటారు. అలా కూర్చోవడం సౌర్యకు ఇష్టం ఉండదు. అప్పుడు సౌర్య నేను ఆటోల వస్తాను అని కారు దిగబోతోంది. అప్పుడు సౌందర్య కారు దిగితే కాళ్ళు ఇరుగుతాయి. అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు సౌర్య చచ్చినట్టు కూర్చుంటుంది. ఒకరి మీద ఒకరు పడుతూ గుడికి వెళ్తారు. కట్ చేస్తే నిరుపం, హిమ, సౌర్య గురించి తన ప్రేమను త్యాగం చేయాలని చూస్తుంది. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి అని ఏదో ప్లాన్ వేస్తుంది అని అనుకుంటూ ఉండగా..అక్కడికి ప్రేమ్ వస్తాడు.

Advertisement

ఇదంతా ప్రేమ్ కి చెప్తాడు. అప్పుడు ప్రేమ్ తన మనసులో హిమని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ పెళ్లి మేమిద్దరం కలిసి ఆపాలి అనుకుంటున్నాం ఈ సంగతి నీకు తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటో అని తన మనసులో అనుకుంటాడు. అప్పుడు నిరూపం నేను మాట్లాడుతుంటే నువ్వు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వవేంటి రా అని అడుగుతాడు. నాకు ఈ పెళ్లి ఆగకుండా ఏదైనా ప్లాన్ చెప్పు ప్రేమ్ అని అడుగుతాడు. అప్పుడు నేను ఈ పెళ్లి ఆపాలని చూస్తుంటే.. నువ్వు ఈ పెళ్లి ఆగకుండా నన్ను ప్లాన్ అడుగుతావా అని మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే గుడిలో హిమ దేవుడిని శౌర్య నిర్పం భావలపెళ్లి జరిగేలా చెయ్యి దేవుడా అని కోరుకుంటుంది. ఇంకొకపక్క సౌర్య నేను కోరుకునే అన్ని నాకు దూరం చేస్తున్నావు ఎందుకు దేవుడా…

Advertisement

Karthik Deepam : హాస్పటల్లో కోమాలో నుంచి బయటికి వచ్చిన కార్తీక్, దీపలు..

Karthika Deepam 14 August 2022 Episode
Karthika Deepam 14 August 2022 Episode

అని బాధపడుతూ మా అమ్మ ,నాన్న బ్రతికుండేలా చెయ్ నాకు వాళ్లు మళ్లీ కనబడేలా చెయ్ దేవుడా అని బాధపడుతూ దేవుని కోరుకుంటుంది. కట్ చేస్తే హాస్పిటల్ లో దీప కోమాలో నుంచి బయటికి వస్తుంది. తన యాక్సిడెంట్ను గుర్తు చేసుకుంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడి డాక్టర్ బాబు అని లేస్తుంది. అప్పుడు అక్కడికి డాక్టర్స్ వస్తారు. వచ్చి దీప గారు మీరు ఇన్ని సంవత్సరాలు తర్వాత కోమలో నుంచి బయటికి వచ్చారు అని చెప్తారు. మరి డాక్టర్ బాబు ఏడి అని అడుగుతుంది దీప.. నా పిల్లలు ఏరి అని అంటుంది. అప్పుడు డాక్టర్స్ మీరు కంగారు పడకండి.. నెమ్మదిగా, నిదానంగా మాట్లాడండి గట్టిగా అరవకండి దిగకండి అని డాక్టర్స్ తనకి చెప్తారు. తను ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Advertisement