Karthika Deepam 15 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 1431 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. నిరుపం, ప్రేమ్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే స్వప్న, సత్యం ఈ పెళ్లి జరుగుతున్నందుకు సంతోష పడిపోతూ ఉంటారు. అలాగే ఒకపక్క ప్రేమ్ గురించి బాధపడుతూ ఉంటారు వాడు ఎందుకు కంగారు పడుతున్నాడు.. ఏంటో చెప్పట్లేదు తనలో తాను బాధపడుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అంతలో అక్కడికి ప్రేమ్ వస్తాడు. అప్పుడు సత్యం అసలేమైంది నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు ప్రేమ్ తన సమస్య ఏంటో చెప్పాలి అని అనుకుంటాడు.
అప్పుడు స్వప్న ఇప్పుడు వద్దు పెళ్లి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు గుడికి వెళ్దాం పదండి అని సత్యాన్ని తీసుకొని వెళ్తుంది. గుడిలో సౌర్య అమ్మానాన్నలు బ్రతికుంటే మళ్లీ నాకు కనపడేలా చెయ్ దేవుడా అని కోరుకుంటుంది. హిమ బావ తో సౌర్య పెళ్లి జరిగేలా చెయ్ దేవుడా అని కోరుకుంటుంది. సౌందర్య నా మనవరాలు ఇద్దరు మంచిగా కలిసిపోయే కలిసిపోయేలా దేవుడా అని కోరుకుంటుంది. ఆనందరావు మళ్లీ నా ఇంట్లో సంతోషాలు ఎప్పటిలాగా ఉండేలా చెయ్ దేవుడా అని కోరుకుంటాడు. అయ్యగారు మీరు వచ్చిన వేళా విశేషం చాలా మంచిది అని చెప్తాడు. అప్పుడు హిమ ఈ శుభ సందర్భంలోనే సౌర్యకు అంత చెప్పేయాలి అని నీతో మాట్లాడాలి శౌర్య అని అంటుంది. అప్పుడు సౌర్య నువ్వు నాతో మాట్లాడేది ఏంటి అని అంటుంది.
Karthika Deepam 15 August 2022 Episode : కార్తీక్, దీపలు బ్రతికే ఉన్నారు అని చెప్పిన వారణాసి…

హిమ బ్రతిమిలాడుతుంది. సరే పద అని తనని తీసుకొని ఒక పక్కకి వస్తుంది. అప్పుడు హిమ, సౌర్యతో అమ్మానాన్నలు చనిపోయే ముందు నిన్ను బాగా చూసుకోమని సౌర్యకు అన్ని నువ్వే అని చెప్పారు. అని అంటుంది. చాల్లే నీ నాటకాలు అని అంటుంది శౌర్య. ఈ దేవుడు సాక్షిగా చెప్తున్నాను శౌర్య. నేను చెప్పేదంతా నిజమే ఇప్పుడు కూడా నేను బావతో నీ పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ సౌర్య నీ నాటకాలు ఆపు ఇక నేను వినలేక పోతున్నాను అని అంటుంది. నిన్ను పెంచిన బాబాయి, పిన్నిలే నన్ను కూడా కాపాడి తీసుకొచ్చారు సౌర్య అని అంటుంది. కానీ శౌర్య నువ్వు చెప్పినవన్నీ నిజాలే అని నేను ఎలా నమ్మాలి అని అంటుంది. అప్పుడు హిమ నేను ఎలా చెప్తే నువ్వు నమ్ముతావు అని అంటుంది.
అప్పుడు మన అమ్మానాన్న వచ్చి చెప్తేనే నేను ఇది నిజమని నమ్ముతాను అని అంటుంది శౌర్య. అప్పుడు సౌందర్య అమ్మానాన్న ఎలా బ్రతుకొస్తారు నువ్వేం మాట్లాడుతున్నావే అని అంటారు. ఇంతలో అక్కడికి వారణాసి వచ్చి సౌర్యమ్మ చెప్పింది నిజమే.. కార్తీక బాబు, దీపములు బ్రతికే ఉన్నారు అని అంటాడు. అప్పుడు సంతోషంతో పొంగిపోతూ ఉంటారు అందరూ. అప్పుడు వారణాసి కొన్ని సంవత్సరాలు క్రిందట దీపమ్మ ఇలా కోమాల నుంచి బయటికి వచ్చింది. తర్వాత డాక్టర్ బాబు కోసం అంతా వెతికింది తన పిల్లల ఎలా ఉన్నారు ఏంటో అని బాధపడుతూ ఉంది. అని అప్పటి గతమంతా అందరికీ చెప్తాడు వారణాసి. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..