Karthika Deepam 15 September Today Episode : వంటలక్కపై మండిపడ్డ కార్తీక్… కార్తీక్ ని ఆశ్రమం కి తీసుకెళ్లాలి అనుకుంటున్నా దీప…

Karthika Deepam 15 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1458 హైలెట్స్ ఏంటో చూద్దాం… కార్తీక్ వచ్చి దీపని తిడుతూ ఉంటాడు. దీప బాధపడుతూ గతం గుర్తు చేయాలనే చూస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మౌనిత చెప్తూనే ఉంది నేను నమ్మొద్దని అయినా నేను మంచి దానివి అని వెనకేసుకొస్తున్నాను. అయినా నా మీద ఎందుకు ఆశలు పెట్టుకుంటున్నావ్ నాకు పెళ్లయింది. నాకు భార్య ఉంది. నా భార్య ని వదిలి నేను ఒక రోజు కూడా ఉండలేను. నువ్వు ఇప్పుడు చేసినది చూస్తుంటే… ఆరోజు మౌనితా టిఫిన్ లో ఏదో కలిపావని అనుమానం వస్తుంది. అప్పుడు దీప ఏడుస్తూ ఉండగా… కార్తీక్ అన్ని మర్చిపోతాను కానీ నీ విషయం మాత్రం నాకు గుర్తుంటుంది. ఇక ఒక విషయం గుర్తుపెట్టుకో మౌనిత నా భార్య నా భార్యను తప్ప నేను పరాయి స్త్రీని మీద ఆశపడను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దీప బాధ పడుతూ ఉంటుంది. కట్ చేస్తే మోనిత ఆనంద్ కోసం వెళ్లాలి. వెళ్తే డాక్టర్ బాబుని ఇక్కడ వదిలేసి పోతే దీపతో డేంజర్. అక్కడికి తీసుకెళ్దామంటే అక్కడ సౌందర్య వాళ్ళు తనని గుర్తుపడతారు.

Advertisement

Karthika Deepam 15 September Today Episode : వంటలక్కపై మండిపడ్డ కార్తీక్…

నేనేమో మీది ముంబై అని కార్తీక్ చెప్పాను నా మీద నమ్మకం పోతుంది అని ఆలోచిస్తూ.. ఇక కార్తీక్ నీ కాదు దీపనే ఇక్కడ లేకుండా చేయాలి. నేను వెళ్లొచ్చే లోపు అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్లకి జరిగిందంతా చెప్తుంది. ఇలా జరుగుతుంది ఏంటి అన్నయ్య. ఏం చేయాలి అని అంటుండగా అప్పుడు పెద్ద ఆవిడ దీపకి ధైర్యం చెబుతూ ఉంటుంది. అప్పుడు దీప నా భర్త మౌని తా చేతిలో కీలుబొమ్మలా మరి నన్ను తిడుతుంటే చాలా కష్టంగా ఉంది అన్నయ్య అని అంటుంది. నువ్వు బాధ పడకు అమ్మ ప్రేమతో నీ భర్తని ప్రయత్నించు నీకు విజయం అందుతుంది. ఆ మౌనిత పెద్ద రాక్షసి కాని దాంతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలమ్మా అని దీపకి ధైర్యం చెబుతూ ఉంటాడు. అవునన్నయ్య అది ఎంత కొట్టినా చావని పాము లాంటిది అని అంటుంది. అప్పుడు డాక్టర్, నీ డాక్టర్ బాబును కాపాడుకోవడానికి నువ్వే ఒక డాక్టర్ కావాలి అని అంటాడు.

Advertisement
Karthika Deepam 15 September Today Episode
Karthika Deepam 15 September Today Episode

కట్ చేస్తే హిమ ఆనంద్ ని తీసుకురమ్మని ఆనందరావుని అడుగుతూ ఉంటుంది. నేను అడిగితే ఇవ్వనన్నారు. తాతయ్య మీరు వెళ్లి అడిగితే ఇస్తారు. అని అంటుంది. అప్పుడు ఆనందరావు ఆలోచిద్దాం అని చెప్తాడు. కట్ చేస్తే చంద్ర సౌర్యని బయటికి వెళ్లొద్దు అని ఆపుతూ ఉంటారు. కానీ సౌర్య వెళుతూ ఉంటుంది. నీకు దగ్గు వస్తుంది కదమ్మా మనం హాస్పిటల్ కి వెళ్దాం.. వారణాసిని వెళ్ళని అని అంటారు. అప్పుడు సౌర్య నేను వంటలక్క కూతుర్ని ఈ మాత్రం దానికి హాస్పిటల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ దగ్గుకి ఏం మందు వేసుకుంటే తగ్గుతుందో నాకు తెలుసు.. అని అంటుంది. అప్పుడు వారణాసి సరేలే అక్క నేను ఎక్కువ సేపు తిప్పను అని తను తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు చంద్ర పాపం జ్వలామ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా బతికే ఉన్నారనే బ్రహ్మలోనే ఉంది అని అంటుంది. కట్ చేస్తే దీప డాక్టర్ కి పెద్దావిడకి వంట చేసి వడ్డిస్తూ.. అన్నయ్య డాక్టర్ బాబుని ఇక్కడికి తీసుకొస్తాను. ఏదైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ ట్రీట్మెంట్ ఉంది. కానీ పేషెంట్ కూడా సహకారం ఉండాలమ్మా.. గుర్తు చేసుకోవడానికి తన ప్రయత్నించాలి.

తను రాడు. మౌనితా ఏది చెప్తే అది నమ్మే స్థితిలో ఉన్నాడు. కాబట్టి అలా చేస్తే ముందు నీ మీద ద్వేషం పెంచుకుంటాడు అమ్మ వద్దు అని అంటాడు. అప్పుడు అవునన్నయ్య అని చెప్తుంది. కేవలం నీ ప్రేమతోనే తనని నీ దగ్గర చేసుకోవాలని చెప్తాడు. అప్పుడు ఎలాగైతే ఆనాడు ఏ సహనంతో అయితే నా డాక్టర్ బాబుని దక్కించుకున్నా నో. ఇప్పుడు కూడా అలాగే దక్కించుకుంటాను అని అంటుంది. కట్ చేస్తే మొనిత దగ్గరకి ఒక ఆశ్రమం వాళ్ళు వచ్చి మీ భర్త గతం మర్చిపోయారు అంట కదా… మా ఆశ్రమంలో ఒక ఆయుర్వేద మందు ఇస్తాము వారం రోజుల్లో మీ భర్త గతం గుర్తుకొస్తుంది అని చెప్తారు. అప్పుడు దూరం నుంచి దీప ఇదంతా వింటూ సంతోష పడిపోతూ ఉంటుంది. మౌనితా మాత్రం మాకేమీ అవసరం లేదు మీరిక వెళ్లొచ్చు అని చెప్తుంది. రేపటి ఎపిసోడ్లు దీప ఊరు వెళ్తూ.. గండ ఆటో దగ్గరికి వచ్చి అన్న ఆటో వస్తుందా అని అడగగానే ఆ వస్తున్న అమ్మా ఎక్కు అని అంటాడు. అంతలో శౌర్య ఫోన్ చేసి బాబాయ్ సరుకులు తీసుకురా అని తనకి చెప్తూ ఉండగా. నేను రాస్తాను లే అన్న మీరు ఆటో నడపండి అని అంటుంది. అప్పుడు శౌర్య అమ్మ గొంతు కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లు చూడాల్సిందే…

Advertisement