Karthika Deepam 16 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ 1432 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దీప హాస్పిటల్ లో డాక్టర్ని అన్ని వివరాలు అడుగుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఒకవేళ కార్తీక్ కి డెడ్ బాడీ మార్చురీలో ఉంటుందేమో చూద్దాం పద అని తీసుకెళ్తాడు. డాక్టర్ దీప కలిసి మార్చురీ లోకి వెళ్లి చూస్తారు అక్కడ డాక్టర్ బాబు బాడీ ఉండదు. అప్పుడు దీప నా మనసు ఇప్పుడు కొద్దిగా కుదుటపడింది అని అంటుంది. అప్పుడు ఆ డాక్టర్ పద మా ఇంటికి వెళ్దాం.. తర్వాత కార్తీక్ కోసం వెతుకుదాం అని చెప్పి దీపను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. కట్ చేస్తే దీప, కార్తీకులు చనిపోయారని సౌందర్య ఏడుస్తూ ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోదామండి నేను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేకపోతున్నాను.
Karthika Deepam 16 August 2022 Episode : కార్తీక్ కోసం వెతుకుతున్న దీప
ఇంట్లో మనకి ఎటువంటి మంచి జరగలేదు, ఇంట్లో ఉన్న ప్రతిక్షణం నరకంలో ఉన్నట్లుంది ఏం జరుగుతుందో ఏంటో అని ఊపిరి బిగా పట్టుకొని ఉండవలసి వస్తుంది. కాబట్టి ఉండొద్దు అని అమెరికా వెళ్ళిపోదామని అంటుంది సౌందర్య. కానీ హేమ వద్దు నాయనమ్మ మనం అమెరికా వెళ్ళిపోతే శౌర్య ఇక్కడ ఒక్కతే ఎలా ఉంటుంది. తనని మనం చూసుకోవాలి నన్ను శౌర్యను చూసుకోమని అమ్మానాన్నలు చెప్పారు. వద్దు నాయనమ్మ మనం అమెరికా వద్దు. అని హిమా అంటుంది. అప్పుడు సౌందర్య నేను వెతుకుతాను తాను కూడా తీసుకొని వెళ్దాం ఈ ఇంట్లో ఉన్న దగ్గరనుంచి వాళ్ళ జ్ఞాపకాలు ప్రతిక్షణం వెంటాడుతూ ఉన్నాయి. ప్రతిక్షణం ఈ ఇంట్లో మళ్లీ ఎలాంటి అనర్ధం జరుగుతుందో అని భయపడి నిద్ర కూడా పట్టడం లేదు అని సౌందర్య నా నిర్ణయం ఇదే అని అంటుంది.

కట్ చేస్తే డాక్టర్ ఇంట్లో డాక్టర్ వాళ్ళ అమ్మకి దీపాన్ని పరిచయం చేస్తాడు అమ్మ నీ కూతుర్ని తీసుకొస్తానని చెప్పాను కదా.. తీసుకొచ్చాను అని అంటాడు. డాక్టర్ వాళ్ళ అమ్మ.. దీప చూసి నువ్వే నా అమ్మ నీకు ప్రమాదం జరిగిన రోజు నుంచి నీ గురించి మాట్లాడని రోజంటూ లేదు. నేను దేవుని మొక్కని రోజు లేదమ్మా. ఆ దేవుడు నా మొర ఆలకించి నిన్ను బ్రతికించాడమ్మా అని అంటుంది. అప్పుడు దీప దేవుడు ఉన్నాడు. ఉండి అందరినీ ఇలా బాధ పెడుతున్నాడు అని అంటుంది. అప్పుడు ఆ పెద్దావిడ మనకి కష్టం వచ్చిందని దేవుడిని నిందించకూడదు.. దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు. మనం కూడా ఏది జరిగిన మన మంచికే అని ధైర్యంగా నిలబడాలి. కచ్చితంగా మంచి జరుగుతుంది అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.