Karthika Deepam 18 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ 1434 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… సౌందర్య అమెరికా వెళ్లిపోవడానికి అన్ని సర్దుతూ కార్తీక్, దీపల ఫోటోలు చూస్తూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఆనందరావు ఏం చేస్తాం కాలంతోపాటు మనం కూడా ముందుకు సాగిపోవడమే వాళ్లతో పాటు ఈ ఇంటి తో కూడా రుణం తీరిపోయింది. పద సౌందర్య అని వాళ్ళ ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు. కట్ చేస్తే ఒకే బస్సులో వెళ్తూ శౌర్య, దీపలు ఆ బస్సు ఒక దాబా దగ్గర ఆగుతుంది. ఒక టీ షాప్ దగ్గర సౌర్యకు బన్ను తినిపిస్తూ వాళ్ల బాబాయ్ పిన్నులు ఉంటారు. అంతలో అక్కడికి దీప వస్తుంది. దీప ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని చంద్ర దగ్గర చిల్లర లేకపోవడంతో దీప తనకి కూడా ఒక వాటర్ బాటిల్ కొనిస్తుంది.
Karthika Deepam 18 August 2022 Episode : గతంలో అమెరికాకి వెళ్లిపోవాలనుకుంటున్న సౌందర్య వాళ్ళ కుటుంబం…
దీప అక్కడి నుంచి వెళ్లి మళ్లీ బస్సు ఎక్కుతుంది. మళ్లీ సౌర్య వాళ్లు కూడా బస్సు ఎక్కుతారు. కానీ ఒకరినొకరు చూసుకోరు. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళింట్లో నర్స్ అక్కడికి వచ్చి దీప ఎలా ఉంది సార్. అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ బాగానే ఉంది రాత్రి హైదరాబాద్ కి వెళ్ళింది అని చెప్తాడు. అయ్యో తన భర్త ఆచూకీ దొరకలేదు కదా సార్.. అప్పుడు ఎలా వెళ్ళింది అని అంటుంది నర్స్. అప్పుడు డాక్టర్ తన భర్త ఎంత ముఖ్యమో తన పిల్లలకి తను బ్రతుకుంది అని తెలియడం కూడా అంతే ముఖ్యం కదా అందుకే వెళ్ళింది అని చెప్తాడు. కట్ చేస్తే హైదరాబాద్ బస్ చేరుకుంటుంది. అందరూ బస్సు నుంచి దిగుతుంటారు. దీప దిగుతుండగా శౌర్య పడుకొని చేయి అడ్డంగా వస్తూ ఉంటుంది అప్పుడు దీప ఆ చెయ్యిని పక్కకి తొలగించి దిగిపోతుంది.

అప్పుడు గండ, చంద్ర ఇద్దరు సౌర్యాన్ని లేపి పదమ్మ దిగుదాం బస్సు హైదరాబాదు వచ్చింది అని అంటారు. దిగి ఆటోలో వెళ్లిపోతారు సౌర్య వాళ్ళు. అప్పుడు శౌర్య తను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది అంతా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు గండ అమ్మయ్య హైదరాబాద్ వచ్చాం బంగారం వాళ్ళ ఇల్లు వస్తుంది. వాళ్లు బంగారాన్ని చూసి ఎంతో సంతోష పడిపోతారు. నువ్వు ఇక అన్ని మర్చిపోయి వాళ్ళతో సంతోషంగా గడుపు తల్లి అని అంటారు. అప్పుడు గట్టిగా ఆపండి ఆటో ఆపండి అని దిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆగు తల్లి ఎందుకంత కోపం తెచ్చుకోకు.. మేము నిన్ను మర్చిపోము అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళ్ళిపోతాం. నువ్వు మీ ఇంటికి వెళ్లి హ్యాపీగా ఉండు అని అంటారు. అప్పుడు సౌర్య ఆపుతారా ఊరికే ఇల్లు అని ఎందుకు నన్ను చంపుతున్నారు అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…