Karthika Deepam 19 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ 1435 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సౌర్యాని వాళ్ల నాయనమ్మ ఇంటికి పంపిస్తున్న గండ, చంద్ర శౌర్య నాకు ఇష్టం లేదు నేను వెళ్లలేక పోతున్నాను. ఇల్లు దగ్గరకు వస్తున్న కొద్ది నా ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది. మీ దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేకపోతే నన్ను వదిలేయమని చెప్పాను కదా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు చంద్ర నువ్వు ఇప్పుడు ఏదో కోపంలో ఉన్నావమ్మా… ఆ కోపం తగ్గిన తర్వాత మళ్లీ నీ కుటుంబం నీకు గుర్తొస్తుందమ్మా.. అని అంటారు. అప్పుడు సౌర్య అలా ఏమి ఉండదు ఎప్పుడు నేను మీతోనే ఉంటాను అని అంటుంది. సరే ఒక పని చేద్దాం.. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళగానే మీ నాయనమ్మ, తాతయ్యల చూడగానే నీ కోపం అంతా పోతుంది. అప్పుడు నీ కోపం పోకపోతే మేం తీసుకొని వెళ్తాం అని గండ అంటాడు. కట్ చేస్తే దీప కూడా ఇంటికి వెళుతూ వాళ్ల గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది.
Karthika Deepam 19 August 2022 Episode : హాస్పిటల్ నుంచి కార్తీక్ ని తీసుకెళ్లిన మౌనిత…
కట్ చేస్తే సౌర్య వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేశారు. గండ, చంద్ర ఇద్దరు కలిసి వెళ్లి వాచ్మెన్ ని అడుగుతారు. అప్పుడు వాచ్మెన్ వాళ్ళు ఇక్కడ లేరు అమెరికా వెళ్లిపోయారు అని అంటాడు. సౌర్య బాధపడుతూ మళ్లీ వాళ్ల పిన్ని బాబాయిలతోనే వెళ్లిపోతుంది. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళింట్లో పెద్దావిడ దీప కి ఫోన్ చేసావా నాయనా అని అంటుంది. అప్పుడు చేస్తాన్లే అమ్మ వాళ్ళ కుటుంబంతో బిజీగా ఉండి ఉంటుంది. తర్వాత తనే చేస్తుందిలే అని అంటారు. అంతలో ఒకాయన వచ్చి మీరు చెప్పిన అతను ఆరోజు దెబ్బలతో వచ్చాడంట సార్. ఇప్పుడు ఆయన మంచిగనే ఉన్నారు అని ఆయన చెప్తాడు. అప్పుడు పెద్దావిడ దీపకి ఫోన్ చేసి చెప్పు సంతోష్ పడుతుంది. అని అంటుంది. కట్ చేస్తే దీప ఇంటికి వస్తుంది. అప్పుడు వాళ్లు అమెరికా వెళ్లిపోయారని వాచ్మెన్ చెప్పడంతో భగవంతుడ.. ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతూ వెనక్కి వెళ్ళిపోతుంది. అంతలో డాక్టర్ ఫోన్ చేసి దీపకి కార్తీక్ గురించి చెప్తాడు. అప్పుడు సంతోషంతో మళ్లీ ఆ డాక్టర్ వాళ్ళ ఊరికి వెళ్తుంది దీప.

దీప గుడిలోకి వచ్చి దేవుడికి బాధపడుతూ తన బాధలు చెప్తూ ఉంటుంది. నా డాక్టర్ బాబు బతికి ఉన్నాడు అని అనిపిస్తుంది. ఆయన నా దగ్గరికి వచ్చేలా చెయ్ దేవుడా ఇద్దరం కలిసి అమెరికా వెళ్లి నా పిల్లల దగ్గరికి వెళ్తాము అని కోరుకుంటుంది. అక్కడ ఉన్న కుంకుమ తీసి తన నుదుటిన, తన తాళిబొట్టుకి పెట్టుకుంటుండగా.. కార్తీక్ దీప అని పిలుస్తాడు. దాంతో దీప పరిగెత్తుకుంటూ వచ్చి తనని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దీప కార్తీక్ ని చూస్తూ నువ్వు బ్రతికి ఉంటా వాని నాకు తెలుసు నేను అనుకున్నది నిజమైంది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఎందుకు బాధ పడతావు నీకోసం ఎన్నిసార్లు అయినా బ్రతుకొస్తా అని అంటాడు. అప్పుడు దీప ఒక్క క్షణం కూడా మనిద్దరం విడిపోవద్దు.. ఇక కలిసి సంతోషంగా ఉందాం అని అంటుంది. అని దీప కలగంటుంది. ఇదంతా నా బ్రాహ్మణ అని డాక్టర్ బాబు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. దేవుడు వైపు చూస్తూ ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావ్ అని అనుకుంటూ ఆయన బతికే ఉన్నారని సంకేతం మా దేవుడా.. నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…