Karthika Deepam 20 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ 1436 ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప గుడి నుంచి కార్తీక్ ని వెతకడానికి వెళుతుంది. కట్ చేస్తే అమెరికాకి వెళ్లిపోయిన సౌందర్య అక్కడ హీమకి భోజనం పెడుతుంది. హిమ నాకొద్దు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు తిరిగింది ఇండియా వెళ్ళిపోదాం అని మారం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద్ రావు మొదట్లో అలాగే ఉంటుందమ్మా తర్వాత ఇక్కడే ఉండాలనిపిస్తుంది అని అంటాడు. ఎప్పటికీ నాకు ఇక్కడ మంచిగా అనిపించదు తాతయ్య నాకు అక్కడే బాగుంటుంది అక్కడ అయితే శౌర్యం ఉంటుంది. అని అంటుంది హిమ. అప్పుడు సౌందర్య నేను మనుషులను పెట్టి వెతికిస్తున్న సౌర్య దొరకగానే వాళ్లు మనకి చెప్తారు అని అంటుంది. ఒకవేళ వాళ్లకి దొరక్కపోతే.. ఒకవేళ తనకు తానే మన ఇంటికి వస్తే మనం ఇక్కడున్నామని తనకు ఎలా తెలుస్తుంది. అప్పుడు ఇంకా బాధపడుతుంది కదా నాయనమ్మ… అక్కడ ఉంటే జ్ఞాపకాలు వెంటాడుతున్నాయని మనుషుల్ని వదిలేసి వస్తారా.. మీకు అర్థమవుతుందా సౌర్యాని మనం వదిలేసి వచ్చాం.. అని హిమ ఏడుస్తూ అంటుంది.
Karthika Deepam 20 August 2022 Episode : దీప ని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న కార్తీక్…
కట్ చేస్తే దీప హాస్పిటల్ కి కార్తీక్ కోసం వచ్చి అడుగుతుంది. ఇక్కడికి ఒకాయన దెబ్బలు తగిలి వచ్చాడంట ఆయన ఏ రూమ్ లో ఉన్నాడు అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ నర్స్ ఆ వచ్చారు. కానీ అతన్ని నిన్న వాళ్ళ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది అని చెప్తుంది. అప్పుడు దీప కంగారుపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ నుంచి వచ్చేస్తూ ఉండగా ఒక నర్సు ఎక్కడ యాక్సిడెంట్ అయిన అతను నిన్న వెళ్లేటప్పుడు ఈ పర్స్ మర్చిపోయాడు మేడం మీరు కొంచెం అతనికి ఇస్తారా… మీరు ఆయనకు ఏమవుతారు అని అడుగుతుంది. అప్పుడు ఆ పర్సు చూస్తూ తను గతమంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అంతలో నర్స్ ఆయన మీకేమవుతారు అని అడుగుతుంది. అప్పుడు ఆయన నా భర్త అని అంటుంది. అప్పుడు ఆ నర్స్ నిన్న వచ్చినావిడ వాళ్ళ ఆవిడని అని తీసుకెళ్లారు కదా మరి మీరు మళ్ళీ భర్త అంటున్నారు ఏంటి.? అని అంటుంది.

అప్పుడు దీప సీరియస్గా చూస్తుంది. అప్పుడు నర్సు సరేలెండి మీ పర్సనల్స్ నాకెందుకు అని వెళ్ళిపోతుంది. దీప కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌర్య ని గండ, చంద్ర దత్తత తీసుకొని తన పేరుని మార్చేస్తారు. తన పేరుని జ్వాలగా పెడతారు. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళ ఇంట్లో డాక్టర్ ఎవరో భార్య అని వచ్చి తీసుకెళ్లడం ఏంటమ్మా అని దీపతో అంటాడు. అప్పుడు అదే అర్థం కావడం లేదు అని ఏడుస్తుంది. అంతలో పెద్ద ఆవిడ వచ్చి మీరు ఎవరో చెప్పిన మాటలు ఎందుకు వింటారు నీకు నీ భర్త చెప్పలేదు కదా లేదా ఆవిడ చెప్పలేదు కదా. మీరు ఇవన్నీ మర్చిపోయి తనని వెతికే పనిలో ఉండండి అని పెద్దావిడ అంటుంది. అంతే నాకు గుత్తొంకాయ కూర చేసి పెట్టమ్మా నీ చేత్తో అని అంటుంది.
సరే అని దీప మార్కెట్ కి వెళ్తుంది. కట్ చేస్తే హిమ వాళ్లు తిరిగి ఇండియాకి వచ్చేస్తారు. అప్పుడు హిమ ఆనందరావుని నాకు చాలా సంతోషంగా ఉంది తాతయ్య నా మాట విని మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని సంతోష పడిపోతూ ఉంటుంది. సౌర్యాని వెతికి తనని కలెక్టర్ చదివించాలి నాయనమ్మ.. అది అమ్మ కోరిక నాయనమ్మ అని అంటుంది. కట్ చేస్తే దీప కూరగాయలు కొంటూ ఉంటుంది మార్కెట్లో.. అంతలో అక్కడికి కార్తీక్ వచ్చి కార్ లోనుంచి దిగి వాళ్ళ డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటాడు. దీప అక్కడ కార్తీక్ ఫోటోను చూపిస్తూ వెతుకుతూ ఉంటుంది. కార్తీక్ డ్రైవర్ ని కూడా వెళ్లి ఆ ఫోటోని చూపించి అడుగుతుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..