Karthika Deepam 21 Aug Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రేక్షకులు నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ తాజాగా రిలీజ్ కాదు. ఎపిసోడ్ 1437 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దీప కూరగాయలు కొనడానికి మార్కెట్ కి వెళ్లి అక్కడ కార్తీక్ పర్సులో ఉన్న ఫోటోని చూపిస్తూ అందర్నీ అడుగుతుంది. ఇతను ఎక్కడైనా కనిపించాడా అని.. అప్పుడు కార్తీక్ తో ఉన్న తన డ్రైవర్ని కూడా వెళ్లి అడుగుతుంది. అప్పుడు అతను చాలాసేపటి వరకు ఆలోచించి తనకి మోనిత ముందే ఎవరైనా తనకనిపించాడా అని అడిగితే ఎవరో నాకు తెలియదు అని చెప్పు అని చెప్తుంది. అందుకే తను ఎవరో నాకు తెలియదు అని చెప్తాడు. అప్పుడు దీప వెళ్లి కూరగాయలు కొనుక్కుంటూ ఉంటుంది. తన వెనకనే కార్తిక్ కార్తీక్ వాళ్ళ డ్రైవర్ ఇద్దరు కలిసి వస్తుండగా..
కార్తీక్ అక్కడ బిర్యానీ చాలా బావుంటుంది. అని ఒక హోటల్ ని చూపిస్తూ ఉంటాడు. అక్కడ దీప ఉండడంతో ఆ డ్రైవర్ అటువైపు వద్దు అని చెప్తుంటాడు. కానీ కార్తీక్ మాత్రం తన మాట వినకుండా గట్టిగా అరుస్తాడు. అక్కడ బిర్యాని బావుంటుంది అని. అప్పుడు దీప కార్తీక్ మాటని గుర్తుపట్టి వెనిదిరిగి చూస్తుంది. అక్కడ కార్తీక్ కనిపిస్తాడు. దాంతో దీప సంతోష్ పడిపోతూ డాక్టర్ బాబు అని తన దగ్గరికి వెళ్తుంది. వెళ్లి తన చేతులని పట్టుకుని డాక్టర్ బాబు మీరు బాగానే ఉన్నారా.. నాకు తెలుసు మీరు బ్రతికే ఉంటారు అని ఏడుస్తూ తనని హగ్ చేసుకోబోతుంది. అప్పుడు కార్తీక్ ఎవరు మీరు అని అడుగుతాడు. అప్పుడు నీ దీపని నేను అని అంటుంది. దీప నాకు దీప ఎవరు తెలియదు అని అంటాడు.
Karthika Deepam 21 Aug Today Episode : గతమంతా మర్చిపోయిన కార్తీక్

అప్పుడు దీప కంగారు పడిపోతూ.. డాక్టర్ బాబు నేను దీప ని మనిద్దరికీ కార్ యాక్సిడెంట్ అయింది. అందరూ చనిపోయారు అనుకున్నారు.నేను అక్కడ ఒక రంగు రాళ్లు ఏరుకునే వారికి దొరికానంట నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించారు. అలా నేను బ్రతికి బయటపడ్డాను. మీరు కూడా పక్కన ఊర్లో ఆ రోజు ఒక హాస్పిటల్లో మిమ్మల్ని చేర్పించారట. నేను అక్కడికి వెళ్లి అడిగితే ఎవరో తీసుకెళ్లారు అని చెప్పారు. అని అంటుంది. మీరు ఏంటేంటో మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావడం లేదు. అని అంటాడు కార్తీక్.. అప్పుడు పక్కన ఉన్న అతను కార్తీక్ కాదు.. మీరు ఎవరు చూసి ఎవ రో అనుకుంటున్నారు అని చెప్తాడు. అప్పుడు భగవంతుడా ఎందుకు అందినట్లే అంది ఇలా చేస్తున్నావు నా భర్త గతమంతా మర్చి పోయేలా చేశావా అని అంటుంది. మీరు అనుకున్న అతను కాదమ్మా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా.. దీప వాళ్ళని ఫాలో అవుతుంది. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.