Karthika Deepam 23 August Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1438 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… దీప తన పెళ్లి రోజును గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే శివ కార్తీక్ ని లేపుతూ ఉంటాడు. కార్తీక్ మాత్రం అస్సలు లేవడు. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళింట్లో దీప కార్తికల పెళ్లిరోజును జరపడానికి సెలబ్రేషన్స్ చేస్తారు. కేక్ తీసుకొచ్చి దీపతో కేక్ కట్ చేపిస్తారు. అప్పుడు దీప ఏడుస్తూ ఉండగా పెద్దావిడ, డాక్టరు ధైర్యం చెబుతూ ఉంటారు దీపకి. కట్ చేస్తే సౌందర్య, సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో హిమ అక్కడికి వచ్చి మీరు వెళ్లి సౌర్యను వెతికి తీసుకొని రండి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆనందరావు సౌర్య మొండిది తను రాను అని చెప్తుంది. కదా ఏం చేయాలి అని అంటారు. అప్పుడు హిమ నాయనమ్మ ప్రతిక్షణం అమ్మానాన్న నా దగ్గరికి వచ్చి శౌర్య ని వదిలేసావా అని అంటున్నారు. అప్పుడు సౌందర్య నేను మళ్లీ వెళ్తే అది ఎక్కడ దూరమవుతుందని భయంగా ఉంది అని అంటుంది.
Karthika Deepam 23 August Today Episode : కార్తీక్ నీ ఎవరు తీసుకెళ్లారు..
అప్పుడు హిమ నేను తిండి, నిద్ర, స్కూల్ కి వెళ్ళడం అన్ని బంద్ చేస్తే, నేను కూడా సూర్య లాగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అప్పుడు కుదురుతుంది అని అంటుంది హిమ. అప్పుడు సౌందర్య హిమ చెంప పగలగొట్టి ఇప్పటికే అందరూ దూరమై బాధపడుతున్న ఇప్పుడు నువ్వు కూడా దూరమైతే మేము ఎవరి కోసం బ్రతకాలి అని అంటుంది. అప్పుడు హిమ అందుకే శౌర్యని తెచ్చుకుందాం అని అంటున్నా… శౌర్య లేకపోతే నేను బ్రతకలేను నాయనమ్మ.. నన్ను సౌర్య దగ్గరికి తీసుకెళ్లకపోతే నేను అన్ని మానేస్తాను అని అంటుంది. అప్పుడు ఆనందరావు సరే తీసుకెళ్తాను అని చెప్తాడు. కట్ చేస్తే దీప కార్తీక్ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నందుకు ఆలోచిస్తూ బాధపడుతూ డాక్టర్ బాబు పక్కన ఉన్న అతను ఎందుకు తను దాచి పెట్టాలని చూస్తున్నా డు. అన్ని విషయాలు తెలుసుకుంటా అని ఉంటుంది. అని పెద్దవిడుకు చెప్పి బయటికెళ్తున్నాను అమ్మ అని చేస్తుంది. అప్పుడు పెద్దవాడ సరే వెళ్ళు అమ్మ కానీ నిన్ను ఒకటి అడగొచ్చా అని అంటుంది. అప్పుడు అడుగమ్మ అనగానే…

అంతలో డాక్టర్ ఇద్దరికీ టీ తీసుకొని వచ్చి ఇస్తాడు. అప్పుడు దీప మీరెందుకు అన్నయ్య టీ తీసుకొస్తున్నారు.. నేనున్నా అంతవరకు మీరు ఏ పని ముట్టుకోవద్దని చెప్పాను కదా.. అని అంటుంది. ఏం పర్లేదులే అమ్మ అని అంటాడు. అప్పుడు ఎందుకన్నయ్య ఇంత మంచితనం నాతో మీకు ఎటువంటి బంధం ఉంది. ఎందుకు నామీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అని అంటుంది దీప. అప్పుడు బంధాలు కలవాల్సిన అవసరం లేదమ్మా మనసులు కలిస్తే చాలు అని పెద్దావిడ అంటుంది. అప్పుడు పెద్దావిడ నువ్వు నీ భర్త కోసం ఇంత తపన పడుతున్నావు కదా.. మరి నీ భర్త కూడా నీకోసం తపన పడాలి కదా నిన్ను చూసి ఎందుకు గుర్తుపట్టలేదు అని అంటుంది. అప్పుడు అదే తెలుసుకోవడానికి వెళుతున్న అమ్మ అని దీప వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌర్య యాక్సిడెంట్ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు చంద్ర, గండ నువ్వు బాధపడితే మా ప్రాణం పోయినట్లు ఉందమ్మా అనే అంటారు. అమ్మానాన్నలు చచ్చిపోతే వాళ్ల బాడీ లు మనకు దొరకాలి కదా..
వాళ్లు బాడీలు దొరకలేదు అంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు. తప్పకుండా ఈ ఊర్లోనే ఉండుంటారు మనం వెతుకుదాం బాబాయ్ అని అంటుంది.అప్పుడు గండ సరే అమ్మ ఈరోజు నుంచి నేను ఆటో నడుపుతాను అదే ఆటోలో నిన్నెక్కించుకొని అమ్మని వెతుకుదాం అని అంటాడు. అప్పుడు సరే బాబాయి అని సంతోష పడిపోతుంది సౌర్య. అప్పుడు చంద్ర సౌర్యాని నువ్వు మొహం కడుక్కొని రా అమ్మ అన్నం తిందువు గాని అని చెప్తుంది. అప్పుడు సరే అని సౌర్య వెళ్ళిపోతుంది. అప్పుడు చంద్ర, గండతో పిల్ల అమ్మానాన్నలు మర్చి పోయేలా చేయాలి కానీ ఇంకా తనకు ఆశలు ఎందుకు రేపుతున్నావ్ అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినాక వాళ్ళు బ్రతికి ఉంటారా అని అంటుంది చంద్ర. అప్పుడు గండ తల్లి అమ్మానాన్న కోసం ఇన్ని రోజులు ఎంతో ఏడుస్తుంది. ఇప్పుడు ఆటో నేర్పించమని అడుగుతుంది కదా.. అలా నేర్చుకుంటూ ఆ ద్యాసలో పడి వాళ్ళ అమ్మానాన్న వెతుక్కుంటూ ఇంకా తనకే అర్థమవుతుంది. వాళ్ళ అమ్మానాన్న లేరు రారని అని అంటాడు. కట్ చేస్తే దీప పార్కులో అటు ఇటు తిరుగుతూ కార్తీక్ కోసం వెతుకుతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..