Karthika Deepam 24 September Today Episode : వంటలక్కని కొట్టబోయిన కార్తీక్… సంతోషపడిపోతున్న మౌనిత…

Karthika Deepam 24 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1466 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సౌందర్య ఆనందరావు ఇంటికి వెళ్తూ మౌనిత గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు ఆనంద్ రావు, మౌనిత దీప ఒకటే అని అంటూ ఉంటాడు. అప్పుడు సౌందర్య మీరు టాబ్లెట్లు వేసుకుని వచ్చారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది. అది కాదు సౌందర్య కార్తీక్ ఎన్ని తిట్టినా.. మనం ఎన్ని మాటలు అన్న భరించి చాటుగా కొడుకును కనీ వాడు చనిపోయిన వాడిని ఆరాధిస్తుంది చూడు అది మౌనితా గొప్పతనం కాదు.. మన కొడుకు మంచితనం అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మౌనిత నీ శివ మేడం ఇందాకల వచ్చినవాళ్లు సార్ వాళ్ళ అమ్మానాన్నల అని అడుగుతాడు. అప్పుడు మౌనిక సీరియస్ గా చూసుకుంటూ ఎవరి అమ్మానాన్నలైతే ఏంట్రా అని అంటుండగా.. కార్తీక్ అక్కడికి వచ్చి నిజంగానే వాళ్ళు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు మౌనిత వాళ్ళు శివ అమ్మా నాన్నలు అని అనగానే… అప్పుడు కార్తీక్ శివ అమ్మ నాన్న అయితే శివని కలవకుండా ఎందుకు వెళ్లారు.

Advertisement

అని అంటాడు అప్పుడు మౌనిత వాడు చిన్న పిల్లల లాగా వాళ్ళని చూస్తే ఇంటికి వస్తానని ఏడుస్తాడంట అందుకే వాళ్ళు ఇక్కడే ఉంచమని చెప్పి వెళ్లారు. అని అనగానే కార్తిక్ శివని తిడతాడు. శివ మౌనితపై అనుమాన పడుతూ ఉంటాడు. కట్ చేస్తే దీప కార్తీక్ గురించి అంత చెప్తూ ఉంటుంది. అంతలో దీప దగ్గరికి ఒక ఇద్దరు వచ్చి దీపని మీరు వంటలు బాగా చేస్తారంటగా అమ్మ.. మా దగ్గర ఒక ప్రోగ్రాం ఉంది దానికి వంటలు చేయాలి అని చెప్పి వెళ్ళిపోతారు. కట్ చేస్తే హిమ, శౌర్య దగ్గరికి వస్తుంది. అప్పుడు శౌర్య, హిమ నువ్వు ఇక్కడ ఉండలేవు.. నాలాగా తిరగలేవు.. కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తూ ఉంటుంది. కానీ హేమ నువ్వు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను. అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే కార్తీక్, దీప అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతలో మౌనిత కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. అప్పుడు మౌనితా ఏం ఆలోచిస్తున్నావ్.. కార్తీక్ అనగానే.. కార్తీక్ ఆ వంటలక్క చాలా డిస్టర్బెన్స్ గా ఉంది అని అంటూ… ఉన్నవాళ్లు చెప్పినా తిట్టిన మళ్లీ నా వెంట పడుతూనే ఉంది.

Advertisement

Karthika Deepam 24 September Today Episode : వంటలక్కని కొట్టబోయిన కార్తీక్…

Karthika Deepam 24 September Today Episode
Karthika Deepam 24 September Today Episode

ఎందుకలా అని అనగానే అప్పుడు మౌనిక మనం దాన్నుంచి ఊరికి వెళ్ళిపోదాం ప్రశాంతంగా అక్కడ ఉందాం అని అంటుంది.అప్పుడు కార్తీక్ మనమెందుకు వెళ్లిపోవాలి. మన మిమల్ని తప్పు చేసాము. అలా వెళ్తే మనమే తప్పు చేసాం అని అనుకుంటారు. మనం వెళ్లడం కాదు. తననే పంపించాలి అని అంటాడు. అప్పుడు మౌని తా అది జరిగితే అద్భుతం జరిగినట్లే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు కార్తీక్, దీప దగ్గరికి వచ్చి మీరు తాళం తీయండి. నేను మీతో మాట్లాడాలి అని అంటాడు. అప్పుడు దీపతో ఈరోజు నుంచి నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టవద్దు. నా భార్య మౌనిత నా కొడుకు ఆనంద్ మేము ఎదురింటిలో ఉంటున్నాం. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను కాబట్టి మీరు నన్ను వదిలి పోవడానికి ఏం కావాలో చెప్పండి.. అంటూ డబ్బు ఇచ్చి ఇక మీరు నన్ను వదిలి వెళ్లిపోండి అని అంటూ ఉంటాడు. అంతలో మౌనిత ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతున్నప్పుడు ఇక్కడ వంటలక్క దగ్గర ఉన్నాను. ఐదు నిమిషాల్లో వస్తాను నేను చెప్తాడు. అప్పుడు మౌనిత కంగారు పడుతూ ఉంటుంది.

ఇక్కడ కార్తీక్ మీరు ప్రతిసారి డాక్టర్ బాబు నా భర్త అంటుంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను.. నా సహనం, కోపంగా మారకముందే మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని వెళ్ళిపోతూ ఉండగా… ఆగండి డాక్టర్ బాబు అని డబ్బులు పట్టుకొని.. కార్తీక్ ఆ డబ్బులు నీకోసమే నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు.. అని అంటుండగా దీప నా మొగుడు ఇచ్చిన డబ్బులు నాకు ఖర్చు పెట్టుకునే అధికారం ఉంటుంది. వాటిని నా దగ్గరే ఉంచుకుంటాను..మీకు నచ్చిన చీరలు కొనుక్కుంటాను. మీకు నచ్చిన నగలే వేసుకుంటాను.. డాక్టర్ బాబు అని అంటుండగా.. కార్తీక్ ఒక్కసారిగా దీపపై చేయి ఎత్తుతాడు.. అప్పుడు మౌనిత వచ్చి దీపని కొట్టకుండా అడ్డుపడి కార్తీక్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌందర్య, హిమ, సౌర్యాని నాలుగు పీకు తీసుకొస్తాను అని చెప్తుంది. కట్ చేస్తే దీప దేవుడికి పూజ చేస్తూ నా శక్తికి మించి ప్రయత్నిస్తున్నాను.. దేవుడా నా ప్రయత్నం ఫలించేలా చెయ్యి అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో దీప జీవిత స్టోరీని నాటకంగా వెయ్యబోతూ ఉంటుంది. దానిని చూడాలని కార్తీక్ ని అడుగుతూ ఉండగా సరే వస్తాను అని చెప్తాడు కార్తీక్… ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Advertisement