Karthika Deepam 25 August Today Episode : కార్తీక్ ని తీసుకెళ్లింది మోనిత నే అని తెలుసుకున్న దీప… దీప ఏం చేయబోతుందో చూడాలి…

Karthika Deepam 25 August Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1440 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సౌందర్య సౌర్య కోసం బాధపడుతూ ఉంటుంది. దీప మౌనితను ఫాలో అవుతూ వస్తుంది. మోనిత ఇంటి లోపలికి వచ్చి కార్తీక్ ఫోటో వైపు చూస్తూ ఏడుస్తున్నట్లు డ్రామాలాడుతూ ఉంటుంది. దీప ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి అవుతుంది. తిరిగి దీపానే మల్లి అనుమానిస్తూ ఉంటుంది కార్తీక్ ని దెగ్గర ఉంచుకొని డ్రామాలాడుతుందా.. ఎందుకు నాకు కార్తీక్ ని దూరం చేస్తుంది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దీప ఇల్లంతా వెతుకుతుంది దీనిని నమ్మడానికి లేదు అని అనుకుంటుంది. దీప నమ్మేలా తెగ డ్రామాలాడుతూ ఉంటుంది మోనిత. దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌందర్య సౌర్య గురించి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి హిమ శౌర్యకి బట్టలు తీసుకుని వస్తుంది. హి, సౌర్య దగ్గరికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటుంది.

Advertisement

ఆనంద్ రావు సౌందర్యని ఏమైంది సౌందర్య, హిమ అంత ఉత్సాహంగా ఉంటే అని అంటాడు. అప్పుడు సౌందర్య వెళ్లడానికి ఇబ్బందేం లేదండి కానీ శౌర్య హిమని చూస్తే ఎక్కడ మండిపడుతుందో దాని మీద ఉన్న కోపం ద్వేషంగా మారుతుందో ఎప్పటికీ వాళ్ళు శత్రువులాగే ఉండిపోవాల్సి వస్తుందని భయపడుతున్నానండి అని అంటుంది. అప్పుడు హిమ ఓహో ఇదే నాయనమ్మ నీ భయం అయితే నేను రానులే నాయనమ్మ మీరే వెళ్లి ఇవన్నీ ఇచ్చి తనని తీసుకొని రండి అని చెప్తుంది. కట్ చేస్తే దీప కార్తీక్ ని వెతుకుతూ ఉంటుంది. అంతలో కార్తీక్ శివ కలిసి అటువైపు వస్తుండగా కార్తీక్ దీపని చూసి ఆవిడ మళ్లీ ఇక్కడుంది ఏంటి.. కార్ ఆపమని కారు దిగి దీప గురించి మాట్లాడతాడు ఉంటాడు. అప్పుడు శివ ఆవిడ ఎవరో సార్ మీరు ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు సార్.. వెళ్తున్నారు అని అంటాడు. అప్పుడు కార్తీక్ ఆవిడ దగ్గరికి వెళ్లి అడుగుతాను నన్ను ఆరోజు ఏదో పేరుతో పిలిచింది అని అంటాడు. అలా వస్తుండగా దీప మళ్లీ ఆటోలో వెళ్లిపోతుంది.

Advertisement

Karthika Deepam 25 August Today Episode : దీప ఏం చేయబోతుందో చూడాలి…

Karthika Deepam 25 August Today Episode
Karthika Deepam 25 August Today Episode

కార్తీక్ శివ కూడా వెళ్ళిపోతారు. కట్ చేస్తే డాక్టర్ వాళ్ళ ఇంట్లో పెద్దావిడ దీపని ఏమైందమ్మా డాక్టర్ బాబు కనిపించలేదా అని అడుగుతుంది. అప్పుడు దీప మౌనిత గురించి అంత ఆ పెద్దావిడకు చెప్తుంది. అప్పుడు పెద్దావిడ అది ప్రేమ కాదమ్మా పైత్యం అది నాశనానికేనమ్మ ఆ బుద్ధులన్నీ అని అంటుంది. అప్పుడు దీప డాక్టర్ బాబు ఫోటో పట్టుకుని అది కూడా నాలాగే వెతుకుతుందమ్మా అని చెప్తుంది. అప్పుడు ఆ పెద్దావిడ వెతుక్కోని వెతికితే ఏమవుతుంది డాక్టర్ బాబు కనిపించాడు అనుకో ఏం చేస్తాడు. అని అంటుంది. అప్పుడు దీప.. ఏంటి మళ్లీ నా దగ్గరకు వచ్చావు అని తనని చిరాకు పడతాడు. అప్పుడు పెద్ద ఆవిడ మరి ఇంకెందుకు అమ్మ నీకు భయం అని అంటుంది. దాన్ని చూస్తుంటే నా డాక్టర్ బాబు నాకు మళ్ళీ దూరం చేస్తుందేమోనని భయంగా ఉందమ్మా అని అంటుంది. అప్పుడు ఏం కాదులే అని ధైర్యం చెబుతుంది. తర్వాత భాగంలో డ్రైవర్ ని నాలుగు పీకి పోలీసులకి అప్పగిస్తానంటే మౌనిత గురించి అంత చెప్పేస్తాడు. రేపటి సీన్లో మౌనిత కార్తీక్ కి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇక దీప రేపటి ఎపిసోడ్లో మౌనిత ని ఏం చేస్తుందో ఎదురుచూడాల్సిందే..

Advertisement