Karthika Deepam 26 August Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1441 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… పెద్దావిడ దీపకు ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మౌనిత గురించి కాదు.. కార్తీక్ నిన్ను ఎవరు అని అడిగాడు.. కాబట్టి ఆయన నీ భర్త ఏనా అని తన గురించి ఆలోచించాలి ఆ పనిలో ఉండు అని చెప్తుంది. కట్ చేస్తే కార్తీక్ దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. మౌనిత ఒక బోటిక్ మెయింటినెన్స్ చేస్తూ ఉంటుంది. దానిలో స్టాప్ కార్తీక్ ని ఆయనకి ఇంత మతిమరుపు ఏంటే అని అంటుంటూ ఉంటారు. కట్ చేస్తే దీప కార్తీక్ ను వెతుకుతూ ఉంటుంది. అంతలో మౌనిత మనిషి అక్కడ ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. అతన్ని పట్టుకొని అప్పుడు దీప 4 పీకి నిజమేంటో చెప్పించే లోపు.. మౌనిత వచ్చి రివర్స్లో మళ్లీ ఇతను దగ్గర మా కార్తీక్ బాబు ఉన్నాడా అని అతని లాక్కొని దీపను నెట్టేసి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
Karthika Deepam 26 August Today Episode : మోనిత ఎంట్రీ తో మరో ట్విస్టు…
అప్పుడు దీప బాధపడుతూ ఈ రాక్షసి మళ్లీ నా జీవితంలోకి ఎందుకు పంపించావు దేవుడా అని ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మౌనిత కార్తీక్ అన్నం తినిపిస్తూ ఉంటుంది. కార్తీక్ ఎందుకు నాకు చిన్నపిల్లాడి లాగా తినిపిస్తావు వద్దని చెప్తు చిరాకు పడుతూ ఉంటాడు. అప్పుడు నీ పేరేంటి అని కార్తీక్ మొనిత ని అడుగుతాడు. అప్పుడు నా పేరు మౌనిత నన్ను ఎప్పటికీ మర్చిపోకూడదు. మనిద్దరం భార్యాభర్తలం అని అంటుంది. కార్తీక్ నేను బయటికి వెళ్తాను అని అంటాడు. అప్పుడు నువ్వు బయటికి వెళ్ళకూడదు అని చెప్తుంది. ఎందుకెళ్లకూడదు అని అడుగుతాడు. అప్పుడు నువ్వు బయటికి వెళ్తే ప్రమాదం అని చెప్తుంది మోనిత. ప్రమాదం ఏంటి నన్ను స్వేచ్ఛగా తిరగనియ్యవేంటి ఎందుకు నన్ను టార్చర్ పెడుతున్నావ్ అని. అసలు నువ్వు నా భార్య వేనా అని అడుగుతాడు.

అప్పుడు అదేంటి కార్తీక్ అలా అడుగుతున్నావు. మరి నీ మీద అలా అనుమానాలు రేకెత్తుతున్నాయి అని అంటారు. ఆవిడ ఎవరో డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని ఎందుకు వెంటపడుతుంది. అసలు నాకు ఏమీ అర్థం కావడం లేదు. అసలా బొటిక్ షాపు ఏంటి? నువ్వు నా భార్య వేన అని అనుమానం రేకెత్తితోనే ఉంది నిజం చెప్పు అని అంటాడు. అప్పుడు ఏదో ఒక డ్రామా ఆడి కార్తీక్ నమ్మేలా చేస్తుంది. అయినా సరే కార్తీక్ ఆలోచిస్తూనే ఉంటాడు. కట్ చేస్తే సౌందర్య, ఆనందరావు, హిమ శౌర్య దగ్గరికి వస్తారు. అంతలో శౌర్య అన్నం తింటూ బయటికి వస్తుంది. అప్పుడు సౌందర్య చూసి తట్టుకోలేక ఎలాంటి భోగాలని అనుభవించాల్సిన పిల్లని ఇలా చేశావేంటి దేవుడా అని.. సౌర్య దగ్గరికి వెళుతుండగా హిమా ఆపి తాతయ్యని ఒక్కన్నే వెళ్లని అని హిమ ఆపుతుంది.
అప్పుడు ఆనందరావు వెళ్లి అమ్మ శౌర్య అని అంటాడు. అప్పుడు మళ్లీ ఎందుకు వచ్చావు తాతయ్య రావద్దని చెప్పానుగా అని అంటుంది శౌర్య. అప్పుడు ఆనందరావు చాలా బెంగగా ఉంది అమ్మ రాకుండా ఉండలేకపోయాను అని అంటాడు. నువ్వు వచ్చి మళ్లీ రమ్మని పిలుస్తావు అంటుంది. నేను పిలిచిన రావా అమ్మ అని ఆనందరావు అంటాడు. అప్పుడు సౌర్య వస్తాను అమ్మానాన్న ఇక్కడే ఉన్నారని నమ్మకం ఉంది. వాళ్ళని తీసుకొని వచ్చి అప్పుడు హీమతో మాట్లాడతాను అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో కార్తీక్ ను వెతుక్కుంటూ దీపా వెళ్తూ ఉంటుంది. మోనీత ఇంట్లో కార్తీక్ దీప అని మౌనిత అని పిలుస్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.