Karthika Deepam 26 September Today Episode : దీపని గుర్తుపట్టిన కార్తీక్… ఊరు వదిలి పోతున్న మౌనిత…

Karthika Deepam 26 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1467 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. దీప కాలనీ అసోసియేషన్ ప్రోగ్రాం కి వంట చేయడానికి వెళుతుంది. అక్కడ వాళ్లు ఒక నాటకం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు దీప అదంతా విని నా దగ్గర ఒక కథ ఉంది మేడం చెప్తాను అని అనగానే. వాళ్లు చెప్పమ్మా అని అనగానే దీప చెప్తుంది. అప్పుడు దీపనే అందులో మెయిన్ క్యారెక్టర్ చేయమని అడుగుతారు. అప్పుడు సరే అని దీప ఒప్పుకొని వంట చేయడానికి వెళుతుంది. కట్ చేస్తే మౌనిత ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లి కార్తీక్ గురించి అడుగుతూ ఉంటుంది. నాకు తెలిసిన ఒక అతను యాక్సిడెంట్లు గతం మర్చిపోయాడు అతను భార్య ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది గతం గుర్తు రావాలని అలా గుర్తొస్తుందా అని ఆ డాక్టర్ని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ ఆ గుర్తొస్తుంది. కానీ ఎప్పుడు.. ఎలా.. అన్నది తెలీదు అని చెప్తాడు.

Advertisement

అప్పుడు మౌని తా ఇక మీదట నుంచి దీప ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా నేను చూసుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే.. శౌర్య, హిమ ని ఇక్కడినుంచి వెళ్ళిపో హిమ అని చెబుతూ ఉంటుంది. అప్పుడు హిమ నువ్వు కూడా రా శౌర్య నేను వెళ్తాను అని అంటుంది. అప్పుడు శౌర్య నేను రాను.. రాను.. రాను నేను నాయనమ్మ పిలిస్తేనే రాలేదు. నువ్వు పిలిస్తే ఎలా వస్తాను అని అంటుంది. అంతలో సౌందర్య వాళ్ళని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడు శౌర్య వాళ్ళ నాయనమ్మని చూసి అక్కడ నుంచి వాష్ రూమ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతలో సౌందర్య హేమ దగ్గరికి వచ్చి ఏంటి ఇలా వచ్చేసారు ఇన్ని రోజులు ఎక్కడున్నారు సౌర్య ఏది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు వాష్ రూమ్ కి వెళ్ళింది నాయనమ్మ అని అంటూ ఉంటుంది. ఇక ఎంతసేపటికి రాపోయేసరికి హిమని తీసుకొని సౌందర్య వెళ్ళిపోతుంది. కట్ చేస్తే దీప కార్తీక్ దగ్గరికి వస్తుంది.

Advertisement

Karthika Deepam 26 September Today Episode : ఊరు వదిలి పోతున్న మౌనిత…

Karthika Deepam 26 September Today Episode
Karthika Deepam 26 September Today Episode

అప్పుడు కార్తీక్ దీప చూసి ఏంటి మళ్లీ వచ్చావు ఎవర్నో చూసి నాకు ఎందుకో అలా అనిపించింది. నిన్ను కాదు నేను గుర్తొచ్చింది అని అన్నది అని అంటూ ఉంటాడు. వాళ్లు శివ అమ్మ నాన్న అంట అని చెప్తూ ఉంటాడు. అప్పుడు దీప నేను దానికోసం కాదు డాక్టర్ బాబు వచ్చింది . నేను కాలనీలో ఒక నాటకం వేస్తున్నాను.. దాన్ని మీరు చూడాలి అని చెప్తుంది. అప్పుడు నేనెందుకు చూడాలి. నీ బాధ చూస్తుంటే జాలి జాలేస్తుంది. అసలు నీ భర్త ఎవరు అని అడగగానే… అప్పుడు దీప మీరు నేను ఏసే నాటకాలు చూస్తే నా భర్త ఎవరో తెలుస్తుంది అని అంటుంది. అప్పుడు కార్తీక్ నిజంగా తెలుస్తుందా అయితే వస్తాను కదా అని అంటూ.. శివకు మౌనిత మేడంకి ఇదంతా ఏమి చెప్పకు జస్ట్ నాటకం చూడ్డానికి వెళ్లాను అని చెప్పు అని శివకు చెప్పి వెళ్తారు. ఇక కార్తీక్ దీప ఆ కాలనీ కి వెళ్లి అక్కడ కార్తీక్ ని వాళ్లకి పరిచయం చేస్తుంది.

అప్పుడు కార్తీక్ ఇదిగో వంటలక్క నాకు ఈ నాటకాలు పెద్దగా నచ్చవు తొందరగా మొదలు పెట్టాలి లేకపోతే నేను వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు సరే డాక్టర్ బాబు అని అంటుంది. కట్ చేస్తే సౌర్య సౌందర్య నుండి తప్పించుకోవడానికి మోనిత కారు డిక్కిలోకి వెళ్లి దాక్కుంటుంది. ఇక మౌని తా నేను తొందరగా వెళ్లి కార్తీక్ ని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లాలి అని అనుకుంటూ ఉంటుంది. అంతలో డాక్టర్ వస్తాడు. అప్పుడు దీప డాక్టర్ బాబుని తీసుకువచ్చి కార్తీక్ గురించి చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ దీప దగ్గరికి వచ్చి ఈయన ఎవరు.? అని అడగగానే దీప మా అన్నయ్య అని చెప్పాను కదా అని అంటుంది. మీ అన్నయ్య అంటే చెల్లెలు గురించి ఏం పట్టించుకోవడం భర్త ఎవరు వాళ్ళు ఎందుకు దూరంగా ఉంటున్నారో తెలుసుకోవా అని అడుగుతూ ఉంటాడు.

అప్పుడు మీరు ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి నేనే రంగంలోకి దిగి ఈ నాటకం చూడ్డానికి వచ్చాను.. అయినా నాటకం చూడ్డం ఎందుకు ఇప్పుడు మీరే చెప్పేయండి అంతసేపు నేను ఉండలేను అని అంటూ ఉంటాడు. అప్పుడు డాక్టర్, దీప ఇంతసేపు ఉన్నారు కదా.. ఈ కాసేపు ఉంటే ఈ నాటకం చూస్తే మీకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని చెప్తూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో దీప నాటకం వేస్తూ ఉండగా.. అదంతా చూస్తున్న కార్తీక్ గతం గుర్తుకొచ్చి దీపా దీప ఆగు వెళ్లొద్దు అని అంటూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

Advertisement