Karthika Deepam 27 August Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఎపిసోడ్ 1442 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… ఆనంద్ రావు, సౌర్యాని ఇంటికి ఎప్పుడొస్తావని అడుగుతూ ఉంటాడు. కానీ శౌర్య నేను హిమా ఉన్న ఇంటికి రాను అని అంటుంది. అప్పుడు ఆనందరావు హిమ మీద నీ కోపం ఎప్పుడు పోతుంది అని అడుగుతాడు. అప్పుడు అమ్మ నాన్నలు బ్రతికి వచ్చినప్పుడు పోతుంది అని అంటుంది శౌర్య. అయినా మీరు నన్ను గాలికి వదిలేసి అమెరికా కి వెళ్లిపోయారు కదా మళ్లీ ఎందుకు వచ్చారు అని అంటుంది. అప్పుడు ఆనందరావునీకోసమే మళ్లీ తిరిగి వచ్చావమ్మా… నువ్వు వచ్చేయమ్మ అని అంటాడు. తాతయ్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటుంది. చాటుగా ఇదంతా చూస్తూ హిమ, సౌందర్య బాధపడిపోతూ ఉంటారు.
ఇవి తీసుకో అమ్మ అని అంటాడు ఆనందరావు. నాకు అలాంటి ఏమి వద్దు ప్లీజ్ తొందరగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటుంది శౌర్య. దాంతో ఆనందరావు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.కట్ చేస్తే దీప మౌనిత దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంకొకపక్క ఆనంద్ రావు వాళ్ల కారు పక్కనుంచి దీప ఆటో వెళ్తుండగా ఆనందరావు దీప చూస్తాడు. అప్పుడు కారు దిగి ఆనంద్ రావు దీప కనిపించింది. సౌందర్య అని చెప్తాడు. అప్పుడు సౌందర్య అదంతా బ్రహ్మం అండి. నాక్కూడా ఇలా చాలాసార్లు అనిపించింది అని చెప్తుంది. కట్ చేస్తే డాక్టర్ దీపాన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ గురించి చెప్తూ ఉంటుంది. తరువాత కార్తీక్ పక్కన ఉన్న ఒకతని నిన్ను నేను కలిశాను అతను నిజం చెప్పే లోపు ఆ మౌనిత వచ్చి అతని లాక్కెళ్ళింది అని అంటుంది దీప. డాక్టర్ బాబు మౌనితని గుర్తుపట్టాడా..
Karthika Deepam 27 August Today Episode : మోనితను ఏం చేయబోతుంది.?

అని అంటుంది. అప్పుడు ఒకవేళ గుర్తుపడతాడు అప్పుడు ఏం చేస్తాడు అని అంటాడు డాక్టర్. అప్పుడు దీప నాలుగు తన్ని పంపిస్తాడు అని అంటుంది. ఇంకేంటమ్మా ఇంకా ఇవన్నీ మర్చిపో డాక్టర్ బాబుని వెతకడం మొదలుపెట్టు అని అంటాడు. కట్ చేస్తే కార్తీక్, దీప దీప అని కలవరిస్తూ ఉంటాడు. అప్పుడు మౌనిత మనసులో నేను వేసిన మందులు పనిచేయడం ఆగిపోయాయా దీపాన్ని పిలుస్తున్నాడు. గతమంతా గుర్తొస్తుందని భయపడుతూ ఉంటుంది. అప్పుడు మౌనితని కొంచెం తలనొప్పిగా ఉంది మర్దన చేయవా అని అడుగుతాడు. అప్పుడు మర్దన చేస్తే గతమంతా గుర్తొస్తుందని తప్పించుకోవాలని చూస్తుంది. ఏదో స్టాక్ వచ్చిందంట నేను బయటకి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తున్న అని అంటుంది. అప్పుడు కార్తీక్ కూడా నేను కూడా అలా బయటకు వెళ్లి వస్తాను అని చెప్తాడు.
అప్పుడు ఏదో ఒకటి చెప్పి కార్తికని బయటికి వెళ్లకుండా ఆపుతుంది మౌనిత. కట్ చేస్తే హిమ, సౌందర్య, ఆనంద్ రావు సౌర్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సౌందర్య నేను ఎలాగోలా సౌర్యాన్ని తీసుకొచ్చి నీకు అప్ప చెప్తాను అని హిమకి మాటిస్తుంది. అప్పుడు ఆనందరావు మనం సౌర్యని బలవంతంగా నైనా తీసుకురావాల్సింది అని అంటాడు. అప్పుడు సౌందర్య మనం బలవంతంగా తీసుకొస్తే అది మళ్లీ మనకి దూరంగా వెళ్ళిపోతే ఏం చేస్తారు. అందుకే నా మనవరాలని అలా చూసి కూడా ఓపిక పట్టుకుంటున్న అని అంటుంది సౌందర్య. కట్ చేస్తే మౌనిత కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. రేపటి ఎపిసోడ్ లో దీప కార్తీక్ ఎక్కడున్నాడో తెలుసుకోబోతోంది. ఇక దీప ఏం చేయబోతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..