: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు. ఎపిసోడ్ 1443 హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..సౌందర్య హిమకు నేను ఏదో విధంగా సౌర్యని తీసుకొస్తాను అని మాట ఇస్తుంది. అప్పుడు ఆనందరావు సౌర్యాని మనం బలవంతంగా తీసుకువస్తే బాగుండేది అని అంటాడు. అప్పుడు సౌందర్య దానిని బలవంతంగా తీసుకొస్తే ఉంటుందా ఒకవేళ దూరంగా పారిపోతే ఏం చేస్తారండి. అందుకే దానిని తీసుకురావడం ఒక్క క్షణం చాలు కానీ అది ఉంటుందనే గ్యారెంటీ లేదు కదా అని అంటుంది. కట్ చేస్తే మౌనిత అదే హోటల్ కి వస్తుంది. కానీ ఒకరినొకరు చూసుకోరు. మౌనిత కార్తీక్ గతం గుర్తొస్తుందో ఏమోనని భయపడుతూ ఉంటుంది.
కట్ చేస్తే దీప కార్తీక్ కోసం తిరుగుతూ ఉంటుంది. అంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. దీప కార్తీక్ ని చూసి తన దగ్గరికి వస్తుండగా.. శివ తనని తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు దీప బాధపడుతూ అసలు వీళ్ళు ఎటు వెళ్తున్నారు.. అని వాళ్ళ కారు వెనక ఫాలో అవుతూ వెళ్తుంది. అప్పుడు కార్తీక్ మౌనిత ఇంటికి వెళ్లి ఆగి కారు దిగి లోపలికి వెళ్తూ ఉండగా… దీప ఆ ఇంట్లోకి వస్తుంది. అంతలో మౌనిత బయటికి వచ్చి కార్తీక్ నిన్ను బయటికి వెళ్ళొద్దన్నాను కదా ఎందుకు వెళ్లావు అని అంటుండగా.. దీప మౌనితను చూస్తుంది. అప్పుడు డాక్టర్ బాబు అని దగ్గరికి వెళ్తుండగా ఆగు అసలు నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు అని దీపాన్ని అంటాడు. దీప మౌనితను చూసి నేను అనుకున్నానే నువ్వే తీసుకొచ్చావని నువ్వు పెద్ద మాయలాడివి నీ దగ్గరే డాక్టర్ బాబూని పెట్టుకొని మళ్లీ పై తిరిగి ఫోటో పట్టుకొని వెతుకుతున్నావా..
Karthika Deepam 28 August Today Episode : మౌనితను నా భార్య అంటున్న కార్తీక్…

ఇవాళ నిన్ను చంపి అయినా సరే నా డాక్టర్ బాబు ని తీసుకెళ్తా.. అని మౌనితనీ కొట్టడానికి మీదికి వెళ్లి తనని గొంతు నలుముతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అసలు నువ్వు ఎవరు నా భార్యని ఎందుకు చంపాలని చూస్తున్నా. అని దీపని ఆపుతాడు. అప్పుడు మౌనిత శివ కలిసి ఈమె పిచ్చిది సార్ మిమ్మల్ని చూసి వాళ్ళ భర్త అనుకుంటుంది. అని తనని గుర్తుపట్టకుండా ఉండడం కోసం డ్రామాలాడుతూ ఉంటారు. ఇలా మౌనిత నన్ను చంపాలని చూస్తుంది. అందుకే నిన్ను బయటికి వెళ్లొద్దు అని చెప్పాను.. అని కార్తీక్ ని అంటుంది. అప్పుడు దీప డాక్టర్ బాబు మొనితా నీ భార్య నా.. మరి నేనెవరు. అని అంటుంది. అప్పుడు మీరు ఎవరో నాకు తెలియదండి అని అంటాడు. అప్పుడు దీప అయ్యో భగవంతుడా ఇది మనకి ఎంత అన్యాయం చేసిందో మీరు మర్చిపోయారా.. ఇది మనల్ని విడదీయాలని చూసింది అని మౌనిత గురించి చెప్తూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..