Karthika Deepam 28 September Today Episode : స్పృహలోకి వచ్చి దీప అంటున్న కార్తీక్… ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నా మౌనిత…

Karthika Deepam 28 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1469 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప నాటకంలో ఒక భాగంగా మీ అబ్బాయిని నోరు మూసుకొని చెప్పండి.. నన్ను ఇంతలా బాధపెట్టిన మనిషి మొగుడైతే ఏంటి.? ఈ మగాడైతే ఏంటి దేవుడైతే ఏంటి.? ఐ డోంట్ కేర్ అని గట్టిగా మొత్తుకుంటూ ఉండగా.. కార్తీక్ కి గతం కొద్దికొద్దిగా గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడు దీప నేను వెళ్తున్నాను అని బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక కార్తీక్ ఇది జీవితమా.. నాటకమా అనేది అర్థం కావడం లేదు అని డాక్టర్ కి చెప్తూ ఉంటాడు. ఆ నాటకాన్ని చూసి డాక్టర్ కూడా ఇన్ని కష్టాలు పడ్డావు తల్లి అని బాధపడుతూ ఉంటారు. నా చెల్లిని ఎన్ని కష్టాలు పెట్టావు కార్తీక్ అని కార్తీక్ వైపు సీరియస్ గా చూస్తూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ నా వైపు ఎందుకు సీరియస్ గా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు.

Advertisement

అలా నాటకం సాగుతూ ఉండగా… పిల్లల గురించి ఎపిసోడ్ లో సౌర్య ఎవరు తర్వాత ఏం జరుగుతుంది.. దీప వంటలక్క అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ కి మెల్లమెల్లగా గతం గుర్తుకొస్తుంది. సౌందర్య, ఆనంద్ రావు, అని పేర్లు తలుచుకుంటూ ఎక్సైటింగ్ అవుతూ ఉంటాడు. ఈ నాటకం చూస్తుంటే నాకు ఏదో అయిపోతుంది.అని అంటూ ఉంటారు. ఇక చివర్లో కార్తీక్ తప్పు తెలుసుకుని దీపకాల మీద పడుతుండగా.. ఇక మోనిత ఎంట్రీ ఇచ్చి నేను తల్లిని కాబోతున్నాను.. అని ఒక బిడ్డను కనీ కార్తీక్ నీ మోసం చేయాలని చూస్తుంది. అది మోసం అని తెలుసుకున్న కార్తీక్.. ఇక ఇక అందరూ కలిసి ఒక చోటికి ఎంజాయ్ చేయడానికి వెళ్లి ఎంజాయ్ చేసి కార్ లో వెళ్తుండగా హిమ నాకు డ్రైవింగ్ నేర్పు డాడీ అని అడుగుతూ ఉంటుంది. తర్వాత దీపనే ఎక్కించుకొని హిమ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది అలా చేస్తున్న క్రమంలో యాక్సిడెంట్ జరుగుతుంది.

Advertisement

Karthika Deepam 28 September Today Episode : ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నా మౌనిత…

Karthika Deepam 28 September Today Episode
Karthika Deepam 28 September Today Episode

అప్పుడు కార్తీక్ గతం గుర్తు చేసుకుని దీప దీప ఆగు అని ఒక్కసారిగా కింద పడిపోతాడు. ఇక అప్పుడు దీపా డాక్టర్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. కట్ చేస్తే మౌనిత కార్తీక్ ని ఎలాగైనా ఎక్కడినుంచి తీసుకెళ్లాలని ఆలోచిస్తూ కార్తీక్ ని పిలుస్తూ ఉంటుంది. ఇక మౌనితా, కార్తీక్ అని పిలుస్తూ ఉండగా… శివ సార్ లేరు మేడం అని అంటాడు. అప్పుడు సార్ బయటకు వెళ్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ నీకు వేలకు వేలు జీతం ఇచ్చేది దీనిక అని తిడుతూ ఉంటుంది. అప్పుడు ఎందుకు మేడం సారు ఒక్కడే వెళ్లలేదు.. ఆ వంటలక్క వచ్చి తీసుకెళ్ళింది. ఏదో వంటలక్క నాటకం వేస్తుంది అంట అక్కడికి డాక్టర్ బాబు కూడా ఆ నాటకాన్ని చూడడానికి వెళ్లారు.. అనగానే మౌనిత శివని ఒక్కటి పీకుతుంది.

డాక్టర్ బాబు ఏంట్రా…అని అంటుంది అప్పుడు శివ ఏదో అలవాట్లు పొరపాట్లు లేని మేడం సారీ అని అంటాడు. అప్పుడు నేను నిన్ను నమ్ముకుని కార్తీక్ ని వదిలి వెళ్లాను చూడు నాకు బుద్ధి లేదు అంటూ.. మౌనిత కమ్యూనిటీ హాల్ కి వెళ్లి చూస్తుంది. కానీ కార్తీక్ వాళ్ళు అక్కడ ఉండరు.. ఇక రేపటి ఎపిసోడ్లో డాక్టర్, దీప కలసి కార్తీక్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తారు. అంతలో మౌనిత వస్తుంది. కార్తీక్ అని అంటుండగా.. దీప తనని ఆపుతుంది. తర్వాత స్పృహలో నుంచి బయటికి వచ్చిన కార్తీక్ దీప అని అంటూ ఉంటాడు. ఇక దీప సంతోషంతో తేలిపోతూ ఉంటుంది. మౌనిత మాత్రం ఇక నా పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది.

Advertisement