Karthika Deepam 29 August Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత కార్తీక్ గతమంతా గుర్తొస్తుందని కార్తీక్ ఎలాగైనా తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. సౌందర్య వాళ్లు హోటల్లో ఉండగా అదే హోటల్ కి మౌనిత వెళ్లి కూర్చొని ఉంటుంది. అప్పుడు హిమ, సౌందర్య వాళ్లు మౌనితను చూస్తారు. అప్పుడు మౌనిత వాళ్ళని చూసి భయపడుతూ ఉంటుంది. మళ్లీ మనసులో భయపడకూడదు అని వాళ్ళని తనే వెళ్లి మాట్లాడిస్తుంది. మౌనిత వాళ్లతో మాట్లాడుతూ ఉండగా కార్తీక్ ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ వాళ్ళు ఎక్కడ చూస్తారో అని కంగారుపడుతూ లాక్కొని కట్ చేస్తుంది. మౌనితని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావా అని సౌందర్య అడుగుతుంది. అప్పుడు మౌనిత డ్రామా ప్లే చేసి వాళ్ళని నమ్మించి అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
Karthika Deepam 29 August Today Episode : మౌనిత ఏం డ్రామా ప్లే చేయబోతుంది..
కట్ చేస్తే దీప కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దీప దగ్గరికి డాక్టర్ వచ్చి ఏమైందమ్మా అని అడుగుతాడు. అప్పుడు ఏదైనా పని చేస్తానన్నయ్య అని అంటుంది. అప్పుడు ఏం పని చేస్తావమ్మా అని అడుగుతాడు. తను బాధ పడుతూ ఉండగా డాక్టర్ తనకి ధైర్యం చెప్పి నువ్వు కంగారు పడకమ్మా ఏం కాదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మౌనిత ఇంటికి వస్తుంది. కార్తీక్ మౌనిత కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. మౌనిత దగ్గరికి వచ్చి నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేదు.. అని మౌనితతో గొడవ పడతాడు. చివరగా మౌనిత కార్తీక్ సారీ చెప్పి ఎందుకు ఫోన్ చేసావ్ అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ మన హైదరాబాద్ వెళ్ళిపోదాం. అక్కడ బోటిక్ బిజినెస్ చాలా బాగుంటుంది అని అంటాడు. అప్పుడు మౌనిత కంగారుపడుతూ ఏదో ఒకలాగా తనని వెళ్లకుండా ఆపుతుంది. కట్ చేస్తే చంద్ర వాళ్లు ఇల్లు మారి ఇల్లు సర్దుతూ ఉంటుంది. అప్పుడు సౌర్య. పిన్ని పిన్ని అని పిలుస్తూ ఉండగా.

చంద్ర ఉలుకు పలుకు ఉండదు. అప్పుడు ఏమైంది పిన్ని ఎందుకు నీకు ఎందుకు అంత కోపం అని అంటుంది. అప్పుడు ఆ ఇల్లు చాలా బాగుండేది ఉన్నపలంగా దాన్ని కాళీ చేపించావు. అని అంటూ ఉంటుంది. అంతలో గండ ఆటోని తీసుకొస్తాడు. ఆటో పైన అమ్మ నాన్న ఎక్కడున్నారు అని రాపించమని సౌర్య చెప్పడంతో గండ ఆటో పై రాయించి తీసుకొని వస్తాడు. అది చూస్తూ సౌర్య ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే దీప డాక్టర్ బాబు గురించి పిల్లల గురించి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలాగైనా డాక్టర్ బాబు ని కలవాలి. అప్పుడు డాక్టర్ బాబే అంత చూసుకుంటాడు అని అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో దీప ఆటలో వెళుతుండగా.. కార్తీక్ ని చూస్తుంది. కార్తీక్ దగ్గరికి వచ్చేలోపు తను వెళ్ళిపోతాడు దీపా అప్పుడు తనని ఫాలో అవుతూ వెళ్తుంది. డాక్టర్ బాబు అని అంటుండగా అంతలో మౌనిత బయటికి వస్తుంది. ఇక రేపు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..