Karthika Deepam 29 September Today Episode : రీ ఎంట్రీ ఇచ్చిన దుర్గ… వణికి పోతున్న మౌనిత… సంతోషంలో తేలిపోతున్న దీప..

Karthika Deepam 29 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది.. ఈరోజు ఎపిసోడ్ 1470 హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. దీప కార్తీక్ ని ఆస్పత్రిలో జాయిన్ చేయించి తనకేం కాకుండా చూడు తనకి గతం గుర్తొచ్చేలా చూడు దేవుడా అని మొక్కుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మౌనిత వచ్చి ప్రోగ్రాం దగ్గరికి వచ్చి అక్కడ ఎవరూ లేకపోయేసరికి అక్కడ అన్న ఒకతని అడుగుతుంది. అప్పుడు దీపను పొగుడుతూ అతను ఏం నాటకం వేసిందో అంతా చెబుతూ ఉంటాడు. అప్పుడు మౌని తా, కార్తీక్ గతం గుర్తు రావడం కోసం ఇదంతా చేసింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఎవరో ఒకతను కళ్ళు తిరిగి పడిపోయారు. వాళ్ళ హాస్పిటల్ కి తీసుకెళ్ళారని చెబుతాడు. అప్పుడు మౌనిత ఇది ఏ హాస్పిటల్లో ఉన్నావు చెప్పు అని దీపకి ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఏమైనా జరిగిందంటే తర్వాత నీ పని ఉంటది అని మౌనితా అంటూ ఉండగా.. అప్పుడు దీప నువ్వేంటి నాకు వార్నింగ్ ఇచ్చేది ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో పో అని గట్టిగా అంటుంది. అప్పుడు మౌనతా అక్కడనుంచి హాస్పిటల్ కి వెళుతుంది. దీప హాస్పిటల్ లో బాధపడుతూ ఉంటుంది అంతలో డాక్టర్ వస్తాడు..

Advertisement

అప్పుడు కార్తీక్ కండిషన్ ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు దీప ట్రీట్మెంట్ చేస్తున్నారూ.. అన్నయ్య కానీ ఆ రాక్షసి ఫోన్ చేసింది దానికి హాస్పిటల్ పేరు నేను చెప్పలేదు కానీ అది ఏదైనా చేసి ఇక్కడికి వస్తుంది.. అప్పుడు డాక్టర్ బాబుకి గతం గుర్తుకొచ్చి దాన్ని నాలుగు పీకాలి దాని పిచ్చిపిచ్చిగా తిట్టాలి అని ఏడుస్తూ నా కోరిక తీరుతుందా అన్నయ్య అని అంటుంది. అప్పుడు డాక్టర్ దీప అని అయితే అన్నాడు కదా.. చూద్దాం ట్రీట్మెంట్ జరుగుతుంది గా అని అంటాడు. ఇక దీప, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇక కార్తీక్ కండిషన్ ఏంటి అన్నది డాక్టర్ దీప డాక్టర్ కి చెప్తూ ఉంటారు. ఈసారికి పర్లేదు కానీ ఇంకోసారి ఇలా బలవంతంగా గుర్తు చేయడానికి ప్రయత్నిస్తే తలలో నరాలు కట్టే చనిపోయే అవకాశం ఉంది అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆయనకి గతం గుర్తొచ్చినట్లేనా అని అడుగుతూ ఉండగా.. అప్పుడు డాక్టర్ ఏమో చెప్పలేం తను కొద్దిసేపట్లో స్పృహలోకి వస్తాడు అప్పుడు చూద్దాం.. అని అంటుండగా నా కార్తీక్ నన్ను గుర్తుపట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. అంతలో మౌనిత వచ్చి కార్తీక్ కార్తీక్ అని అరుస్తూ ఉండగా… ఇష్ అంటూ మౌనితా నోరు మూపిస్తుంది. అప్పుడు కార్తీక్ స్పృహలోకి వస్తాడు..

Advertisement

Karthika Deepam 29 September Today Episode : వణికి పోతున్న మౌనిత…

Karthika Deepam 29 September Today Episode
Karthika Deepam 29 September Today Episode

అప్పుడు దీప నేను దీప డాక్టర్ బాబు అని అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మౌనిత మౌనిత నేనెక్కడున్నాను ఏంటి అని అంటాడు. అప్పుడు మౌనితా సంతోషపడుతూ అక్కడ నుంచి కార్తీక్ ని తీసుకెళ్లి పోతుంది. ఇక దీప బాధ పడుతూ ఉంటుంది. డాక్టర్ ఈ ప్రయత్నం ఫెయిల్ అయినంత మాత్రాన నువ్వు నీ ప్రయత్నాన్ని ఆపవద్దు.. ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలి అని ధైర్యం చెబుతూ ఉంటాడు. ఏం చేద్దాం అన్నయ్య అని దీప అంటూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఏదో ఒకటి చేద్దాం ముందు నువ్వు ఆ బాధలో నుంచి బయటికి రా అని అంటాడు. కట్ చేస్తే మౌనిత కార్తీక్ ని తీసుకెళ్తూ నీడ కార్తీక్ పై పడకుండా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అంతలో దుర్గ వచ్చి కారుకి బైక్ ని గుద్దుతాడు. అప్పుడు దుర్గాన్ని చూసిన మౌనిత అక్కడినుంచి స్పీడ్గా వెళ్ళిపోతుంది. అప్పుడు దుర్గ ఎక్కడికి పారిపోతావే అని మౌనిత అని ఫాలో అవుతూ ఉంటాడు.. కట్ చేస్తే సౌర్య అమ్మానాన్నల టాగ్ నీ ఆటో మీద చూస్తూ.. ఏడుస్తూ ఉంటుంది..

నాకు చాలా భయంగా ఉంది అమ్మ మీరు లేకుండా నేను ఎలా ఉండాలి అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే దీప బాధపడుతూ ఉంటుంది అప్పుడు పెద్ద ఆవిడ టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చి తినమ్మా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు నాకు వద్దు అమ్మ అని అనగానే.. నేను వెళ్లి దానిని నాలుగు దులిపి వస్తాను అని అంటుంది. అప్పుడు దీప అది నువ్వు నాలుగు మాటలు అనగానే వదిలేది కాదు.. మొండిగా తయారైంది అని అంటుంది. అయితే దానికి నీ భర్తను వదిలేస్తావా అని పెద్ద ఆవిడ కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు దీప నువ్వు వెళ్లి గొడవ పడితే మళ్లీ గతం గుర్తు చేసినట్లు అవుతుంది కదా.. అప్పుడు డాక్టర్ బాబుకి ప్రాణాలకు ప్రమాదం కదా అమ్మ అని అంటూ ఉంటుంది. అప్పుడు పెద్ద ఆవిడే మరి ఎలా అమ్మ అని నీరస పడిపోతుంది.. అని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో దుర్గ దీప ని కలుస్తాడు.. దీప జరిగిందంతా చెబుతుంది.. ఇక రంగంలోకి దిగిన దుర్గ.. భయపడుతున్న మౌనిత… ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో తెలుసుకోవాల్సిందే..

Advertisement