Karthika Deepam 3 September Today Episode : కార్తీక్ తన వంటను పొగిడినందుకు సంతోష పడుతున్న దీప… దీపను గుర్తు పట్టకుండా ఉండేందుకు డ్రామాలాడుతున్న మోనిత…

Karthika Deepam 3 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1448 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ దీప చెప్పిన పేర్లను పదేపదే గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే శౌర్య ఎంత తిరిగిన అమ్మ నాన్న కనపడటం లేదు ఏంది అని వారణాసిని అడుగుతుంది. అప్పుడు వాళ్ళు ఉంటే అమ్మ కనపడటానికి అని అనగానే ఒక్కసారిగా తనపై కోప్పడుతుంది. తర్వాత సౌర్య అమ్మ, నాన్న ఫోటోలు ఉన్నాయా ఆ ఫోటోలు చూపిస్తూ అందర్నీ అడగొచ్చు అని అంటూ ఉంటుంది. అప్పుడు వారణాసి మనసులో వాళ్ళు ఎక్కడున్నారు తల్లి చనిపోయారు.. అది నీకు ఎలా అర్థం అవుతుందో ఏంటో అని అనుకుంటాడు. కట్ చేస్తే మౌనిత దీప గురించి ఆలోచిస్తూ భయపడుతూ, కంగారుపడుతూ ఉంటుంది. అంతలో దీప బిర్యాని తీసుకొని వచ్చి డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ బాబు కాదు..

Advertisement

Karthika Deepam 3 September Today Episode :  దీపను గుర్తు పట్టకుండా ఉండేందుకు డ్రామాలాడుతున్న మోనిత…

నాకు ఒక పేరు ఉంది దాన్ని బట్టి పిలవండి అని అంటాడు. అలా పిలవడం నాకిష్టమని దీపా అంటూ… మీరు నన్ను అండి అనకండి అని అంటుంది. మౌనితని డాక్టర్ అమ్మ, కార్తీక్ ని డాక్టర్ బాబు అని పదేపదే పిలుస్తుండగా మౌనిత దీపపై కోప్పడుతుంది. అప్పుడు కార్తీక్ ఫోన్ లే.. ఏదో ఒక పేరుతో పిలవని అని అంటాడు. అప్పుడు మౌనిత చేసే పనులు కూడా అడుగుతూ ఉండగా.. దీప నా పేరు అనుకున్న మీ భార్య గురించి కూడా మర్చిపోతున్నారా అసలు మీకు ఏమైంది గతం మర్చిపోయారా.. అని అలా తనకి గతం గుర్తొచ్చేలా మాట్లాడుతుంటుంది. అప్పుడు కార్తీకి దగ్గరుండి బిర్యాని వడ్డిస్తుంది. కార్తీక్ తింటూ చాలా బాగుంది నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు దీప అని గతం గుర్తొచ్చేలా మళ్లీ అన్ని పేర్లు చెబుతూ ఉంటుంది. అప్పుడు ఆ గుర్తులు గుర్తుంది అని అంటాడు. అని తిని తను రూమ్ లోకి వెళ్లి పోతాడు. తర్వాత దీప మౌనిత మధ్య ఘర్షణ మొదలవుతుంది. చూశావుగా బిర్యాని రోజు కావాలి అని అడుగుతున్నాడు ఈనాటికైనా నా డాక్టర్ బాబుని నేను దక్కించుకుంటా అని అంటుంది. మౌనిత మాత్రం భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది.

Advertisement
Karthika Deepam 3 September Today Episode
Karthika Deepam 3 September Today Episode

కట్ చేస్తే సౌర్య భోజనం చేస్తూ సౌర్య వాళ్ళ అమ్మ చేసిన బిర్యాని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వారణాసి ఎందుకమ్మా ఆలోచిస్తున్నావ్ తిను అని అంటాడు. అప్పుడు సౌర్య అమ్మ గుర్తొచ్చింది. వారణాసి అని మళ్లీ ఆ రోజులు ఎప్పుడొస్తాయో అని ఏడుస్తూ ఉంటుంది. వారణాసి సౌర్యకు ధైర్యం చెప్పి ఊరుకో పెడతాడు. కట్ చేస్తే దీప డాక్టర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి జరిగిందంతా చెబుతుంది. నాకు నమ్మకం వచ్చేసింది అమ్మ నా భర్త నా దగ్గరకు వచ్చేసినట్టే అని చెప్తూ సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడు పెద్దావిడ డాక్టర్ బాబు నిన్ను గుర్తుపట్టి ఇంటికి వస్తే అని అనగానే.. పట్టరాని సంతోషం ఉంటుందమ్మా ఆరోజు అని అంటుంది దీప. అప్పుడు డాక్టర్ ఆ మౌనిత నువ్వు గతం గుర్తు చేస్తున్నావని ఇంకాస్త డోస్ పెంచుతుందేమో అని అంటాడు. అప్పుడు దీప అది ఏమి చేసినా నా వంటతో తనని నా సొంతం చేసుకుంటాను అని అంటుంది దీప. నిన్నేమో గుర్తుపట్టడం లేదు తనని భార్యని నమ్ముతున్నాడు నిన్ను గుర్తుపట్టే లోపు వారిద్దరూ ఒకటైతే అని అంటాడు డాక్టర్.

అప్పుడు దీప అలా జరగదు అన్నయ్య అని అంటుంది. అప్పుడు పెద్దావిడ అది దేనికైనా తెగిస్తుంది అమ్మ అని అంటుంది. కట్ చేస్తే సౌర్య వారణాసిని నీ ఫోన్లో ఫోటోలు ఉన్నాయి. అన్నావు కదా అవి ఏవి అని అడుగుతాడు. అప్పుడు వారణాసి నా ఫోన్లో అన్ని పోయాయమ్మ ఒక పని చేద్దాం అయ్యగారిని అడిగి ఫోటోలు పెట్టమందాం అని అంటాడు. అప్పుడు శౌర్య వద్దు.. వాళ్ళుకి నేను ఇక్కడున్నాని తెలిస్తే పదేపదే వస్తారు. రమ్మని అడుగుతారు. నేను ఏదో ఒకటి అంటాను అని అంటుంది. అప్పుడు వారణాసి నువ్వు ఎప్పుడు వెళ్తావు అక్కడికి, హిమ మీద కోపం ఎప్పుడు తగ్గుతుంది అని అడుగుతాడు. అప్పుడు సౌర్య అమ్మానాన్నలు కనపడినప్పుడు వాళ్లతో కలిసి వెళ్తా అప్పటివరకు నన్ను ఏం మాట్లాడించకు అని అంటుంది. కట్ చేస్తే దీప కూరగాయలు తీసుకొచ్చి కార్తీక్ కోసం ఎదురు చూస్తూ.. ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో దీప తీసుకెళ్లి ఇచ్చిన వంట తినుకుంటూ మౌనిత ఒక పెద్ద డ్రామా ఆడుతుంది. దాంతో కార్తీక్ దీపపై కోప్పడుతూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Advertisement