Karthika Deepam 4 July Today Episode : జ్వాలను మెచ్చుకున్న పోలీసులు.. నిరుపమ్ ను రోడ్డు మీద చూసి జ్వాల షాక్.. ఇంతలో మరో ట్విస్ట్?

Karthika Deepam 4 July Today Episode : జ్వాల, నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను బాబాయ్ పిన్ని రాగానే  వాళ్లకు జరిగింది అంతా చెప్పి ఊరు వదిలి వెళ్లిపోతాను అని ఆనందరావు, సౌందర్యతో చెబుతుంది. అప్పుడు సౌందర్య అలా ఏలా వెళతావే, నువ్వు వెళ్ళిపోతే మేము ఏం కావాలి అని అంటుంది. అప్పుడు ఆనందరావు అవును అమ్మా ఏదో కష్టం వచ్చిందని, ప్రేమ విఫలం అయ్యిందని వెళ్లిపోవడం కరెక్ట్ కాదు కదా ఇంకా చాలా జీవితం ఉంది కదా అని అనడంతో జ్వాల మనసుల్లో ఏంటి వీళ్లు నేను వెళతాను అంటే ఇలా మాట్లాడుతున్నారు తెలిసే చేస్తున్నారా నాకేం అర్థం అవ్వట్లేదు, తాతయ్య కళ్లల్లో ప్రేమ కనిపిస్తుంది, నానమ్మ యాక్టింగ్ చేస్తుందా అని అనుకుంటుంది. అప్పుడు జ్వాల అవును నేను వెళతాను అంటే మీకు ఎందుకంత కంగారు అని, నామీద మీకెందుకు అంత స్పెషల్ ఇంట్రస్ట్, నేనెవరో మీరు ఎవరో కదా, మనం ఏదో అనుకోకుండా కలిశాము. సీనియర్ సిటిజన్ అని నిన్ను పిలుస్తాను యంగ్ మాన్ అని అయ్యని పిలుస్తాను, ఏదో రైలు ప్రయాణం చేసినట్టు ఫ్రెండ్షిప్ అయ్యింది ఎవరి స్టేషన్ రాగానే వాళ్లు దిగిపోవాలి.

Advertisement
karthika deepam 4 july 2022 full episode highlights
karthika deepam 4 july 2022 full episode highlights

జీవితం కూడా అంతే కదా సిసి అని అంటుంది అప్పుడు సౌందర్య అదికాదే అందరం అనుకోకుండా కలిసిపోయాం నిన్ను చూస్తుంటే మా కుటుంబ సభ్యురాలిలాగే ఫీల్ అయ్యాము. అంతే తప్ప ఇంకేం ఉంటుంది అని అంటుంది. జ్వాలా మనసులో వీళ్లిద్దరికీ నా గురించి తెలిసే ఇలా ప్రవర్తిస్తారా అని అనుకుంటుంది. తర్వాత జ్వాల ఆటో తోలుకుంటూ ఇక ఇంటికి వెళదాం అని అనుకునే లోపు ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆటో తియ్యమ్మా  అర్జంటుగా వెళ్ళాలి వీరి ఆటో లేవు అనడంతో సరే అని వాళ్లని ఆటో ఎక్కించుకుంటోంది. వెళుతుండగా అందులో ఒకడు సిగరెట్ తాగడంతో, ఆరోగ్యానికి హానికరం అని జ్వాలా అంటుంది దాంతో సరే అమ్మా తాగను అని జేబులో పెట్టుకుంటాడు. తర్వాత ఆటో ఎక్కిన ఇద్దరు కంగారుగా తెల్లవారేసరికి కొలకత్తా వెళ్దాం కదా, పోలీసులు ఐదు లక్షల కోసం కొలకత్తా రారు కదా అని మాట్లాడుకుంటారు. అది విన్న జ్వాల వాళ్లను నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్ళి  పోలీసులకు అప్పచెబుతుంది.

Advertisement

Karthika Deepam 4 July Today Episode : నిరుపమ్ నుంచి 500 చేంజ్ తీసుకున్న జ్వాల

దానితో స్టేషన్ లో ఉన్న పోలీస్ వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకొని డీటెల్స్ అడుగుతాడు. తర్వాత జ్వాలా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆటో ఎక్కిన మరో వ్యక్తి దగ్గర ఛేంజ్ లేకపోవడంతో 500 ఛేంజ్ ఉన్నాయా అని అందరినీ అడుగుతుంది జ్వాల అనుకోకుండా నిరుపమ్ అని చూడకుండా ఛేంజ్ ఉన్నాయా సార్ అని అడగడంతో, నిరుపమ్ జ్వాలకి  500 ఛేంజ్ ఇస్తాడు. దాంతో థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత సౌందర్య ఆనందరావుకు ట్యాబ్లెట్స్ వేసుకోమని ఇస్తుంది. ఇద్దరు శౌర్య గురించి మాట్లాడుతూ ఏం తింటుందో, ఇంత ఐశ్వర్యం  ఉండి కూడా ఆటో నడుపుతుంది, హిమనే తింగిరి అని తెలిస్తే మళ్లీ వెళ్లిపోతుందా అని చాలా బాధపడతారు. తరువాత జ్వాలా ఇంటికి వెళ్లి నిరుపమ్ ఇచ్చిన డబ్బులను చూసి ఏంటి డాక్టర్ సాబ్ ఇలా చేశారు ఏన్ని ఊహించుకున్నాను మిమ్మల్ని బాగా చూసుకోవాలని డాక్టర్ సాబ్కీ భార్యని అనిపించుకోవడం ఎంత గర్వంగా ఉంటుందో  అని ఆశ పడ్డాను. తింగరి ఎలా వుండేది, ఎలా మాట్లాడలేదు నా బాధ్యత నా బాధ్యత  అని నా జీవితాన్ని లాగేసుకుంది అని అనుకుంటూ, ఈ నోట్లు డాక్టర్ సాబ్ కి  సంబంధించిన బహుమతి వీటిని నేను ఖర్చు పెట్టాను అని అనుకుంటూ డబ్బును దేవుడి దగ్గర పెడుతుంది.

ఇది అంతా కలా అయితే బాగుండు అని చాలా బాధ పడుతుంది. తర్వాత హిమా కార్తీక్- దీప ఫోటో దగ్గర శౌర్య గురించి బాధపడుతూ ఉంటే, అక్కడికి నిరుపమ్ వచ్చి పెళ్లి షాపింగ్ కి వెళదాం అని హిమతో అంటాడు, నిరుపమ్ హిమతో నేను ప్రామిస్ చేస్తున్నాను హిమ నాతో ఉన్న ప్రతి క్షణం నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తాను ప్రతిక్షణం మనకి చాలా విలువైనది అని అంటాడు. తర్వాత  జ్వాల దగ్గరి కి హైద్రాబాద్ క్లబ్ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి డీటేల్స్ అడుగుతారు, హైద్రాబాద్ క్లబ్ వాళ్లు ధైర్యంగా ఉన్నవాళ్లకి ప్రతి ఏడాది బహుమతి ఇస్తారని, మీరు దొంగను పట్టించేందుకు ఈసారి మీకు ఇస్తున్నామని చెప్పి వెళతారు. తరువాత హిమ, నిరుపమ్ కొబ్బరిబోండం తాగుతూ ఉంటారు, నిరుపమ్ డబ్బులు ఇద్దామని పర్స్ తీసి జ్వాల ఇచ్చిన 500 నోట్ చూస్తూ ఉంటాడు. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగింపు అవుతుంది.

Advertisement