Karthika Deepam 6 September Today Episode : మోనిత ఆడుతున్న డ్రామాని బయట పెట్టిన దీప… ఇక కార్తీక్ ఏం చేయబోతున్నాడో చూడాలి మరి..

Karthika Deepam 6 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1450 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత దీప పెట్టిన టిఫిన్ తిని వాంటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. దానికి కార్తీక్ కంగారుపడుతూ డ్రైవర్ శివాని పిలిచి డాక్టర్ను తీసుకురమ్మని చెప్తూ ఉంటాడు. దీప కి ఇదంతా డ్రామాని డౌట్ వస్తుంది. కార్తీక్ దీప ని మీకు ఏదో పనులు ఉంటాయి కదా మీరు వెళ్ళండి. డాక్టర్ గారు వస్తున్నారంట్లే అని దీపాన్ని పంపించేస్తాడు. డాక్టర్ వచ్చి మౌనిత నీ తను చెక్ చేసి ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్తాడు. అప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్తారు అక్కడ డాక్టర్ డాక్టర్ కి ముందే చెప్పి కార్తీక్ ఫుడ్ పాయిజన్ అయింది. విషం కలిసింది అని చెప్పమని చెప్తుంది. కార్తీక్ బయట కూర్చుని ఉంటాడు. అంతలో శౌర్య ,వారణాసి హాస్పిటల్ కి మందుల డబ్బాలు తీసుకొని అటువైపుగా వస్తూ ఉంటారు.

Advertisement

Karthika Deepam 6 September Today Episode : మోనిత ఆడుతున్న డ్రామాని బయట పెట్టిన దీప…

ఇక కార్తీక్ మౌనిత దగ్గరికి వస్తాడు. ఇక మౌనిత డ్రామా మొదలుపెట్టి అది అక్కడే ఉంటే నా ప్రాణాలకి ప్రమాదమే అంటూ.. దీపపై కోపం వచ్చేలా సీన్ పండిస్తుంది. అప్పుడు కార్తీక్ కొద్దిసేపు ఆలోచించి తర్వాత తన కోపంగా దీప దగ్గరికి వస్తాడు. వచ్చి నా భార్య ని చంపాలని చూస్తావా తను తిని టిఫిన్లు విషయం కలుపుతావా.. అసలు నాకు మౌనిత కి వేరువేరు టిఫిన్ ఎందుకు చేసి తీసుకొచ్చావ్ నేను అప్పుడే అర్థం చేసుకొని ఉండాల్సింది. ఎందుకు ఇలా చేస్తున్నావ్ వాళ్ళు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు డబ్బులు కోసం ఇలా చేస్తారని నువ్వు నిజంగానే అలాగే చేశావు. అసలు నీకేం కావాలి డబ్బుల, నేను కావాలా.. నాకు పెళ్లయింది కదా.. ఎంత మతిమరుపున్న భార్యాభర్తల బంధం ఏనాటికి మర్చిపోరు. అందుకే ఎప్పుడు పరాయి మగవాడి మీద ఆశ పెట్టుకోకు ఇంకా ఎప్పుడు నీ మొఖం నాకు చూపించకు అని తిట్టి వెళ్ళిపోతాడు.

Advertisement
Karthika Deepam 6 September Today Episode
Karthika Deepam 6 September Today Episode

 

 

 

 

అప్పుడు దీప ఎందుకు భగవంతుడా ఇలా చేస్తున్నావ్ నా భర్త చేత నన్ను ఎందుకు ఇలా అనిపిస్తున్నావని బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే సౌర్య తన పుట్టినరోజు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వారణాసి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు మా అమ్మ నాన్నల గురించి తప్ప ఇంక నేనేం ఆలోచిస్తాను అంటుంది. అప్పుడు వారణాసి మనం ఎలాగో వెతుకుతున్నాం కదా అమ్మ.. అప్పుడు వాళ్ళ అమ్మానాన్న గురించి అంత వారణాసికి చెప్తూ ఉంటుంది. అప్పుడు రేపు నన్ను గుడికి తీసుకెళ్ళు వారణాసి అని అంటుంది. అప్పుడు వారణాసి స్పెషల్ ఏమన్నా ఉందా అని అడుగుతాడు. అప్పుడు రేపు గుడిలో చెప్తానులే అని అంటుంది. కట్ చేస్తే దీప డాక్టర్ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెబుతుంది. అప్పుడు పెద్ద ఆవిడ మౌనిత అని నిజంగానే విషమిచ్చి చంపేయాల్సింది పీడ విరిగూడ అయ్యేది..

లేకపోతే ఏదో కలిపిందని తన భర్తతోనే తిట్టిస్తుందా అని చెడా మడా తిడుతూ ఉంటుంది. అప్పుడు దీప ఏడుస్తూ దానిని నిజంగానే చంపేయాలని అంత కోపం వస్తుందమ్మా.. అప్పుడు డాక్టర్ కంగారు పడకమ్మ… తిట్టింది నీ భర్త ఏ కదా అమ్మ.. అది కాదు అన్నయ్య రేపు నా పిల్లలు పుట్టినరోజు గుడికి అయిన తీసుకెళ్లి పిల్లల పేర్లు మీద అర్చన చేయిద్దాము అని అనుకున్నాను. అది ఇంతలోనే ఇలా చేసింది అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు రేపు ఏం జరుగుతుందో చూద్దాం నువ్వు బాధపడకు అని పెద్ద ఆవిడ డాక్టర్ దీపకు ధైర్యం చెప్తారు. ఇక రేపటి ఎపిసోడ్లో మౌనిత కార్తీక్ ని గుడికి తీసుకెళ్లి అగ్ని మీద ప్రమాణం చేసి ఇక వంటలక్కని కలవను.. మాట్లాడను.. అని చెప్పమని చెప్తుంది. అప్పుడు కార్తీక్ చెప్పబోతున్న దీప ఎంట్రీ ఇచ్చి నేను మాట్లాడకూడదని అంత తప్పు ఏం చేశాను నేను ఈ తప్పు చేయలేదని నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాను అని ప్రమాణం చేస్తుంది. అప్పుడు మౌనిత కంగారు పడుతూ ఉంటుంది ఇక రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి మరి..

Advertisement