Karthika Deepam 9 September Today Episode : దీపకి దగ్గరవుతున్న కార్తీక్… ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మోనిత…

Karthika Deepam 9 September Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1453 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప కార్తీక్ ని గుర్తు తెచ్చుకోండి మీకు గుర్తొస్తుంది అని అంటుంది. చిన్నగా గుర్తులు చెబుతూ తనకి గుర్తొచ్చేలా చేస్తూ ఉంది. అప్పుడు కార్తీక్ నేను అక్కడ నిలబడి అందరిని మా ఇంటికి ఎలా వెళ్లాలి అని అడుగుతూ ఉండగా.. దీప వచ్చింది.. ఇక వంటలక్కే నన్ను తీసుకొని వచ్చింది.. అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ అంత కరెక్ట్ గా చెప్పానా అని అడుగుతాడు. అప్పుడు దీప ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు అని అంటుంది దీప. కానీ మోనిత మండిపోతూ ఉంటుంది. అప్పుడు ఎందుకు నీకు కోపం తను నన్ను తీసుకువచ్చింది లేకపోతే నేను ఎటు వెళ్ళిపోయే వాన్ను అని దీప ని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు దీప మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత అని అంటుంది. అప్పుడు మౌనిత నీ బాధ్యత ఏంటి అని దీపని తిడుతూ ఉండగా కార్తీక్ కు సారీ చెప్పు తనకి అని అంటాడు. అప్పుడు మౌనిత దీపకి కోపం వచ్చేలా.. మాయన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చినందుకు చాలా థాంక్స్ అని దీపని కౌగిలించుకొని చెప్తూ ఉంటుంది.

Advertisement

అప్పుడు దీప నువ్వు పదిసార్లు మా ఆయన అన్నంత మాత్రాన మా ఆయన మీ ఆయన అయిపోడు.. నువ్వు అప్పుడు కూడా ఇలాగే చేసావే నిన్ను అప్పుడు ఆయన తన్ని తరిమేసాడు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఇలా మీరు మంచిగా ఉండండి అని అంటాడు. అప్పుడు దీప సరే డాక్టర్ బాబు నేను వెళ్తున్న రేపు వినాయక పండుగ జరుపుకుంటున్నాను మీరు కూడా రావాలి అని అంటుంది. అప్పుడు కార్తీక్ తప్పకుండా వస్తాను వంటలక్క అని నవ్వుతూ అంటాడు. అప్పుడు దీప సంతోషంగా ఇంటికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే సౌర్య వినాయకుడు బొమ్మలు అమ్మడానికి వెళ్తా అని అంటూ ఉండగా.. చంద్ర, గండ ఎందుకమ్మా నీకు అంత బాధ వద్దమ్మా నువ్వు చిన్నపిల్లవి అని అంటుండగా… అప్పుడు సౌర్య ఇంట్లో ఉంటే ఊసుపోవడం లేదు అలా బయటికి వెళ్తుంటే అమ్మానాన్నలు కనిపిస్తారేమో చూడాలి ఈ వినాయకుడు దయవల్ల అని తను వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మౌనిత దీపా, కార్తీక్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ.. వినాయకుడు పండక్కి వెళ్లకుండా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఏం ఆలోచిస్తున్నావు మౌనిత అని అంటాడు. అప్పుడు మౌనిత దీప దగ్గరికి మీరు వెళ్లొద్దు అని అంటుంది. నాకు అంత హెల్ప్ చేసింది తప్పదు అంటాడు.

Advertisement

Karthika Deepam 9 September Today Episode : దీపకి దగ్గరవుతున్న కార్తీక్…

Karthika Deepam 9 September Today Episode
Karthika Deepam 9 September Today Episode

అప్పుడు మౌనిత నాకోసం వెళ్లకుండా ఉండు అంటుంది. అప్పుడు కార్తీక్ సరే నేను వెళ్ళను కానీ దీపనే ఇక్కడికి రమ్మను.. లేకపోతే నేను అక్కడికి వెళ్తాను అని అంటుండగా.. సరే దాన్ని ఇక్కడికే రమ్మంటాను అని అంటుంది. అప్పుడు సరే అని కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక మోనిత దీప వేస్తున్న ఎత్తులకి ఏం చేయాలో అర్థం కాక అన్ని విసిరేస్తు ఉంటుంది. కట్ చేస్తే దీప పెద్దవాడికి జరిగిందంతా చెప్పి నాకు దేవుడు అందినట్లే అందించి మళ్లీ దూరమయ్యేలా చేస్తున్నాడు అని అంటుంది. అప్పుడు పెద్దావిడ నువ్వు తప్పు చేశావు నీకు దొరికినప్పుడు నీ వెంట పెట్టుకుని రావాలిగాని దాని దగ్గరికి ఎందుకు తీసుకెళ్లావ్ అని అంటుంది. అప్పుడు దీప నేను అట్లా తెచ్చుకోవాలంటే ఎప్పుడు తెచ్చుకునే దానిమ్మ మోనితోని వదిలేసి నా భర్త నా దగ్గరికి రావాలి అని అంటుంది. అప్పుడు డాక్టర్ కూడా వచ్చి అవును దీప నువ్వు చేసింది కరెక్టే తనంతట తానే రావాలి తప్ప నువ్వు బలవంతంగా తీసుకొస్తే మళ్లీ కార్తీక్ దృష్టిలో నువ్వు బ్యాడ్ అయిపోతావ్ అని అంటుంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో మౌనిత వెళ్లి దీప పిలుస్తుంది. అప్పుడు సరే తప్పకుండా వస్తాను అని దీప అంటుది. ఇక కార్తీక్ మౌనిత వినాయకుడి విగ్రహం కొనడానికి వెళ్తూ ఉండగా.. కార్తీక్, సౌర్య చూసి ఆగి మోనిత కు సౌర్యను చూపిస్తూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..

Advertisement