Koratala shiva : కొరటాల శివ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే, అలా జరగలేదు.

Koratala Shiva : కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఆచార్య మూవీ బాక్సాఫీస్ ముందు నిరుత్సాహ పరిచిన సంగతి మనందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి సినిమా చేయడంతో సాధారణంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలకు విరుద్ధంగా సినిమా డిజాస్టర్ గా నిలిచి ప్రేక్షకులను మరియు డిస్ట్రిబ్యూటర్స్ ను నిరుత్సాహపరిచింది. ఇలా జరిగిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ కొరటాల శివాను కొంత ఇబ్బందికి గురి చేసినట్లు మరియు జూబ్లీహిల్స్ లో ఉన్న దాని ఖరీదైన ప్లాట్ ను అమ్మేసి ఆ డబ్బులు ఇస్తున్నారని ప్రచారం జోరుగా సాగింది.

Advertisement

ఈ వార్తలను అన్నిటినీ ఖండిస్తూ కొరటాల శివ స్నేహితులు స్పందించినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తర్వాత చాలా గ్యాప్ తోని మెగాస్టార్ మరియు మహేష్ బాబుతో కలిసి ముందుగా ఆచార్య సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. కానీ తరువాత రామ్ చరణ్ తో చేస్తే బాగుంటుందని ప్రపోజల్ రావడంతో రామ్ చరణ్ రాము కూడా వాటాదారులుగా ఉంటామని ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో అదేవిధంగా సినిమాని నిర్మించడం జరిగింది. కథలో అనేక మార్పులు చేర్పులు చేసి సినిమాలో రామ్ చరణ్ మరియు చిరంజీవి పాత్రను తెరకెక్కించి ఏప్రిల్ 29న ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు.

Advertisement

Koratala shiva : కొరటాల శివ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమే, అలా జరగలేదు.

Koratala Siva Acharya movie financial gossips are not true
Koratala Siva Acharya movie financial gossips are not true

అనుకున్న విధంగా సినిమా రాకపోగా థియేటర్లో డిజాస్టర్ గా నిలిచి కోట్ల రూపాయల నష్టానికి దారి తీసింది. ముందుగా ఈ సినిమా నాలుగు కోట్ల రూపాయలు లాభానికి నిర్మాత నిరంజన్ రెడ్డి నుంచి కొరటాల శివ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. దీంతో డిస్ట్రిబ్యూషన్ కూడా తానే చేశారని సినిమా భారీగా నష్టపోయిన నేపథ్యంలో కొన్ని ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు తనని ఇబ్బంది పెట్టారని దాంతో డబ్బులు తనకున్న ప్లాట్లు అమ్మేసి సర్దుబాటు చేసినట్లు చెప్పారు. మిగిలిన డిస్ట్రిబ్యూటర్లు కూడా కొరటాల శివ ఆఫీస్ లో తిష్ట వేయడంతో కొరటాల శివ పూర్తిగా ఇబ్బందులకు గురైనట్లు ప్రచారం జరిగింది.

అయితే ఇలా వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే అయినప్పటికీ చిరంజీవి మరియు రామ్ చరణ్ కల్పించుకొని డబ్బు సర్దుబాటు చేయడంతో డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గినట్లు కొరటాల శివ సన్నిహితులు మరియు స్నేహితులు తెలియజేయడం జరిగింది. కొరటాల శివ ఈ విషయం కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని తను చాలా ఫ్రీగా ఉన్నట్లు ఆయన ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాపై దృష్టి పెట్టారని తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లోని ఫ్లాట్ అమ్మకానికి పెట్టినట్లు మరియు ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్నట్లు వస్తున్న వార్తలని అవాస్తవమని కొట్టి పారేశారు.

Advertisement